విజయాన్ని వెతుకుంటున్న మోదీ ..!

“ప్రధాని మోదీ ఏ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు,ఆయనకు గుజరాత్ నమూనా అన్నది ఇప్పుడు ప్రచారంలో ప్రధానాంశం కాదు అభివృద్ధి అనేది ప్రధానాస్త్రం కానీ కాదు.. ఆయన చేసిన అభివృద్ధి చెప్పుకోవాలని లేదు.. ఇప్పుడు బులెట్ రైలు గురించి మాట్లాడడం లేదు.. సంక్షేమ పథకాలు, సబ్సిడీ మొదలైన వాటి గురించి మాట్లాడడం ఆయనకు ఇష్టం లేదు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో ఓడిపోతున్నామని తెలిసి నప్పుడు ప్రతిసారి వాడే ఆయుధం లాగే ఈసారి మహిళా రిజర్వేషన్ల పై ఓడిపోతామని తెలిసి సాగదీసింది..”

sangani malleshwar
ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్,
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్,
సెల్ – 9866255355

అవనిలో సగం.. అవకాశాల్లో సగంగా కొట్లాడుతున్న మహిళా లోకాన్ని మభ్యపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పద్మవ్యూహం పన్నింది. మసకబారుతున్న మోదీ గ్రాఫ్ పెంచుకోవడానికి డీలిమిటేషన్ పేరుతో వంచించే కుట్రకు తెరలేపింది. 131వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళా రిజర్వేషన్ అనుసంధానం చేసే డీలిమిటేషన్ బిల్లు వీగిపోయింది. ఈ 12 సంవత్సరాలలో జరిగిన ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు మోదీ ప్రభుత్వం మునుపెన్నడూ ఊహించని కటిక చేదు అనుభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. సెప్టెంబర్ 2023 లో 106 రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టిన మహిళా బిల్లు పాస్ అయ్యింది కదా? ఇప్పుడు చేయాల్సింది.

33శాతం మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ల వాటా తేల్చాలి, అటువంటిది హరిజెంటల్ రిజర్వేషన్ పేరుతో ఒక వర్గాన్ని గంపగుత్తగా నాశనం చేసే ప్రయత్నాన్ని ఇండియా కూటమి అడ్డుకొని 140 కోట్ల ప్రజలకు దారి చూపెట్టింది. 1951 లెక్కలు ఆధారంగా ఎస్సీ,ఎస్టీ లకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఆయా ఫలాలు అందుతున్నాయి, బీసీల జనాభా తేల్చకపోవడం వల్లనే రాజకీయ రంగంలో రిజర్వేషన్ అందడం లేదు, కేంద్ర ప్రభుత్వం 2027 జనగణన లో కులగణన చేస్తామని ప్రకటించి, 2026 హౌజ్ హోల్ సర్వేలో ఎస్సీ, ఎస్టీ, కాలం ఇచ్చి ఓబీసీ కాలం ఇవ్వకపోవడం బీజేపీ చేస్తామని ప్రకటించిన కులగణనపై నీలినీడలు కమ్ముకున్నాయి.నాడు బిడ్డను చంపి తల్లిని వేరు చేసారని తెలంగాణ ఏర్పాటును శంకించిన మోదీ .. చిత్తశుద్ధి ఉంటే 543 పార్లమెంట్ సభ్యుల్లో మహిళా రిజర్వేషన్ల వాటా తేల్చకుండా అడ్డుకున్నందుకు విపక్షాలది ‘భ్రూణ హత్య’ గా పేర్కొని తన అక్కసును వెళ్లగక్కరనేది నిర్వివాదాంశం.

ఇప్పుడు హఠాత్తుగా మహిళా రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం అసాధారణమైన శ్రద్ధ ఎందుకు చూపిందో ..ఆతురుతలో అర్థం ఉంది సుమా..! మోదీ ప్రతి ఎన్నిక కు ఒక జిమ్మిక్.. అర్థం అయ్యేలోపే విజయం అయన ఖాతాలో పడింది. ప్రతి ఎన్నిక కలిసి వచ్చింది. 2014 లో ముక్త భారత్ ,ముక్త కాంగ్రెస్ నినాదం అంటూ నల్లధనం,అవినీతిపై గొప్ప గొప్ప మాటలు చెప్పి రెండవ దఫా గెలవడానికి 2019 పుల్వామా సంఘటన అప్రమత్తం లేకపోవడం భారీ నష్టం జరిగిందనే కోణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పుల్వామా దాడి ఎవరికీ లబ్ది చేకూరిందనే వ్యాఖ్యను తప్పుబట్టి రెండవ దఫా ఎన్నికల్లో బీజేపీ వోటు బ్యాంకుగా మల్చుకుంది, ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చిందనే సామెతకు రివర్స్ గా ఎగ్జిట్ పోల్స్ చెప్పిన ఫలితాల కంటే కూడా మెజార్టీ సాధించి తన రికార్డు భద్ర పర్చుకుంది.

2024లో బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందనే భావం అందరిలో ఏర్పడింది, దేశం నలుమూలలు ‘రాజ్యాంగం’ పట్టుకొని ప్రచార అస్త్రంగా కాంగ్రెస్ ముందుకు సాగింది, 240 సీట్లకే కట్టడి చేసింది. బీజేపీ ‘ఆబ్కి బార్ చార్ సౌ పార్’ నినాదం చేటు చేసింది. చంద్రబాబు,నితీష్ అండ లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటూ చేసే పరిస్థితి లేదు. డీలిమిటేషన్ పేరుతో లోకసభ సభ్యుల సంఖ్య 543 నుండి 816 కు పెంచి ఇప్పటికి ఇప్పుడు మహిళా రిజర్వేషన్లు అమలు చేసి,ఆమె పేరుతో 2/3 మెజార్టీ సాధించి రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్రకు మరోదఫా తెగపడ్డది. ఎన్నికల వేళా దేశ రాజకీయాల్లో ఒక సంచలనం అయినా మోదీ సర్కార్ కు అపకీర్తిని తెచ్చిపెట్టింది

నియోజకవర్గాల పునర్విభజన అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయకుండా రాష్ట్రాలతో చర్చించకుండా నేనే మోనార్క్ అన్నట్టుగా ఏకపక్ష నిర్ణయాలతో గందరగోళం సృష్టించింది. బీజేపీ తెచ్చిన డీలిమిటేషన్ బిల్లు దక్షణాది రాష్ట్రాలు,ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలను రాజకీయంగా దెబ్బ తీసే లబ్ది పొందే విధంగా కులగణన జరుగుతుండగా దేశ భవిష్యత్ బీజేపీ కాళ్ళ ముందర దీనంగా అదోలా ఉండేలా సమగ్రతను బలహీన పర్చేలా డీలిమిటేషన్ పేరుతో దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే ప్రయత్నం వారి హడావుడిని చూస్తే స్పష్టంగా కన్పించింది. నిజంగానే మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 2023లో ఆమోదించిన బిల్లు 2034కు ఎందుకు వాయిదా వేసింది? కాదని సవరణలు చేయాలనుకుంటే 543 సీట్లలో మహిళా రిజర్వేషన్లు ఎందుకు పాటించకూడదో సమాజానికి తెలియజేయాలి.

విపక్షాలను తప్పు పట్టుతున్న సుద్దపూస ప్రభుత్వం తెచ్చిన మహిళా రిజర్వేషన్ అమలుకోసం అనుసంధానం చేసే డీలిమిటేషన్ వీగిపోవడంతో గగ్గోలు పెడుతున్నది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వలే బీజేపీ గట్టెక్కుతుందనే అహంకారంతో పెట్టిన డీలిమిటేషన్ బిల్లు సాగిలా పడుతుందని అనుకోలేదు. ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థను మోదీ ప్రభుత్వం ధ్వంసం చేసింది, ఎన్నికల ముందు స్విస్ బ్యాంకు ల్లో అపర కుబేరులు దాచిన లక్షల కోట్ల నల్లధనాన్ని తీసుకవచ్చి ప్రతి సామాన్యుడి ఖాతాలో రూ. 15లక్షలు జమచేస్తానన్న మోదీ హామీ కాగితాలకే పరిమితమైందన్న విమర్శ ఉంది. డిమానిటైజేషన్ అంతా ఈజీ కాదు డీలిమిటేషన్ బిల్ పాస్ అనేది విపక్షాల ఎదురుదాడితో మూసుకుంది.

ప్రధాని మోదీ ఏ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు ,ఆయనకు గుజరాత్ నమూనా అన్నది ఇప్పుడు ప్రచారంలో ప్రధానాంశం కాదు అభివృద్ధి అనేది ప్రధానాస్త్రం కానీ కాదు ఆయన చేసిన అభివృద్ధి చెప్పుకోవాలని లేదు ఇప్పుడు బులెట్ రైలు గురించి మాట్లాడడం లేదు సంక్షేమ పథకాలు, సబ్సిడీ మొదలైన వాటి గురించి మాట్లాడడం ఆయనకు ఇష్టం లేదు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో ఓడిపోతున్నామని తెలిసినప్పుడు ప్రతిసారి వాడే ఆయుధం లాగే ఈసారి మహిళా రిజర్వేషన్ల పై ఓడిపోతామని తెలిసి సాగదీసింది, నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షాన్ని ఆహ్వానించి చర్చజేసి అమలుకు సాధ్య,అసాధ్యాలపై సూచనలు,సలహాలు తీసుకునేది, ఆలా కాకుండా పిట్ట బెదిరింపులతో , క్రెడిట్ మీరే పోందండని చాకోలెట్స్ బూచి చూపెట్టి, డైరెక్ట్ గా మోదీ బ్యాట్ పట్టుకొని క్రీజ్ లోకి వస్తే ఊరుకుంటారా ? రాహుల్ వేసిన యార్కర్, విపక్షాలు వేసిన స్లొబాల్ బాల్స్ తో మోదీ టీం ఆల్ అవుట్ కాకా తప్పలేదు.

కేంద్ర ప్రభుత్వం 131వ రాజ్యంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన సభలో హాజరై వోటింగ్ లో పాల్గొన్న 528 పార్లమెంట్ సబ్యులకు 352మంది సభ్యుల మద్దతు అవసరం ఉండగా 298-230 వోట్ల తేడాతో వీగిపోయింది. ముందుగానే అనుకున్నట్లుగా బీజేపీ విపక్షాలపై దుమ్మెత్తి పొసే ప్రయత్నం మొదలెట్టింది. ఐదు రాష్ట్రాలు కేరళ, అస్సాం,పుదుచ్చేరి, అందులో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో విపక్షాల తీరును నిలదీయాలని ప్రచారం మొదలుపెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో బిల్లు నెగ్గితే తమ ఘనత, ఓడితే ప్రతిపక్షాలే కారణమని భావోద్వేగాలకు గురి చేసి లబ్ది పొందాలనే కుట్రలకు ప్రజలు తగిన బహుమతి ఇచ్చి తీరుతారనే భావం అందరిలో ఉంది. ఇండియా కూటమిని ఏకం చేసి, డీలిమిటేషన్ బిల్లును అడ్డుకోవడంలో సీఎం రేవంత్ పాత్ర అనిర్వచనీయమైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *