“ఎందుకు 13 ఏళ్ళుగా తెలంగాణపై విషం చిమ్ముతుంది…మోదీ నుంచి ఇవాళా తేజస్వి సూర్య వరకు ఏదో రూపంలో అక్కసు వెళ్ళగక్కుతోంది.. అసలు రాష్ట్ర విభజనతో సంబంధం లేని చర్చలో పదేపదే తెలంగాణ ఏర్పాటు అంశం తేవడం వెనుక ఉన్న చంద్రబాబు, మోదీ హిడెన్ ఎజెండా ఏంటీ..?…బాబు మద్దతు కోసం తెలంగాణ ఏర్పాటును బీజేపీ ఎందుకు అవమానిస్తుంది..?”
తెలంగాణ ఏర్పాటు బీజేపీ పార్టీ ఇప్పటికే జీర్ణించుకోలేక పోతోంది..నరనరానా విషం నింపుకుని అడుగడుగునా తెలంగాణ విభజన పై అక్కసు వెళ్ళగక్కుతోంది..తల్లిని చంపి బిడ్డను చేశారంటూ ప్రధాని మోదీ తెలంగాణ ఏర్పాటుపై పుష్కర కాలంగా విషం చిమ్ముతూనే ఉన్నారు.. పార్లమెంట్ లోపలా బయటా సందర్భం ఏదైనా తెలంగాణ ఏర్పాటును కించపరిచేలా వ్యాఖ్యలు చేయడమే కాషాయ పార్టీ ఎజెండాగా ఉంది..మోదీ నుంచి తాజాగా తేజస్వి సూర్య వరకు తెలంగాణపై అసందర్భ ప్రేలాపనలు చేస్తున్నారు.
తాజాగా తెలంగాణ విభజనపై మరోసారి పార్లమెంట్ సాక్షిగా కాషాయ మూక విషం కక్కింది..
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల 33% చట్ట సవరణ బిల్లు పై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పిచ్చి ప్రేలాపనలు చేశారు..తెలంగాణ విభజనను పాకిస్థాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యా తెలంగాణ ఏర్పాటు పై తన అక్కసును మరోసారి వెళ్ళగగ్గారు..ఇది ఒక బీజేపీ ఎంపీ అభిప్రాయమో, మోదీ అభిప్రాయం కాదు.. బీజేపీ ఆర్ఎస్ఎస్ అభిప్రాయంగానే చూడాలి..కాంగ్రెస్ పార్టీ ఏపీ విభజనను బ్రిటిష్ వాళ్లకంటే ఘోరంగా చేశారని తేజస్వీ సూర్య అహాంకారపు మాటలు పార్లమెంట్ సాక్షిగా నిస్సిగ్గుగా యావత్ భారత జాతి సిగ్గుపడేలా తెలంగాణ ఏర్పాటును అవమానించారు.
తేజస్వి సూర్య తెలంగాణపై రోత మాటలు, అబద్ధాలు మాట్లాడుతుంటే తెలంగాణ బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు..?.. కనీసం వారించే ప్రయత్నం కూడా చేయలేదు.. తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించలేదు..వెరసి తెలంగాణ ఏర్పాటును కించపరిచేలా, తెలంగాణ అస్తిత్వం, ఉనికిని అవమానించేలా మాట్లాడుతుంటే సిగ్గు లజ్జ లేని తెలంగాణ బీజేపీ ఎంపీలు చప్పట్లు కొడుతున్నారా.?.. ఇంతకంటే బానిసత్వం ఏముంటుంది..ఇవేం దరిద్రపు మాటలని చెంపలు వాయించే దమ్ములేదా.?..తెలంగాణ జాతిని తెలంగాణ రాష్ట్రాన్ని అవమానిస్తుంటే కనీసం ఆత్మగౌరవం లేని, అభిమానం చంపుకున్న వెన్నెముక లేని చంచుబడిన నాయకుల్లా వ్యవహరించారు.
“బీజేపీ కూడా పదేపదే తెలంగాణ ఏర్పాటు లో తమ పాత్ర ఉందని వోట్లు అడుగుతుంది కద..మరీ ఇప్పుడు పుష్కర కాలం తర్వాత తెలంగాణ ఏర్పాటు పాక్ ఇండియా విభజన కంటే దారుణంగా ఉంది అంటూ విమర్శలు చేస్తున్నారు..రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ తో పాటు బీజేపీ పాత్ర ఉందా లేదా బీజేపీ చెప్పాలి.. రెండు జాతీయ పార్టీలు విభజన చట్టంలో తెలంగాణకు అన్యాయం చేయలేదా..?”
టీ బీజేపీ ఎంపీలే కాదు తేజస్వీ సూర్య దిక్కుమాలిన మాటలను ఖండించే సాహసం టీకాంగ్రెస్ ఎంపీలు కూడా చేయలేదు..తెలంగాణ పుట్టుకనే అవమానిస్తున్నా తిరగబడలేని తెలంగాణ జాతి ద్రోహులని మరోసారి నిరూపించుకున్నారు..బీజేపీ తెలంగాణ విద్వేష బుద్ధిని నిలదీస్తూ, సభను స్తంభింపజేయమసే ప్రయత్నం కూడా చేయలేదు. తెలంగాణ పట్ల విషం చిమ్మడంలో దొందుదొందే అని స్పష్టమైంది..
తెలంగాణ ఆత్మాభిమానం , ఆత్మగౌరవం, తెలంగాణ రోషం, పోరాట స్ఫూర్తి, అస్థిత్వం హక్కు తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ ఎంపీల్లో కనిపించలేదు.. దిల్లీ బాస్ లకు గల్లీ బానిసలుగా వ్యవహరించారు..వీళ్ళా తెలంగాణ ప్రజలు ఎన్నికుల ప్రతినిధులు..?. తెలంగాణపై దాడి జరుగుతుంటే కనీసం గొంతెత్తి మాట్లాడలేని తెలంగాణ కోసం మాట్లాడుతారని, దిల్లీ తెలంగాణ హక్కులపై గళమెత్తుతారని అనుకోడం తెలంగాణ ప్రజల అమాయకత్వమే అవుతుంది. కొందరు చెప్పులు మోస్తూ పదవులు తెచ్చుకుంటే ఇంకొందరు మూటలు మోస్తూ పదవులు తెచ్చుకుంటున్నారు.ఇలాంటి వాళ్ళకు తెలంగాణ ఎటు పోతే ఏందీ.. తెలంగాణ అస్తిత్వం పై దాడి చేస్తే వాళ్ళకేందీ..
వాస్తవానికి పార్లమెంట్ లో తెలంగాణ సోయి ఉన్న ఎంపీలు, ఆత్మగౌరవం ఉన్న నేతలు ఉంటే ఇవాళ పార్లమెంట్ తెలంగాణ నినాదాలతో దద్దరిల్లేది.. తేజస్వి సూర్య వ్యాఖ్యలపై సభ అట్టుడుకేది.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పై ఎన్ని రాజకీయ విమర్శలున్న, ఆరోపణలున్న సభలో బీఆరెస్ ఎంపీలు ఉంటే పరిస్థితి ఇలాగే ఉండేది కాదు.. తెలంగాణ అస్థిత్వంపై తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై గట్టిగా కొట్లాడేవారు.. గతంలో మోదీ, అమిత్ షా ఇలాగే మాటలు మాట్లాడితే అప్పుడు బీఆర్ఎస్ ఎంపీలు దుమ్ముదులిపారు..సభను స్తంభింపజేశారు..నాడు బీఆరెస్ ఎంపీలు చూపిన తెగువ, తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు చూపించలేదు..పార్లమెంట్ లో తెలంగాణ పుట్టుకపై జరుగుతున్న దాడిని ఖండించని పరిస్థితి, బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు స్పష్టంగా కనిపించింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం గడిచిన రాష్ట్ర విభజనను బీజేపీ జీర్ణించుకోలేక పోతోంది
తెలంగాణపై నరనరానా విషం నింపుకుని అడుగడుగునా అక్కసు వెళ్ళగక్కుతోంది.. ప్రధాని మోదీ నుంచి కార్యకర్తల వరకు తెలంగాణపై విషం చిమ్ముతూనే ఉన్నారు.. సంబంధం లేకున్నా ప్రతీసారీ తెలంగాణ ఏర్పాటును కాషాయ మూక ప్రశ్నిస్తుంది.. తెలంగాణ ఏర్పాటు చేయడమే తప్పుకున్నట్లు విమర్శలు చేస్తుంది..తెలంగాణ ఉద్యమాన్ని అవమానించడమే ఎజెండా కమలం నేతలు పెట్టుకున్నారు..
రాష్ట్ర ఏర్పాటును , తెలంగాణ ఉనికి దెబ్బ తీసేలా పార్లమెంట్ లోపల బయట ప్రకటనలు చేస్తున్నారు.. చంద్రబాబు దోస్తీ కోసం తెలంగాణ ప్రజల త్యాగాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. రెండు కళ్ళ సిద్దాంత బాబుకు మోదీ మద్దతు ఇస్తున్నారు.. మోదీ తల్లిని చంపి బిడ్డను వేరు చేసాడంటాడు ..ఇక్కడ తల్లీ ఎవరు మధ్యలో మద్రాసు ప్రెసిడెన్సీ నుండి విడిపోయి వచ్చి కుట్రతో తెలంగాణలో కలిసిన ఏపీనా..?..లేదా వందల ఏళ్ళ నుంచి ప్రత్యేక రాష్ట్రంగా, రాజ్యాంగా ఉన్న తెలంగాణనా..?. మోదీ , బీజేపీ సమాధానం చెప్పాలి..
తల్లి ముందు వస్తుందా బిడ్డా ముందు వస్తుందా..?. బీజేపీ లెక్కన తల్లి ఎవరు..?. బిడ్డ ఎవరు..?. తెలంగాణ తల్లిని చంపి ఏపీ బిడ్డను కాంగ్రెస్ వేరుచేసిందా..?.ఏపీ తల్లిని చంపి తెలంగాణ బిడ్డను వేరుచేసిందా..?..ఎందుకు 13 ఏళ్ళుగా తెలంగాణపై విషం చిమ్ముతుంది…మోదీ నుంచి ఇవాళా తేజస్వి సూర్య వరకు ఏదో రూపంలో అక్కసు వెళ్ళగక్కుతోంది..అసలు రాష్ట్ర విభజనతో సంబంధం లేని చర్చలో పదేపదే తెలంగాణ ఏర్పాటు అంశం తేవడం వెనుక ఉన్న చంద్రబాబు, మోదీ హిడెన్ ఎజెండా ఏంటీ..?…బాబు మద్దతు కోసం తెలంగాణ ఏర్పాటును బీజేపీ ఎందుకు అవమానిస్తుంది..?.
తాజాగా డీలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్లు చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య విషం వెళ్లగక్కారు .రాష్ట్ర విభజనను ఇండియా పాక్ తో పోల్చిన చిల్లర నేత తేజస్వి సూర్య….ఏపీ తెలంగాణ రాష్ట్ర విభజన భారత్ పాక్ విభజన కంటే దారుణంగా ఉందంటు పార్లమెంట్ సాక్షిగా సిగ్గులేని ప్రకటన చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఇండియా ఏదీ పాకిస్థాన్ ఏదీ మిస్టర్ తెజస్వీ సూర్య..?. తెలంగాణ ఇండియానా..?.ఏపీ పాకిస్థానా..?. లేదా ఏపీ ఇండియానా..?.. తెలంగాణ పాకిస్థానా..?.
“తెలంగాణ గడ్డపై పుట్టి తెలంగాణ ప్రజలు ఇచ్చిన పదవులు అనుభవిస్తూ తెలంగాణ అస్థిత్వంపై దాడి జరుగుతుంటే తెలంగాణ ఎంపీలు మౌనంగా ఉన్నారంటే తెలంగాణ పై వారికి ఎంత అభిమానం గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు..తెలంగాణ రాష్ట్ర హక్కులు, సొంత నేలపై ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు.. వాళ్ళు తెలంగాణ ప్రజల మనోభావాలను రక్షించే వారు కాదు.. ఉత్తరాది పార్టీల బానిసలు.. మోదీ , గాంధీ కుటుంబం గులాములు.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి పదవుల కోసం పెదవులు మూసుకునే కట్టు బానిసలు..”
అసలు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంపై బీజేపీ స్టాండ్ ఏంటీ..?.. మోదీ నుంచి తెజస్వీ వరకు తెలంగాణపై ఏర్పాటుపై అక్కసెందుకు..?.. తెలంగాణ పై వ్యతిరేకత అక్కసు అసూయ తోనే పదేళ్ళు విభజన చట్టంలో పెట్టిన అసెంబ్లీ స్థానాలను పెంచలేదా..?.పదేళ్ళ క్రితమే తెలంగాణ అసెంబ్లీ స్థానాలు పెంచితే ఇవాళ అవి రెట్టింపు అయ్యేది కద..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు నాడు బీజేపీ మద్దతు ఇచ్చింది నిజం కదా..నాటి బీజేపీ పార్టీ ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ వన్ సైడ్ గా తెలంగాణ ఏర్పాటును సమర్ధించింది వాస్తవాలు కావా.. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ, సుష్మాస్వరాజ్ పాత్ర ప్రత్యేక్షంగా పరోక్షంగా ఉంది నిజం కాదా … సోనియా గాంధీ ని, సుష్మాస్వరాజ్ ను తల్లి పిన తల్లిగా తెలంగాణ ప్రజలు పిలుచుకుంటారు కదా
బీజేపీ కూడా పదేపదే తెలంగాణ ఏర్పాటు లో తమ పాత్ర ఉందని వోట్లు అడుగుతుంది కద..మరీ ఇప్పుడు పుష్కర కాలం తర్వాత తెలంగాణ ఏర్పాటు పాక్ ఇండియా విభజన కంటే దారుణంగా ఉంది అంటూ విమర్శలు చేస్తున్నారు..రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ తో పాటు బీజేపీ పాత్ర ఉందా లేదా బీజేపీ చెప్పాలి.. రెండు జాతీయ పార్టీలు విభజన చట్టంలో తెలంగాణకు అన్యాయం చేయలేదా..?.
మిస్టర్ తెజస్వీ సూర్య ఇండియాలోని రాష్ట్రాలను పాక్ తో పోల్చడం దేశ భక్తి నా..?. అసలు 1977లో బీజేపీ కాకినాడ తీర్మానం ఏంటీ..?. ఒకసారి చదువుకుంటే మంచిది. తెలుగు రాష్ట్రాల విభజన ఇండియా పాకిస్తాన్ విభజన అంటూ ప్రకటించడం సిగ్గుచేటు…వాజ్ పేయి ప్రభుత్వం కూడా దేశంలో మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసింది కదా..మరీ వాటిని ఏం అనాలి..?..తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందింది..బీజేపీ ఎన్డీయే విభజన చేసిన ఏర్పాటు చేసిన రాష్ట్రాల కంటే వందల రేట్లు జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు అందనంత ఎత్తులో తెలంగాణ ఉంది.. ఇప్పుడు చెప్పు ఇండియా పాకిస్తాన్ లా నాడు బీజేపీ ఆయా రాష్ట్రాలను విభజించింది.. అలా విభజన చేసింది కాబట్టే అవి పాకిస్థాన్ కంటే దారుణంగా ఉన్నాయి.
తెలంగాణ రాజ్యాంగ బద్దంగా జరిగింది కాబట్టే అభివృద్ధి చెందింది..దశాబ్దకాలం దాటిన ఇంకా కేసీఆర్ ,టీఆర్ఎస్ పై బీజేపీకి ఎందుకుంత కోపం టీఆర్ఎస్ పై రాజకీయంగా ఎన్ని విమర్శలైన చేసుకోవచ్చు..కానీ తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం ఆత్మాభిమానం, ఉనికి పై దాడి చేస్తామంటే తెలంగాణ సమాజం ఊరుకోదు..అటు కాంగ్రెస్ తో కలిసి తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడించిన కేసీఆర్ భయం మాత్రం బీజేపీకి వదలడం లేదు… పదేపదే చంద్రబాబు తో కలిసి తెలంగాణ అస్థిత్వం పై దాడి చేసే ప్రయత్నం చేస్తుంది.. కేసీఆర్ టీఆర్ఎస్ బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని బలహీన పర్చేందుకు తెలంగాణ ఏర్పాటుపై కాషాయ మూక విషం చిమ్ముతున్నది .
తెలంగాణ ఏర్పాటుపైనే కాదు తెలంగాణలో గత పదేళ్ళలో జరిగిన అభివృద్ధిపై ఉత్తరభారత పార్టీ విషం కక్కుతోంది.. కేసీఆర్ హాయాంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి మోదీ నుంచి కేంద్ర మంత్రులు సహా ప్రపంచవ్యాప్తంగా అనేది కీర్తించారు.. స్వయంగా మోదీ తెలంగాణ కు మిషన్ భగీరథను ప్రారంభించి కేసీఆర్ ను అభినందించారు.. అంతేకాదు తెలంగాణ మోడల్ ను తీసుకుని హర్ ఘర్ జలై పథకం తీసుకువచ్చారు..రైతు బంధు ను మోదీ కాపికొట్టి కిసాన్ సమ్మాన్ పథకం తీసుకువచ్చారు.. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ మంత్రులు ప్రసంశలు వర్షం కురిపించారు.
ఇవాళ అదే బీజేపీ కేంద్ర మంత్రులు, ప్రధాని చంద్రబాబు నాయుడు సపోర్ట్ కోసం కాళేశ్వరంపై విషం చిమ్మారు..నాడు పార్లమెంట్ సాక్షిగా పొగిడినా బీజేపీ ఇవాళ కేవలం చంద్రబాబు కోసం కేంద్ర మంత్రి కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రకటనలు, ప్రసంగం చేశారు.. కేంద్రంలో చోటే భాయ్ ఎజెండా ను బడే భాయ్ అమలు చేస్తుంటే.. రాష్ట్రంలో బడే భాయ్ ఎజెండా ను చొటే భాయ్ అమలు చేస్తున్నారు..ఒక్క బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ రాజకీయంగా ఎదుర్కొనేందుకు బడే భాయ్ చోటే భాయ్ కలిసి కుట్రలు చేస్తున్నారు.
ఇవాళ లోక్ సభ లో టీఆర్ఎస్ ప్రాతినిథ్యం లేకపోవడంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చిల్లర కూతలు చూస్తుంటే..చేవచచ్చిన టీకాంగ్రెస్ టీబీజేపీ ఎంపీలు మౌనంగా ఉంటు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు.. అస్థిత్వాన్ని ఉత్తరాది పార్టీల దగ్గర తాకట్టు పెట్టారు..ఆత్మగౌరవాన్ని చంపుకుని బానిసలుగా బతుకుతున్నారు.. సొంత రాష్ట్రంపై తప్పుడు కూతలు కూస్తుంటే నిస్సిగ్గుగా చేష్టలుండిపోయారు.అందుకే ఎట్టికైన మట్టికైన మనవాడు ఉండాలంటారు..తెలంగాణ గడ్డపై పుట్టి తెలంగాణ ప్రజలు ఇచ్చిన పదవులు అనుభవిస్తూ తెలంగాణ అస్థిత్వంపై దాడి జరుగుతుంటే తెలంగాణ ఎంపీలు మౌనంగా ఉన్నారంటే తెలంగాణ పై వారికి ఎంత అభిమానం గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు..తెలంగాణ రాష్ట్ర హక్కులు, సొంత నేలపై ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు.. వాళ్ళు తెలంగాణ ప్రజల మనోభావాలను రక్షించే వారు కాదు.. ఉత్తరాది పార్టీల బానిసలు.. మోదీ , గాంధీ కుటుంబం గులాములు.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి పదవుల కోసం పెదవులు మూసుకునే కట్టు బానిసలు..
-తోటకూర రమేష్





