‘‘జార్జి రెడ్డి ని భౌతికంగా నిర్మూలించిన శక్తులే కేంద్రంలో రాజ్యమేలుతున్నాయి.వారికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రగతిశీల శక్తులపై నల్ల చట్టాలను మోపి ఏళ్ల తరబడి నిర్బంధిస్తున్నారు.. విద్యారంగంలో కాషాయీకరణ విధానాలు తీసుకొచ్చి ప్రశ్నించే తత్వాన్ని లేకుండా చేయడానికి వన్ నేషన్- వన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకోచ్చి విద్యార్థుల మెదళ్ళ పై దాడులు చేస్తుంది.విశ్వవిద్యాలయాలను మతోన్మాద శక్తులకు నిలయాలుగా మారుస్తున్నారు.పాఠ్యపుస్తకాల్
లో నుంచి శాస్త్రీయతను కనబర్చే పాఠ్యంశాలను తొలగిస్తున్నారు.మత మౌడ్యాన్ని కి సంబంధించిన సిలబస్ ను ప్రవేశపెడుతున్నారు..జార్జి రెడ్డి స్ఫూర్తితో ఈ అరాచకపు శక్తులకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉన్నది.’’
ఏప్రిల్ 14న జార్జ్ రెడ్డి 51 వ వర్థంతి సందర్భంగా…
– తెలంగాణ విద్యావంతుల వేదిక
నువ్వు జీవించాలనుకుంటే చనిపోవడం నేర్చుకో… అడుగడుగునా పోరాడడం నేర్చుకో…అంటూ… ఆచరణయే జ్ఞానం, జ్ఞానమే పోరాటం…పోరాటమే జీవితంగా బతికినవారు జార్జి రెడ్డి.తనకున్న మేధస్సుతో ఉన్నతమైన జీవితాన్ని అనుభవించడానికి అవకాశాలు ఉన్నప్పటికి..వ్యక్తి ప్రయోజనం ముఖ్యం కాదు.. వ్యవస్థలో మార్పు రావడమే ప్రధానమని భావించి హిమాలయాల కన్నా మహోన్నతమైన ఆలోచనలతో దోపిడి పీడన వర్గ స్వభావం పై విద్యార్థులలో రాజకీయ చైతన్యాన్ని రగిలించిడానికి ముందుకు కదిలిన..అనేక మంది విద్యార్థులను ముందుకు కదిలించిన.. యుద్ధ వీరుడు జార్జి రెడ్డి.చావు కూడ బతుకు కన్నా విలువైన త్యాగం గా గుర్తించి తన అనంతర తరాల జీవితాలలో వెలుగులు విరజిమ్మడానికి జీవితాన్ని ఫణంగా పెట్టిన ఆదర్శ వాది రెజీ.
ఆధిపత్యం ఆవహించుకున్న కాలమది..
అది అల్లకల్లోల కాలం..ప్రపంచంలో ని అనేక అభివృద్ధి చెందిన,చెందుతున్న దేశాలల్లోని విశ్వవిద్యాలయాలలో కులం,మతం ప్యూడల్ సంస్కృతి భావాలు అలుముకున్న చీకటి కాలం.మతోన్మాద శక్తులు విశ్వవిద్యాలయాలను గబ్బిలాలు పట్టిపీడిస్తున్న వేళలో విద్యార్థులలో బలమైన ప్రగతిశీల భావజాలాలు వికసించి వ్యవస్థ మార్పు కోసం,ఆధిపత్య ధిక్కరణ ను ఆయుధం గా మలుచుకొని అలుపెరుగని పోరాటాలకు నాంది పలికిన తరుణమది.గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కొండలు, పర్వతాలలో విప్లవ చిత్రాలను రూపొందిస్తున్న సంధర్భం. ఆ విద్యార్థులలో ఉన్న పోరాట పఠిమ వివిధ సందర్భాలలో ఉద్యమాల ద్వారా వ్యక్తమవుతున్న పరిస్థితి.దక్షిణాఫ్రీకా లో వర్ణ వ్యవస్థ కు వ్యతిరేకంగా,సోవియట్ విద్యార్థుల తిరుగుబాటు,ఫ్రాన్స్ లో చార్లెస్ డీగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల తిరుగుబాటు, అమెరికాలో బ్లాక్ పాంధర్స్ తిరుగుబాటు, అమెరికాలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వియత్నాం ప్రజల పోరాటం, స్వదేశంలో నక్సల్బరీ, శ్రీకాకుళ రైతాంగ పోరాటాలు ఇవి ఆ కాలపు సజీవ సంఘటనలు. ఇలాంటి సందర్భంలో కాలం అసాదారణమైన వ్యక్తులను కడుపుతో కన్నది.ఆ కాలం కడుపులో పుట్టిన బిడ్డ, విప్లవ ధృవతార,హైదరాబాద్ చేగువేరా జార్జ్ రఘునాథరెడ్డి.

జార్జి రెడ్డి జీవితం
భారతదేశం దాస్య శృంకలాల నుండి స్వాతంత్య్రం వైపు అడుగుల వేస్తున్న కాలంలో 1947 జనవరి 15 న కేరళలోని పాలక్కడ్ జిల్లాలో చల్లా రఘునాథరెడ్డి, లీలా వర్గీస్ దంపతులకు జార్జ్ నాలుగవ సంతానంగా జన్మించారు.జార్జ్ రెడ్డి పూర్తి పేరు జార్జ్ రఘునాథరెడ్డి. వాస్తవానికి జార్జ్ అనే పేరు రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అతని తల్లి సోదరుడు జార్జ్ వర్గీస్ ది.అతడు =•ఖీ లో పైలట్ గా పనిచేశాడు. జార్జ్ రెడ్డి ముద్దు పేరు రెజీ.అతని స్నేహితులకు అతను జార్జ్. అతని ప్రాధమిక విద్య తంగస్సేరి లో ,1959 తర్వాత జార్జ్, మరియు సిరిల్ చెన్నై వచ్చి డాన్ బాస్కో పాఠశాలలో చేరారు.తర్వాత తల్లి నిర్ణయం మేరకు ఆ కుటుంబం వరంగల్ కు మారింది. అక్కడ గాబ్రియేల్ పాఠశాలలో చేరారు.1963 లో నిజాం కళాశాలలో డాక్టర్ కావడానికి సిద్ధంగా ఉండి బైపీసి గ్రూపులో చేరాడు.1967 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం లో ఎం.ఎస్సీ ఫిజిక్స్ లో చేరి చదువు నే పోరాటం గా కొనసాగించాడు.

ఉస్మానియా ఉద్యమ పిడికిలి జార్జి
అనాటికే ఉస్మానియా విశ్వవిద్యాలయం లో గూడుకట్టుకున్న భూస్వామ్య,ధనస్వామ్య, పెత్తందారి ప్యూడల్ వర్గాల కు మతోన్మాద శక్తులు నాయకత్వం వహించేవి.ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థావరంగా చేసుకుని అరాచక అవినీతికర విధానాలతో విద్యార్థులను వేధిస్తున్న సందర్భం, యూనివర్సిటీ అధికారుల అండదండలతో బోగస్ అడ్మిషన్లను పొందడం,ఏళ్ల తరబడి హాస్టళ్లలో తిష్ఠ వేయడం, దౌర్జన్యంగా విద్యార్థుల నుండి డబ్బులు కొల్లగొట్టడం, విద్యార్థినిలపై బలవంతపు ర్యాగింగ్ కు పాల్పడడం,అధ్యాపకుల పట్ల పైశాచికంగా వ్యవహరించడం,ఆ అల్లరి మూఖల నుండి విద్యార్థులను విముక్తి చేసే శక్తుల కోసం ఎదురుచూస్తున్న సందర్భంలో ఉస్మానియాలో జార్జిరెడ్డి అడు గుపెట్టాడు.అప్పటికే యూనివర్సిటీ లో పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి.కుల వ్యవస్థ, జాత్యహంకారం,మహిళలపై ఆధిపత్యం, అమాయకులతో ఆడుకోవడం ఉండేవి.విద్యార్థి నాయ కుడిగా జార్జ్, విశ్వవిద్యాలయ పరిస్థితుల మీద చర్చించడానికి ,సమీక్షించుకోవడానికి ‘‘బండ రాళ్ళ క్యాంటీన్ ను’’ ప్రదేశంగా ఎంచుకున్నారు.

కులతత్వ మరియు మతోన్మాద శక్తులు విద్యార్థుల పై చేసిన దాడుల కారణంగా జార్జ్ రెడ్డి హిందుత్వాన్ని ,హైంధవ బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకించడమే గాకుండా విద్యార్థులను పోరాటాల వైపు నడిపించాడు.కళాశాలలో ఆ సమయంలో పాలక,మత విద్యార్థి సంఘాలు పేద విద్యార్థులపై,లేబర్ల పై ఆధిపత్యం చేలాయిస్తుండేవారు.అది జీర్ణించుకోలేని జార్జి పీడిత వర్గాల పక్షం వహించాడు.విద్యార్థులకు అందాల్సిన మెస్ బిల్లులను అధికారుల అండతో దొడ్డిదారిన తరలించుకుపోతున్న దోపిడీ శక్తుల పట్ల అలుపెరుగని పోరు చేశారు.ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులలో ప్రగతిశీల భావాలను పెంపొం దించుటకై చొరవ తీసుకుని వారిలో సామాజిక ఆలోచనలను రేకెత్తించారు. తిరోగమన శక్తులకు వ్యతిరేకంగా ముందుకు నడిపించిన నాయకుడు.విద్యారంగంలో శ్రేష్టత,ఆలోచనలో మెరుపులు, జీవితంలో సరళత,అతని స్నేహితుల పట్ల ఆప్యాయత ఆదర్శ ప్రాయమైన తెగువతో కూడినది అతని జీవితం. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని అనేక సంచలనాత్మక ఆలోచన లకు కేంద్రం చేసినాడు.ఎప్పుడు జార్జి నోటి వెంట జాలు వారే కవిత.’’నీ క్రూరమైన కత్తి కింద అనేక తలలు దొర్లినప్పుడు చూసేవారు తమ ప్రశాంతతను కోల్పోతారు…వారు ప్రాణాల గురించి భయపడుతారు…అయితే మీరు బెదిరింపులకు గురి చేసినారు…మేము అధైర్యపడకుండా ఉంటాము…మీ బెదిరింపు భంగిమ ముందు ఇతరులు వంగి కుంగిపోవచ్చు…మీరు ముక్కలు చేయాలనుకుంటే మా జీవితాలను చేయండి.’’అనే కవితా స్ఫూర్తిని చెబుతూ విద్యార్థులలో ధైర్యాన్ని నింపేవాడు.ఎక్కడా అన్యాయం జరిగినా ప్రశ్నించేవాడు.ఎంతటి జఠిలమైన సమస్య తలెత్తినా అనాటి అనుచరులతో చర్చించి సమస్యలను పరిష్కరించేవారు. కాని జార్జ్ పోరాటంలో తను ముందుండి తర్వాత అనుచరులను పిలిచేవాడు.
అందుకే జార్జ్ అంటే ఒక ధైర్యం..
జార్జి అంటే ఒక పోరాటం..
జార్జి అంటే భరోసా..
జార్జి అంటే ఉధ్యమ పిడికిలి..
జార్జి అంటే విప్లవ కెరటం..
జార్జి అంటే ఒక చైతన్యం..
అనే భావన ఆనాటి యువతలో ఎక్కువగా ఉండేది.సామ్రాజ్యవాదం మరియు భూస్వామ్య వాదం చేతి నుంచి భారతదేశాన్ని విముక్తి చేయడానికి పోరాడాలని జార్జ్ బలంగా విశ్వసించాడు.అతడు విద్యా కార్పోరేటికరణ కు, ప్రైవేటీకరణ కు మరియు కాషాయికరణ కు వ్యతిరేకంగా పోరాడాడు. ప్రజాస్వామ్య డిమాండ్ గా బలహీన వర్గాల కు ఉన్న రిజర్వేషన్లను విశ్వసించాడు.లింగ వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం మరియు మహిళలపై ఆధిపత్య భావజాలాన్ని ఖండించారు.ఇదే స్ఫూర్తితో 1972 లో పి.డి.ఎస్.(ప్రొగ్రేస్యూ డెమోక్రటిక్ స్టూడెంట్స్) ని స్ధాపించాడు.1974 లో జంపాల చంద్ర శేఖర్ ప్రసాద్ పి.డి.ఎస్ ను పి.డి.ఎస్.యూ గా మార్పు చేసారు.

జార్జి నిత్య చైతన్య శీలి..
నిత్య సంఘర్షణ లో ఉన్నప్పటికీ ఎప్పుడు చదువు ను నిర్లక్ష్యం చేయలేదు.జార్జ్ ఒక చురుకైన నిరంతర విద్యార్థి మరియు పాఠకుడు.జార్జ్ ఎం.ఎస్సీలో న్యూక్లియర్ భౌతిక శాస్త్రం లో బంగారు పతకం సాధించాడు.అతను చరిత్ర ,సాహిత్యం, తత్వశాస్త్రం, మరియు అంతర్జాతీయ వ్యవహారాలను కూడా విస్తృతంగా అధ్యయనం చేశారు.చేగువేరా స్ఫూర్తితో సైకిల్ యాత్ర చేయాలని వరంగల్ వెళ్ళినారు.జార్జ్ విద్యానైపుణ్యాలకే కాక సామాజిక స్పృహ మరియు రాజకీయ చైతన్యం కలిగి ఉండేవారు.ఈ క్రమంలోనే విద్యార్థులు జార్జిని విశ్వసించి సమీకృతం అయ్యారు.క్రమంగా యూనివర్సిటీల్లో మతోన్మాదుల ప్రాబల్యం తగ్గిపోయింది. దీన్ని జీర్ణించుకోలేని మతోన్మాద శక్తులు జార్జి రెడ్డి ని ఎలాగైనా అంతమొందించాలని ధూల్ పేట గుండాల సహాయంతో.. క్యాంపస్ ఎన్నికల్లో నిమగ్నమైన అత్యున్నత మేధస్సు కలిగిన జార్జి రెడ్డి ని 25 సంవత్సరాల వయస్సు లోనే సంఘ్ పరివార్, ఆధిపత్య, మతోన్మాద శక్తులు సైద్ధాంతికంగా ఎదుర్కోనలేక ఇంజనీరింగ్ కిన్నెర హాస్టల్ వద్ద పోలీసులు చూస్తుండగానే 1972 ఏప్రిల్ 14 న భౌతికంగా అంతం చేసారు.ఇది ప్రగతి శీల శక్తులను అణిచివేసేందుకు మతోన్మాద శక్తులు ఒక మార్గంగా ఎంచుకున్నారు.

జార్జిరెడ్డి హంతకు లే రాజ్యమేలుతున్నారు
జార్జిరెడ్డి ని భౌతికంగా నిర్మూలించిన శక్తులే కేంద్రంలో రాజ్యమేలుతున్నాయి.వారికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రగతిశీల శక్తులపై నల్ల చట్టాలను మోపి ఏళ్ల తరబడి నిర్బంధిస్తున్నారు.ఒకే పాలన ఒకే దేశం అఖండ భారత్ పేరుతో మెజారిటీ హిందువుల ఆస్తులను కొల్లగొట్టడానికి బిజెపి ప్రభుత్వం తెరలేపింది.అందులో భాగంగానే ఈ దేశ ప్రజల ఆస్తులను ఒకే కుటుంబానికి చెందిన ఆదాని అంబానీలకు కట్టబెడుతుంది. విద్యారంగంలో కాషాయీకరణ విధానాలు తీసుకొచ్చి ప్రశ్నించే తత్వాన్ని లేకుండా చేయడానికి వన్ నేషన్- వన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకోచ్చి విద్యార్థుల మెదళ్ళ పై దాడులు చేస్తుంది. విశ్వవిద్యాలయాలను మతోన్మాద శక్తులకు నిలయాలుగా మారు స్తున్నారు. పాఠ్యపుస్తకాల్లో నుంచి శాస్త్రీయతను కనబర్చే పాఠ్యం శాలను తొలగిస్తున్నారు. మత మౌడ్యాన్ని కి సంబంధించిన సిలబస్ ను ప్రవేశపెడుతున్నారు. ప్రగతిశీల భావాలను లేవనెత్తితే ప్రజల నుంచి దూరం చేస్తూ బంధీలు చేస్తున్నారు.జార్జి రెడ్డి స్ఫూర్తితో ఈ అరాచకపు శక్తులకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉన్నది.

జార్జ్ పోరాట స్ఫూర్తిని ఎత్తి పడదాం
జార్జ్ ను భౌతికంగా నిర్మూలించారేమో గాని ఆయన ఆలోచన లు ఇప్పటికి సజీవ స్వప్నాలు అయ్యాయి. జార్జ్ స్ఫూర్తితో సకల శాస్త్రాలు చదువుతున్న విద్యార్థులు ఈ దేశంలో ఇప్పుడున్న అసహనం, హింస,ఆధిపత్య ధోరణి కి వ్యతిరేకంగా ప్రజల తరుపన నిలబడాల్సిన సమయమిది.జ్ఞాన మొక్కటే మనల్ని ప్రజలవైపు నిలబెట్టదు.ఈ దేశ ప్రజలను కాపాడుకోవాలంటే జార్జ్ మరణంలో రణ నినాదమై ప్రతి ధ్వనించాల్సిన వసరం ఉందీ. జార్జి రెడ్డి ని అంతమొందిస్తే ప్రగతిశీల ఉద్యమాలు ఆగిపోతాయని కళలుగన్న మతోన్మాదులకు గొడ్డలిపెట్టుగా జార్జ్ ఆశయాలను పుణికిపుచ్చుకొని జార్జ్ వారసత్వాన్ని కొనసాగిం చడానికి జంపాల, శ్రీపాద శ్రీ హరి,రంగవల్లి, స్నేహలత మారోజు వీరన్న లాంటి ఎంధరో ప్రగతి శీల విద్యార్థులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. వారి స్ఫూర్తితో పోరాట స్పూర్తి ని ఎత్తిపట్టాల్సిన అవసరం ఉంది.దోపిడీ పీడన లేనటువంటి సమసమాజ స్థాపన కోసం బలమైన ప్రగతిశీల ఉద్యమాలను నిర్మించాల్సిన బాధ్యత నేటి విద్యార్థి యువకులపై ఉన్నది.జార్జి స్ఫూర్తి ప్రజ్వరిల్లాలి.జార్జ్ చిందించిన రక్తం ప్రళయాగ్నులై ప్రజ్వరిల్లుగాక…