“మోదీ చెప్పిన తొమ్మిది సూత్రాలు ప్రజల నిత్య జీవితాలతో ముడిపడిన అంశాలు..ఒకవైపు నిత్యావసరాల ధరలు పెంచుతూ మరోవైపు వినియోగం తగ్గించుకోవాలని పొదువు మంత్రం జపిస్తే అభివృద్ధి సాధ్యమైతుందా.? అన్న టెన్షన్ కూడా పెట్టుబడి పెట్టే కంపెనీల్లో వ్యక్తమౌతోంది..ప్రజల వినియోగమే లేకపోతే అభివృద్ధి ఎలా జరుగుతుంది..? ప్రజల వినియోగం లేకపోతే ఉత్పత్తి సంస్థలు ఉత్పత్తి ఎలా చేస్తాయి.?.పెట్టుబడులు ఎలా వస్తాయి. ?.పెట్టుబడులు లేకపోతే యువతకు ఉపాధి ఎలా లభిస్తుంది..?. కంపెనీలు కొత్త ఉత్పత్తులు చేయకపోతే, ప్రజలు ఉన్న వస్తువులను కొనకపోతే సంస్థలు దివాలా తీస్తాయి. కార్మికులు, చిన్న చిన్న ఉపాధి సంస్థలు కుప్ప కూలుతాయి.పేదరికం, నిరుద్యోగం పెరుగుతుంది.”
గత పుష్కరకాలంగా దేశం వెలిగిపోతుంది. కుటుంబ పాలన పోయి ఒక సామాన్యుడు ప్రధాని కావడంతో దేశంలో ప్రతి పేదవాడికి అధికారం వచ్చిందని కాషాయ పార్టీ ప్రచారం చేస్తుంది. మోదీ నాయకత్వంలో ఇండియా ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని, మోదీ విశ్వగురువు అంటూ కమలం నేతలు గోబెల్స్ ప్రచారం చేశారు. ప్రధాని నేతృత్వంలో ప్రపంచ వ్యాప్తంగా భారత్ పలుకుబడి పెరిగిందని, తిరుగులేని శక్తిగా ఎదిగి అంతర్జాతీయ యుద్దాలను మోదీ ఆపారని ఊదరగొట్టారు.రష్యా ఉక్రెయిన్ యుద్దాన్ని ఆపారని, పశ్చిమాసియాలో యుద్ద వాతావరణంతో తలెత్తిన అనేక సమస్యల నుంచి మోదీ భారత్ ను గట్టేక్కించారని, దేశాల మధ్య జరిగే ప్రాక్సీ యుద్ధాల ప్రభావం ఇండియాపై పడకుండా మోదీ చేతిని అడ్డుపెట్టి అడ్డుకున్నారని కమలం బ్యాచ్ ఊదరగొట్టారు.
.అమెరికా నుంచి రష్యా వరకూ చైనా నుంచి పాకిస్తాన్ వరకూ ప్రపంచ దేశాలతో భారత్ దౌత్య సంబంధాల్లో తనదైన ముద్ర వేస్తు దేశాన్ని మోదీ వసుధైక కుటుంబంగా మార్చి, అభివృద్దిలో, జీడిపీలో దేశం దూసుకుపోతుందని బీజేపీ ప్రకటిస్తుంది. ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య మధ్యవర్తిత్వంలో ప్రధాని మోదీ కీలక పాత్ర పోషిస్తు విశ్వగురువుగా కీర్తించబడుతున్నారని బీజేపీ ఐటీ సెల్ అసత్యాలను అద్భుతంగా ప్రజల మెదళ్లోకి చిప్పిస్తుంది. తూర్పు-పశ్చిమ దేశాలకు భారత్ అనుసంధాన కర్తగా వ్యవహరిస్తూ సౌత్ ఏషియాలో ఇండియా పవర్ పుల్ ఆర్థిక రాజకీయ శక్తిగా ఎదుగుతుందని కాషాయ నేతలు ప్రకటిస్తున్నారు.
కానీ బీజేపీ చెపుతున్న గొప్పలన్నీ ఉత్తివే అన్నది ఇటీవలే హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సందర్భంగా ప్రధాని మోదీ చేసిన పొదుపు వ్యాఖ్యలు స్పష్టం చేశాయి. బీజేపీ ఐటీ సెల్, కాషాయ వాట్సాప్ యూనివర్శిటీ చేస్తున్న ప్రచారమంతా మేడిపండు ప్రచారమే అన్నది తెలంగాణలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను బట్టి దేశ ప్రజలకు అర్ధమైంది.
ఒకవైపు భారత దేశం ప్రపంచ వ్యాప్తంగా వెలిగిపోతుందని, ఆర్థికంగా అమెరికా, చైనా దేశాలతో పోటీ పడుతుందని, 2047 వరకూ ప్రపంచంలోనే ఇండియా వికసిత్ భారత్ గా మారి మూడో ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని బీజేపీ పదే పదే ప్రకటిస్తుంది.అయితే బీజేపీ ఆలోచన గొప్పదే కావచ్చు. దేశం ఆభివృద్ది చెందితే మంచితే.కానీ ప్రభుత్వ పాలసీలు మాత్రం 2047 లక్ష్యానికి పూర్తి విరుద్దంగా ఉన్నాయి.
మోదీ చెపుతున్న విజన్ 2047 టార్గెట్ ను భారత్ రీచ్ కావాలంటే ప్రతి ఏడాదీ ఇండియ గ్రోత్ రేట్ దాదాపు 10-12 శాతం ఉండాలి. కానీ గత పుష్కర కాలంగా భారత్ గ్రోత్ రేట్ కేవలం సరాసరి 7 శాతం మాత్రమే ఉంటుందని అనేక ఆర్థిక సంస్థలు చెపుతున్నాయి. 7 శాతం గ్రోత్ రేట్‌తో 2047 లక్ష్యాన్ని అందుకోవడం, ప్రపంచ మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదగడం కొంత కష్టమే అని చెప్పవచ్చు. అలా అని లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయడం, ఆశలు,టార్గెట్ లేకపోవడం కూడా తప్పే.అయితే, హైద్రాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ చేసిన పొదుపు వ్యాఖ్యలు, దేశ ప్రజలకు ఇచ్చిన పొదుపు సూత్రాలను గమనిస్తే కేంద్రం పెట్టుకున్న 2047 టార్గెట్‌ను రీచ్ అవుతుందా అనే అనుమానాలు ఆర్థిక రంగ నిపుణుల్లో పెరుగుతున్నాయి.
ప్రధాని పొదుపు మంత్రం, ఖర్చులు తగ్గింపు, బంగారం కొనుగోలు తగ్గించడం, పెట్రో వినియోగం తగ్గించుకోవడం వంటి తొమ్మిది సూత్రాలతో 2047నాటికి వికసిత భారత్, మూడో ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా భారత్ ను మార్చుతుందా.? అన్న డౌట్స్ పెరుగుతున్నాయి.ఇప్పటి దాకా భారత్ ఆర్ధిక వ్యవస్థ నీటి బుడగేనా అన్న సందేహాలు ప్రజలకు వస్తున్నాయి. మోదీ పొదుపు మంత్రతో గాళ్ల మేడల దేశ ఆర్థిక వ్యవస్థ కూలిపోతుందాన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మోదీ చెప్పిన తొమ్మిది సూత్రాలు ప్రజల నిత్య జీవితాలతో ముడిపడిన అంశాలు..ఒకవైపు నిత్యావసరాల ధరలు పెంచుతూ మరోవైపు వినియోగం తగ్గించుకోవాలని పొదువు మంత్రం జపిస్తే అభివృద్ధి సాధ్యమైతుందా.? అన్న టెన్షన్ కూడా పెట్టుబడి పెట్టే కంపెనీల్లో వ్యక్తమౌతోంది..ప్రజల వినియోగమే లేకపోతే అభివృద్ధి ఎలా జరుగుతుంది..? ప్రజల వినియోగం లేకపోతే ఉత్పత్తి సంస్థలు ఉత్పత్తి ఎలా చేస్తాయి.?.పెట్టుబడులు ఎలా వస్తాయి. ?.పెట్టుబడులు లేకపోతే యువతకు ఉపాధి ఎలా లభిస్తుంది..?. కంపెనీలు కొత్త ఉత్పత్తులు చేయకపోతే, ప్రజలు ఉన్న వస్తువులను కొనకపోతే సంస్థలు దివాలా తీస్తాయి. కార్మికులు, చిన్న చిన్న ఉపాధి సంస్థలు కుప్ప కూలుతాయి.పేదరికం, నిరుద్యోగం పెరుగుతుంది.
ఉపాధి లేకపోతే కుటుంబ ఆర్థికంగా ఎలా స్థిరపడుతుంది.?.కుటుంబం స్థిర పడకపోతే ప్రజల జీవన ప్రమాణాలు ఎలా పెరుగుతాయి.? .ప్రజల జీవన ప్రమాణాలు పెరగకపోతే దేశంలో ప్రజల మధ్య సామాజిక ఆర్థిక రాజకీయ అంతరాలు అసమానతలు పెరుగుతాయి. ప్రజల మధ్య అసంతృప్తి పెరుగుతుంది.సమాజంలో అంతరాలతో అలజడులు పెరుగుతాయి. అశాంతి నెలకొంటుంది..ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది..ఆ ఉద్యమాలు చివరకు ఏ రూపమైన సంతరించుకునే ప్రమాదం ఉంది.
ప్రజలు పొదుపు మంత్రం పాటించడం కాదు. ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలు ఎలా పెంచాలో ఆలోచించాలి. ప్రజల వినియోగానికి తగ్గంటు ఉత్పత్తిని స్వయంగా చేసుకునేలా ప్రోత్సాహించాలి. ఉపాధి ఉద్యోగావకాశాలు కల్పించాలి. ధరలను అందుబాటులోకి తీసుకురావాలి. అప్పుడే ఆర్థిక సంక్షోభం నుంచి దేశం బయటపడుతుంది.. కేవలం పొదుపు మంత్రంతో సాధ్యం కాదు.
ఒకవైపు ప్రజలు పొదుపు పాటించాలంటునే మరోవైపు పెట్రోలు, డిజిల్, గ్యాస్ ధరలను ఇబ్బడి ముబ్బడి గా కేంద్రం పెంచుతుంది. దీంతో దేశంలో ద్రవ్యోల్భణం పెరుగుతుంది.నిత్యావరస ధరలు పేదల నడ్డి విరుస్తుంది.వ్యవసాయ ఎరువుల ఖర్చులు పెరుగుతాయి. అన్నపూర్ణ దేశంలో మళ్లీ ఆకలి కేకలు తాండవిస్తాయి. సంపన్న దేశం దరిద్రంతో కొట్టుమిట్టాడుతుంది. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లొద్దని, ప్రజలు విదేశీ టూర్లు తగ్గించుకోవాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు.బాగానే ఉంది.కానీ ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఎడ్యుకేషన్ మార్పులకు భారతీయులు దూరం అవుతారు.ఇప్పటికే శాస్త్రీయ విద్యా విధానంలో అభివృద్ది చెందిన దేశాలతో పొల్చుకుంటే వందేళ్లు ఇండియా వెనకబడి ఉంది. ఇప్పుడు విదేశాల్లో చదువుకోవద్దంటే విస్తృతంగా పెరుగుతున్న ఏఐ టెక్నాలజీకి దేశ యువత మరో వెయ్యేళ్లు వెనుకబడి పోతారు.
విద్య వైద్యం టెక్నాలజీ రంగాల్లో భారత్ వెనుకబడి పోతుంది. అంతేకాదు, దేశంలో నిరుద్యోగం పెరుగుతుంది. పొదుపు మంత్ర వల్ల దేశంలో పెట్టుబడులు తగ్గిపోతాయి. ప్రజల కోనుగోలు శక్తి తగ్గిపోవడమే కాదు, అధిక ధరల బాధలు పేద మధ్య తరగతి ప్రజలను రాచపుండులా పీడిస్తుంది. ఇప్పటికే దేశంలో ఉపాధి లేక యువత తప్పు దొవపట్టుతున్నారు. పెడ ధోరణులతో సమాజానికి ప్రమాదకరంగా మారుతున్నారు. చదువుకున్న బానిసలుగా బతుకున్నారు. మాద ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు బానిసలై యువ శక్తి మొత్తం నిర్వీర్యం అవుతుంది.
ఇలాంటి సమయంలో మోదీ పొదుపు మంత్రం దారి తప్పవచ్చు.దేశాభివృద్ది పాతికేళ్లు వెనక్కి వెళ్లవచ్చు. 2047 టార్గెట్ చేరుకోవడం అసాధ్యం కావచ్చు.పోనీ మోదీ దేశం కోసం, ధర్మం కోసం దేశ ప్రజల కోసం పొదుపు మంత్రం చెపుతున్నారనుకున్నా, ప్రజలు పొదుపు పాటిస్తే దానికి ప్రత్యామ్నాయ అభివృద్ది దేశంలో ఉందా అంటే అదీ లేదు. దాదాపు ఎనిమిదిపదుల స్వాతంత్య్ర భారత్ దేశం స్వయం సమృద్ది సాధించలేదు.ఇప్పటికీ విదేశీ దిగుమతులపైనే భారత్ ఆధారపడుతుంది.
మరోవైపు దేశ ప్రజలు పొదుపు సూత్రాలు పాటించాలని కోరుతున్న మోదీ , రాజకీయ నేతల దుబారా ఖర్చులను కట్టడి చేయడం లేదు.కేంద్ర ప్రభుత్వమే కాదు రాష్ట్ర ప్రభుత్వాల అనవసర ఖర్చులను నియంత్రించాలని చెప్పడం లేదు.ప్రజలు పార్టీలు తగ్గించుకోవాలని చెప్పే మోదీ రాజకీయా పార్టీల మీటింగ్‌లకు కోట్ల రూపాయాలు ఖర్చు గురించి మాట్లాడం లేదు. ఏ హైదరాబాద్ కేంద్రంగా మోదీ పొదుపు సూత్రాలు చెప్పారో అదే తెలంగాణలో మోదీ అనాధికార పర్యటనలతో కోట్ల రూపాయాల ప్రజాధనం వృధా చేశారు.పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన భారీ బహిరంగా సభకు కోట్లు ఖర్చు చేశారు.అది పార్టీ ఫండ్ కావొచ్చు కానీ దుబారే కద.
.కేవలం ప్రధాని కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య తగ్గించినంత మాత్రానా, ముఖ్యమంత్రులు తమ కాన్వాయ్ కుదించుకున్నంత మాత్రనా, బీజేపీ నేతలు ఒక్కరోజు మెట్రో వెళ్లినంత మాత్రనా పొదుపు చేసినట్లు కాదు..మంత్రుల జీతాలు తగ్గించాలి..వారికి ఇచ్చే అలవెన్స్‌ను తగ్గించుకోవాలి..ప్రజా ప్రతినిధులకు ఇచ్చే అనవసర రాయితీలు తొలగించాలి. ముందు ప్రభుత్వంలో ఉన్న వాళ్లు, పాలన చేస్తున్న వాళ్లు దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి..అప్పుడే అటో మేటికింగ్ ప్రజలు ఫాలో అవుతారు..రాజకీయ నేతల పిల్లలు విదేశాలకు వెళ్లవచ్చు..విదేశాల్లో చదువుకోవచ్చు.వందల కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిల్లు చేసుకోవచ్చు..వాటికి ఇదే రాజకీయ నేతలు, సినీ తారలు వెళ్లి మీడియాలో ప్రచారం కల్పించవచ్చు.లగ్జీ కార్లు, బంగారం కొనడమే కాదు, అధికారంలో ఉన్న నేతల కుటుంబాలు కూడా ప్రభుత్వాల రాయితీలు పొందవచ్చు..వీటన్నీంటిని సంస్కరించకుండా ప్రజలు పొదుపు పాటించాలంటే ఎలా మోదీ గారు. అంతేకాదు మోడీ పొదుపు మంత్రం చూస్తే 2047 అనేది భారత ప్రభుత్వం ఎజెండా కాదు, బీజేపీ పార్టీ వ్యక్తిగత రాజకీయ ఎజెండాగ కనిస్తుంది. 2047వరకూ ప్రతిపక్షాల ముక్త్‌భారత్..ఏక పార్టీ ఏక వ్యక్తి పాలన ఎజెండానే మోదీ 2047 విజన్ కావోచ్చన్న చర్చ దేశంలో ఉంది.
-తోటకూర రమేష్




