కౌంట్‌ ‌డౌన్‌..06 ‌ప్రజా‘తంత్రం’

పతాక శీర్షికల్లో కొల్లాపూర్‌ ‌వార్‌
‌శిరీషమ్మ అక్కడ సూపర్‌ ‌స్టార్‌
‌గరీబోళ్ల బర్రెలక్కదే సీటీ మార్‌
‌ప్రత్యర్థుల దాడికి తలొగ్గని ఫైర్‌

ఇం‌డిపెండెంట్లలో రియల్‌ ‌ఫైటర్‌
ఇతర శిబిరాల్లో తప్పని ఫియర్‌
‌గెలుపోటములు కాదులే మేటర్‌
‌జనంసాక్షిగా ఆమె విజిల్‌ ‌బ్లోయర్‌
– ‌వి.రమేష్‌ ‌బాబు

వివిధ పార్టీల అతిరథ మహారధుల ప్రచారంతో వేడెక్కిన తెలంగాణ

ఎన్నికల ప్రచా రానికి కేవ లం మూ డు రోజులే మిగిలడంతో పోటీ పడుతున్న వివిధ రాజకీయ పార్టీలకు చెందిన హేమాహే మీలంతా తెలంగాణను చుట్టు ముట్టారు. సమయం చాలా తక్కు వగా ఉండడంతో ఒక్కో నాయ కుడు మూడు నాలుగు నియో జక వర్గాల్లో పర్యటిస్తు న్నారు. బహిరంగ సభలు, రోడ్‌ షోలతో నగరాలు, పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాలన్ని హడావిడిగా మారాయి. శుక్రవారం ఒక్కరోజున్నే దిల్లీ  సైన్యమంతా ఇక్కడమోహరించిందా అన్నట్లు, వారి పర్యటనలతో రాష్ట్రమంతా ఒక యుద్ధ  వాతావరణాన్ని తలపించింది. బిఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వివిధ జిల్లాల్లో చేపట్టిన ప్రజా ఆశీర్వాద సభల్లో  భాగంగా శుక్రవారం ములుగు, భూపాలపల్లిలో పర్యటించారు. ఇదే రోజున సరాసరి దిల్ల్లీనుండి నేరుగా కాంగ్రెస్‌ ముఖ్యనా యకురాలు ప్రియాంకా గాంధీ  జనగామ జల్లా పాలకుర్తి, హుస్నాబాద్‌ విజయభేరీ సభల్లో పాల్గొని ప్రసంగించారు. అదే పార్టీకి చెందిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌ వర్ధన్నపేట, వరంగల్‌ వెస్ట్‌ (ధర్మసాగర్‌), స్టేషన్‌ఘణపూర్‌ సభల్లో పాల్గొనడం తోపాటు అంబర్‌పేటలో రోడ్‌ షో నిర్వహించారు.

image.png

బిజెపి అగ్రనాయకులు కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, జెపి నడ్డా ముగ్గురు ఒకేసారి తెలం గాణను చుట్టుముట్టడంతో యుద్ధ వాతా వరణం ఏర్పడిరది. తెలంగాణపై కాషాయ జండాను ఎగురవేయాలన్న ధ్యేయంగానే వీరంతా మూకుమ్మడిగా ప్రచారంలో దిగారు.  కేంద్ర హోంశాఖ మంత్రి అమి త్‌షా నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ సకల జనుల సభలో పాల్గొన్నారు. రాజేంద్రనగర్‌, శేర్‌లింగంపల్లి, అంబర్‌పేట నియోజక వర్గాల్లో రోడ్‌షోల్లో పాల్గొన్నారు.  బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా హుజూ ర్‌నగర్‌, సికిందరాబాద్‌, ముషీరాబాద్‌ రోడ్‌ షోలు, బహిరంగ సభల్లో,  రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌  కార్వాన్‌, కంటోన్మెంట్‌ నియోజక వర్గాల్లో  పర్యటించారు. ఇదిలా ఉంటే శనివారం నుండి మరో విడుత ప్రధాని మోదీ పలు ఎన్నికల సభలో పాల్గొన బోతున్నారు. ఆయన ఈ నెల 25 నుండి 27 వరకు మూడురోజులపాటు తెలంగాణలోనే ఉండబోతున్నారు.
ఒకే రోజున రెండు మూడు సభలకు తగ్గకుండా ప్రచారసభల్లో ప్రసంగించనున్నారు. మొదట కామారెడ్డి, రంగారెడ్డిలో మరుసటి రోజున తుప్రాన్‌, నిర్మల్‌, ఆ తర్వాత రోజున మహబూబాబాద్‌, కరీంనగర్‌ సభల్లో పాల్గొననున్నారు. ప్రియాంకగాంధీ కూడా శుక్రవారం నుండి మూడు రోజుల పాటు అభ్యర్ధుల పక్షాన ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ తెలంగాణలోనే ఉండిపోతున్నారు. శనివారం కొల్లాపూర్‌, మునుగోడు, పటాన్‌చెరువు, ఖైరతాబాద్‌ల్లో, 26న మక్తల్‌, ములుగు, భువనగిరి, కూకట్‌పల్లిల్లో విస్తృత ప్రచారం చేయనున్నారు. తిరిగి ప్రచారానికి ఆఖరి  తేదీ 28న మరోసారి తెలంగాణకు ప్రియా ంక రానున్నారు. అలాగే రాహుల్‌ కూడ ఈ నెల 25న మరోసారి తెలంగాణ ప్రచార సభల్లో పాల్గొన బోతున్నారు. ఆయనతో పాటు ఛత్తీస్‌ఘడ్‌, కర్ణాటక ముఖ్యమంత్రులు భూపేష్‌ బఘేలా, సిద్దరామయ్య, సిడబ్ల్యు సభ్యుడు సల్మాన్‌ ఖుర్షీద్‌లు కూడా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. బిజెపి, కాంగ్రెస్‌ జాతీయ పార్టీలు కావడంచేత రాష్ట్ర, జాతీయ నాయకులు తెలంగాణపై దాడిచేసే విధంగా ఒకరితర్వాత ఒకరుగా వొస్తుంటే, బిఆర్‌ఎస్‌  ఇటీవల జాతీయపార్టీగా ఆవిర్భవించినప్పటికీ ఆ స్థాయిలో వివిధ రాష్ట్రాల నాయకులెవరూ ఆ పార్టీకి మద్దతుగా ప్రచార సభల్లో పాల్గొనే అవకాశంలేదు. దాంతో విపక్షాలు కుటుంబ పార్టీ అన్నట్లుగానే కెసిఆర్‌తో పాటు ఆయన కుటుంబానికి చెందిన అల్లుడు హరీష్‌రావు, కొడుకు కెటిఆర్‌, కూతురు కవిత అంతటా తామై ప్రచారం చేస్తున్నారు.
image.png
గత తొమ్మిది సంవత్సరాలుగా తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను లబ్ధి పొందుతున్న ప్రజలే తమను ఆశీర్వదిస్తారన్న నమ్మకంతో బిఆర్‌ఎస్‌ ఉంది. ప్రతీఇంటికి కనీసం నాలుగునుండి అయిదు సంక్షేమపథకాలు అమలవుతున్నందున తమగెలుపుకు ధోకా  లేదనుకుంటున్నారు. రాష్ట్రాన్ని గత  తొమ్మిది ఏళ్ళుగా ఎంతో శ్రమించి తీర్చిదిద్దితే, వోటర్లు తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఆ మొత్తం శ్రమ బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని ఆ పార్టీ ప్రజలను హెచ్చరిస్తోంది. కాగా తెలంగాణ సమగ్రాభివృద్ధి జరుగాలంటే రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రావాల్సిందేనంటోంది బిజెపి. బిజెపి జండా సకలజనుల అండ అనేనినాదంతో విజయసంకల్పసభలను నిర్వహిస్తున్నది.
image.png
ప్రధానంగా కుంటుంబ పాలన నుండి ఈ ప్రాంతానికి విమోచన కల్పించడం, అవినీతి ప్రభుత్నాన్ని అంతమొందించడమే తమ లక్ష్యంగా చెబుతున్న బిజెపి బిసీ సిఎం అభ్యర్ధి ప్రకటన ఆ వర్గాలపైన సమ్మెహనాస్త్రంగా పనిచేసే అవకాశాలున్నాయంటోంది బిజెపి. కాగా ఈసారి విజయమే లక్ష్యంగా అగ్రనేతలను, స్టార్‌ కాంపైనర్‌ లను, సినీ గ్లామర్‌ను కాంగ్రెస్‌ వాడుకుంటున్నది. ఇటీవలె ఆ పార్టీలోకి మారిన విజయశాంతితోపాటు కేంద్ర నాయకులు, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళరాష్ట్రాలకే చెందిన దాదాపు 150 మంది కాంగ్రెస్‌కు అండదండగా నిలిచారు. బిఆర్‌ఎస్‌ నేత కెసిఆర్‌ను జైల్‌కు పంపించడమే తమ ప్రధాన లక్ష్యంగా చెబుతున్న కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలతోపాటు తమ మ్యానిఫెస్టోనే తమను గట్టెక్కింస్తుందను కుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page