ఇటీవల అడ్వకేట్స్ యూనియన్ ఫర్ డెమోక్రసీ అండ్ సోషల్ జస్టిస్ అనే సంస్థ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై వేసిన పిటిషన్ ను విచారించిన మధ్యప్రదేశ్ హైకోర్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు జనరల్ కేటగిరి కులాల వారికి మాత్రమే ఎలా వర్తిస్తాయి?ఇతర కులాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ వారి పరిస్థితి ఏంటి? అంటూ కేంద్రాన్ని ప్రశ్నించడంతో పాటు ఆరు వారాల్లో స్పందించాలని నోటీసులు సైతం జారీ చేసింది.ఇతర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తింప చేయకపోవడం పేదలపై కులం పేరుతో ప్రభుత్వం వివక్ష చూపినట్లే.కాబట్టి ఈ రిజర్వేషన్లను రాజ్యాంగ విరుద్ధంగా భావించి కొట్టి వేయాలని పిటిషనర్లు కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుతీరు మరొక్కసారి చర్చనీయాంశంగా మారింది.
ఆర్థిక ప్రమాణాల ఆధారంగా అగ్రవర్ణాలలోని పేదలకు రిజర్వేషన్లను కల్పించడం కోసం ఉన్నత విద్యలో శ్రీ%15(6), ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో16(6) ఆర్టికల్స్ ను చేరుస్తూ 9జనవరి 2019న భారత పార్లమెంటు 103 రాజ్యాంగ సవరణ చట్టం,2019ని అమలులోకి తెచ్చింది.ఈ చట్టం 12జనవరి 2019న రాష్ట్రపతి ఆమోదం పొంది అదే రోజు గెజిట్‌లో ప్రచురించబడిరది. 27సెప్టెంబర్2022న బెంచ్ అన్ని పక్షాల వాదనలను ముగించి తీర్పును రిజర్వ్ చేసింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌లు రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతాయని 3:2 విభజనలో బెంచ్ 7నవంబర్2022న తీర్పును వెలువరించింది. 2019 లో ప్రతిపాదించబడ్డ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 2022 తుది తీర్పు తర్వాత అమలులోనికి వచ్చాయి. ప్రతిపాదనకు ముందు గానీ మధ్యలో గానీ ఆ తర్వాత గానీ అగ్రవర్ణాలలోని పేదలను గుర్తించడానికి ఎలాంటి శాస్త్రీయమైన కసరత్తు జరగలేదు. కానీ ఓబీసీలను గుర్తించడానికి మాత్రం శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం జరిగింది.
సామాజికంగా,విద్యాపరంగా వెనుకబడ్డ తరగతులను గుర్తించేందుకు గాను శాస్త్రీయ అధ్యయనానికి శ్రీకారం చుట్టబడిరది.1953లో ఏర్పరిచిన కాకా కాలేల్కర్ కమిషన్ సంప్రదాయ కుల సోపాన క్రమంలో తక్కువ సామాజిక స్థానంతో పాటు సాధారణ విద్యా పురోగతి లేకపోవడం,వాణిజ్యం మరియు పరిశ్రమల రంగంలో తగిన ప్రాతినిధ్యం లేకపోవడం,అసురక్షిత భూములను కలిగి ఉండడం,సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం వంటి వాటిని ప్రమాణాలుగా పరిగణలోనికి తీసుకున్నది. 1979లో ఏర్పరచిన బిపి మండల్ కమిషన్ సామాజిక,ఆర్థిక,విద్య పరంగా మరింత లోతైన అధ్యయనం చేసి వారు చేపట్టిన వృత్తులను,పాఠశాలలో పిల్లల నమోదు స్థాయిని,స్త్రీల స్థితిగతుల్ని పరిగణలోకి తీసుకొని వాటికి సూచికలను రూపొందించింది.2399 వెనకబడ్డ కులాలు,837 అత్యంత వెనుకబడ్డ కులాలు ఉన్నాయని,సమాజంలో వారి జనాభా52% ఉన్నదని అదే అనుపాతంలో రిజర్వేషన్ ను కల్పించాలని కమిషన్ ప్రతిపాదించింది.అయితే 1992లో ఇందిరా సాహ్నీ కేసులో ఇచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్లు 50% దాటకుండా ఉండేలా ఓబీసీలకు 27% రిజర్వేషన్ ను ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.
విద్యా,ఉద్యోగాలలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రిజర్వేషన్ కోటానే రాష్ట్రాలు అమలు చేయడం లేదు.ఉదాహరణకు కేంద్రం ఎస్టీ రిజర్వేషన్7.5% ఇస్తుండగా ఉత్తరాఖండ్,హిమాచల్ ప్రదేశ్ లలో4%,బీహార్,ఉత్తర ప్రదేశ్,కేరళలో 2% చొప్పున,తమిళనాడులో 1%గా,ఈశాన్య రాష్ట్రాలలో 80%, లక్షదీప్ లో100% గా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం15% ఎస్సీలకు రిజ ర్వేషన్ కల్పిస్తుండగా తమిళనాడులో 18%, గోవాలో2%, సిక్కిం,గుజరాత్ లలో7%,ఛత్తీస్ ఘడ్,రాజస్థాన్ లలో16% చొప్పున అమలు చేస్తున్నారు. అంటే ఆయా రాష్ట్రాలలో జనాభాను బట్టి వారికి రిజర్వేషన్లను కల్పిస్తున్నారన్నమాట.ఈడబ్ల్యూ
ఇదిలా ఉండగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలలోని లొసుగులను ఆధారం చేసుకొని అధిక ఆదాయం ఉన్నప్పటికీ కొందరు దొడ్డిదారిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను తెచ్చుకొని ప్రభుత్వోద్యోగాలు పొందుతున్నారు. బీసీల వలె తమకు కూడా ఉద్యోగం నుండి వచ్చిన వేతనాన్ని, వ్యవసాయాదాయాన్ని మినహాయింపు చేసి ఈడబ్ల్యూఎస్ పరిధిలోకి తీసుకురావాలని అగ్రవర్ణాల్లోని మరికొందరు కోరుతున్నారు. ఆగమేఘాలపై తెచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను పునఃసమీక్షించి నిజమైన నిరుపేదలను గుర్తించడానికి ఒక కమిషన్ ను వేసి శాస్త్రీయ అధ్యయనం చేసి జనాభా ఆధారంగా వారి వాటాను నిర్దేశించాలని,ఆర్థిక కోణంలో ప్రతిపాదించిన ఈ రిజర్వేషన్లను ప్రత్యేక రిజర్వేషన్ గా పేర్కొంటూ హారిజాంటల్ గా అమలు చేసి బీసీ,ఎస్సీ,ఎస్టీ వర్గాల వారిని కూడా ఈ రిజర్వేషన్ పరిధిలోకి తీసుకు రావడం వల్ల ‘‘రూల్ ఆఫ్ రిజర్వేషన్’’ కు న్యాయం చేకూర్చడమే కాకుండా భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలు కూడా తలెత్తవని పలువురు న్యాయనిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం మరియు న్యాయవ్యవస్థ స్పందించి ఈ రిజర్వేషన్లను పునఃసమీక్షించి, సమగ్ర అధ్యయనం చేసి అందరికీ న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
భాస్కర్ యలకంటి
సామాజిక, రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు
సెల్: 8919464488