నమ్మకం ఒక వైపు… అమ్మకం ఒక వైపు…

  •  టికెట్లు, సీట్లు, పదవులు అమ్ముకునే నాయకత్వం ప్రతిపక్షాలది
  •  పది అసెంబ్లీ స్థానాలు గెలిచి కేసీఅర్‌ ‌కు అండగా నిలబడదాం
  •  మెదక్‌ ‌ప్రగతి శంఖారావం బహిరంగ సభలో మంత్రి హరీష్‌ ‌రావు

మెదక్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: ‌మెదక్‌ ‌జిల్లా కావాలనేది కొన్ని దశాబద్దాల కల. ఇందిరాగాంధీ  మాట ఇచ్చారు. జిల్లా చేస్తాం, రైలు తెస్తాం అని తేలేదు. సీఎం కేసీఆర్‌  ‌మాట ఇచ్చారు చేసి చూపెట్టారు..అని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు.బుధవారం మెదక్‌ ‌ప్రగతి శంఖారావం బహిరంగ సభలో మంత్రి హరీశ్‌ ‌రావు మాట్లాడుతూ..రైల్‌ ‌వచ్చింది.. మెడికల్‌ ‌కాలేజీ వచ్చింది.. మంజీరా హల్దీ మీద చెక్‌ ‌డ్యాం వచ్చింది.. రింగ్‌ ‌రోడ్డులు వచ్చాయి.. మిషన్‌ ‌భగరీథ వల్ల ఇంటింటికి నీళ్లు వచ్చాయి.. తెలంగాణ రావడం వల్ల కేసీఆర్‌  ‌సీఎం కావడం వల్ల ఇది సాధ్యమైంది..అన్నారు. ఆశ్చర్యపోయే విధంగా మెదక్‌ అబివృద్ధి జరిగిందనీ..కాంగ్రెస్‌, ‌బిజేపీ వాళ్లు తిట్ల పురాణం.. ఒకరికంటే ఒకరు పోటీ పడుతున్నరు.. కానీ సీఎం  పుట్ల కొద్ది వడ్లు పండించి, దేశంలో తెలంగాణను నెంబర్‌ ‌వన్‌ ‌గా ఉంచడంలో పోటీ పడుతున్నరు.

అన్నారు.ప్రతిపక్షాలు తిట్ల కోసం పోటీ పడితే, కేసీఆర్‌  ‌పుట్ల కొద్ది వడ్లు పండించడంలో పోటీ పడుతున్నరు..తెలంగాణ వచ్చిన నాడు మెదక్‌ ‌జిల్లాల్లో లక్షా 17వేల ఎకరాల్లో సాగు అయితే, నేడు నాలుగు లక్షల ఎకరాల్లో సాగు అవుతున్నదన్నారు. మ్యాజిక్‌ ‌చేస్తే, మంత్రం వేస్తే ఇది కాలేదు. కేసీఆర్‌ ‌గారు కష్టపడితే అయ్యింది..అన్నారు.24 గంటల కరెంట్‌ ఇచ్చారు, చెరువులు బాగు చేశారు, కాళ్వేశ్వరం జలాలు పొలాలకు మళ్లించిండు అందువల్ల అద్భుతమైన పంట పండుతున్నది. మెదక్‌ ‌జిల్లా అంటే మెతుకు జిల్లా, కానీ సమ్యైక పాలనలో తినడానికి మెతుకు లేని జిల్లాగా మారింది. సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వంలో పూర్వ వైభవం తెచ్చుకున్నం. పక్కన రెండు రాష్ట్రాలకు అన్నం పెట్టే స్థాయికి మెదక్‌ ఎదిగింది..అని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. ఎండకాలంలో తూఫ్రాన్‌ ‌దగ్గర హల్దీ వాగులో చెక్‌ ‌డ్యాంలు దుంకుతున్నయి.. ఇది కలలో కూడా అనుకోలేదు.. మంజీరాకు నీళ్లు వస్తయని.. కలలో కూడా అనుకోనివి నిజం చేసి చూపిండు కేసీఆర్‌ అని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు.

కేసీఆర్‌ ‌ది అభివృద్ధి వాదం, కానీ ప్రతిపక్షాలది అబద్దాల నినాదం..ఎప్పటికైనా అబద్ధాల మీద గెలిచేది, నిలిచేది అభివద్దే. చేసిన మంచి పనులే గెలుస్తాయి..కేసీఆర్‌ అం‌టే తెలంగాణ ప్రజలకు నమ్మకం..రానేరాదన్న తెలంగాణను ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడి తెచ్చిండు కేసీఆర్‌.. ‌బక్కపల్చని నాయకుడితో తెలంగాణ అయితదా అన్నరు..కాళేశ్వరం నీళ్లు తెస్తా అంటే ఎట్ల సాధ్యమైతది అన్నరు. కానీ నిజం చేసి చూపారు అని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు.ఎండాకాలంలో కాళేశ్వరం గేటు ఎత్తితే హల్దీ, మంజీరా నుంచి నిజాం సాగర్కు జలాలు వెళ్లింది..24 గంటల కరెంట్‌ ఇస్తామంటే జానారెడ్డి అది అసాధ్యం అన్నరు.. కానీ 24 గంటల కరెంట్‌ ‌గత 9 ఏండ్లుగా ఇచ్చి చూపిన నాయకుడు మన కేసీఆర్‌ అని పేర్కొంటూ..రైతు బంధు ఇస్తామంటే ఎన్నికల తర్వాత ఇవ్వరు అన్నరు.

కానీ 11 విడతల 72వేల కోట్లు ఎకరానికి పదివేలు ఇచ్చి చూపిన నాయకుడు కేసీఆర్‌..‌కల్యాణ లక్ష్మీ, రైతు బీమా ఇలా ఎన్నో ఉన్నాయి..గెలవగానే పింఛన్లు వెయ్యి నుంచి రెండు వేలు చేశారు.. రైతు బంధును పెంచారు..నమ్మకానికి మారు పేరు కేసీఆర్‌ అయితే, ప్రతి పక్షాలు అమ్మకానికి మారు పేరు..అని మంత్రి హరీష్‌ ‌రావు ప్రతిపక్షాలను విమర్శించారు.టికెట్లు, సీట్లు, పదవులు అమ్ముకునే నాయకత్వం వారిది.. నమ్మకానికి ప్రతీక అయిన కేసీఆర్‌ ‌ను అందరు ఆశీర్వదించాలి..నమ్మకం ఒకవైపు, అమ్మకం మరొక వైపు ఉంది. అందరూ నమ్మకం వైపు నిలబడాలి..గత ఎన్నికల్లో మెదక్‌ ‌లో పదికి 9 సీట్లు గెలిపించాం. ఈసారి అందరి ఆశీస్సులు, గులాబీ సైనికుల కృషితో పదికి పది సీట్లు గెలిపించి సీఎం కి కానుకగా ఇద్దాం..అందరం కలిసి పని చేద్దాం..అని మంత్రి హరీష్‌ ‌రావు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page