‘‘ఇతర దేశాలతో పోల్చితే మన దేశం పూర్తిగా ఆనాగరికమైన నిర్ణయాలతో ప్రధాన వార్తాలలో నిలుస్తుంది. వాస్తు జ్యోతిషం అమలు చేయాలని, బెనారస్ విశ్వవిద్యాలయం భూతవైద్యం కోర్సులను ప్రవేశపెట్టడం,ఆవు మూత్రంలో ఎంత బంగారం దాగుందో పరిశోధించాలని కోరడం పూర్తిగా అటవిక ఆలోచనలకు నిదర్శనం.’’
ఒకనాడు గురజాడ మతములన్ని మాసిపోవును జ్ఞానమొక్కటే గెలిచి నిలుచును అన్నాడు ఆ మాట నెరవేరే రోజు మనకైతే ఇప్పటికైతే కనబడుట లేదు. ఎందుకంటే ఇంత ఆధునిక కాలం దాపురించి ప్రపంచమంత విజ్ఞానంవైపు శరవేగంగా పయనిస్తుంటే మన దేశ స్వార్థ రాజకీయ నాయకులు మాత్రం ఈ ప్రపంచానికే మార్గదర్శకమైన ఒక సిద్ధాంతాన్ని తొలగించడం ప్రపంచవ్యాప్తంగా చర్చ నీయాంశంగా మారింది. Darwins theory of evolutionఱశీఅ ను హేతుబద్దీకరణ పేరుతో సి.బి.ఎస్.సి పదవ తరగతి సిలబస్ నుండి NCERT తొలగించింది.ఈ విధమైన నిర్ణయంపై దేశవ్యాప్తంగా మేధావులు, శాస్త్రవేత్తలు 1800 మంది కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు ఈ విధానం తప్పని డార్విన్ మానవ పరిణామ సిద్దాంతం పాఠ్య పుస్తకాలలో తిరిగి ముద్రించాలని కోరారు. కోపర్నికస్, గెలీలియో,బ్రూనో టెలిస్కోప్ ను కనుగొని సూర్యుడు దేవుడు కాడని, బల్లపరుపుకాదనీ, గోళాకారంలో ఉన్నాడనీ,అది సాధారణ నక్షత్రమేననీ, ఆలాగే విశ్వానికి కేంద్రం భూమి కాదని, భూమి బల్లపరుపుకాదనీ, గోళాకారమనీ, అది సౌరమండలంలో భాగమని, భూమి సూర్యుని చుట్టూ తిరుగు తుందని నిరూపించి మత ఆభిజాత్యాన్ని ఆణచివేశారు.
ఆనాటి వరకూ మనిషి భూకేంధ్ర సిద్ధాంతాన్ని నమ్మాడు.దీనితో మతం సైంటిస్టులపై కక్ష్య కట్టింది.దైవ విశ్వాసంలో కల మనిషికి తొలిసారిగా దైవంపై ఆపనమ్మకం ఏర్పడింది.ఇది చర్చిని కదిలించి వారిని ఆత్మరక్షణలో పడేసింది.దాదాపు ఇదే టైంలో చార్లెస్ డార్విన్ మనిషి ఆవిర్భావం మీద విశ్లేషణాత్మక పరిశోధన చేశాడు.మనిషి ఉధ్భవం పరిణామ ఫలితమేనని సంచలన ప్రకటన చేసి మతాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఆంతకు ముందువరకు దేవుడే మనిషిని సృష్టించాడనీ, ఆరురోజులలో విశ్వాన్ని మ్నెత్తాన్ని సృష్టించి,ఏడో రోజైన ఆదివారం విశ్రాంతి తీసుకున్నాడని ప్రభోధించిన మతానికి చావుదెబ్బ తగిలింది.దేవుడే మనిషిని సృష్టించాడనే వాదాన్ని కాకుండా మనిషి ఉద్భవం కాదని,మనుషులు పరిణామ ఫలితంగానే ఏర్పడినారని నిరూపించారు.
మనిషి కోతిలాంటి జీవి నుంచి ఉధ్భవించాడన్నారు.ఆంతేగాని దీనికి దైవకృపకు సంబంధం లేదని ప్రకటించారు.ఇది బైబిలు మీద పెద్డదెబ్బ వేసింది.డార్విన్ మీద డైరక్టుగా దాడి చేసింది మతం.కొందరు మతవాదులు నీవు కోతినుంచి పుట్టా వేమెరీగాని మేము ఉత్తముడైన మనిషి నుండే పుట్టామని చాలా ఆవమానకరంగా మాట్లాడారు.మతాలను దేవుళ్ల నమ్మకాలను సజీవ సమాధి చేసి పరిణామ సిద్దాంతానికి ప్రాణంబోసి సృష్టివాదాన్ని అంతం చేసి విజ్ఞాన శాస్త్ర వెలుగులను ఈ విశ్వమంతటికి అందించిన మహానీయుడు డార్విన్. ఈ సిద్దాంతం ప్రపంచంలో ఎన్నో కొత్త ఆవిష్కరణలకు మూలస్తంభం అటువంటి థియరీని కొందరు రాజకీయ అవసరాల కోసం సైన్స్ ను రాబోయే తరాలకు తెలియనివ్వకుండా పాఠ్య పుస్తకాల నుండి తొలగించడం సిగ్గుచేటు.
ఇది శాస్త్రీయపరంగా హేతుబద్దమైన ఆలోచనలపై ప్రత్యక్ష దాడి చేసి పిల్లల మెదళ్లలో సృష్టివాదాన్ని బోధించి మూఢత్వాలను నింపే ప్రయత్నంలో మునిగిపోయారు.పాఠశాల విద్యార్థులకు శాస్త్రీయ విద్యకు బదులు మతంతో అంధవిశ్వాసాలతో కూడిన విద్యను అందించి దేశాన్ని మరల అటవిక రాజ్యంలోకి తీసుకెళ్లే కుట్రకు పాలకులు తెరలేపారు. కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక బద్దంగా ప్రజలను విద్యార్థులను తప్పుదోవ పట్టించే పనిలో నిమగ్నమై ఉంది.గతం నుండి కూడా వివిధ అంశాలను రాజ్యాంగం నుండి తొలగిస్తూ వస్తుంది లౌకికవాదం అనే పదం తొలగించాలనే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా మనువాదం అమలుపరచడానికి చకచక పనులు మొదలుపెట్టింది. ప్రభుత్వాలు ప్రజలకు మేలుజరిగి చైతన్యపూరితమైన విధానాలు తీసుకురావాలి కానీ ఇతర దేశాలతో పోల్చితే మన దేశం పూర్తిగా ఆనాగరికమైన నిర్ణయాలతో ప్రధాన వార్తాలలో నిలుస్తుంది. వాస్తు జ్యోతిషం అమలు చేయాలని, బెనారస్ విశ్వవిద్యాలయం భూతవైద్యం కోర్సులను ప్రవేశపెట్టడం,ఆవు మూత్రంలో ఎంత బంగారం దాగుందో పరిశోధించాలని కోరడం పూర్తిగా అటవిక ఆలోచనలకు నిదర్శనం.
ఒక దేశం ఇతర దేశాల పోటీని తట్టుకొని నిలబడాలంటే పాఠశాల స్థాయి నుండే విద్యార్థులకు అత్యాధునిక పరిజ్ఞానాన్ని అందించి నాగరికత వికాసాలను అభివృద్ధి పరుస్తూ మూఢత్వాలను,అనాగరిక సంస్కృతులకు చరమగీతం పాడి జరిగిన వాస్తవిక చరిత్రలను విద్యార్థుల కళ్లముందు ఆవిష్కరించి రేపటి భవిష్యత్తుకు మార్గదర్శక విలువలను అందించడంలో ముందుండే దేశాలే అభివృద్ధి చెందిన దేశాలుగా నిలిచి గెలుస్తాయి.
– అవనిశ్రీ
9985419424