ఆన్‌లైన్‌ ద్వారా మేడారం దేవతలకు బంగారం

లాంఛనంగా యాప్‌ను ప్రారంభించిన సిఎం రేవంత్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : అసెంబ్లీ కమిటీ హాలులో ఆన్‌లైన్‌ ద్వారా మేడారం సమ్మక్క`సారక్కలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. అసెంబ్లీ కమిటీ హాలులో ఆన్‌లైన్‌ ద్వారా మేడారం సమ్మక్క, సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. అనంతరం తన మనవడు రియాన్ష్‌ నిలువెత్తు బంగారం ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించారు. అలాగే తన మనవరాలి నిలువెత్తు బంగారం ఆన్‌లైన్‌ ద్వారా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సమర్పించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌, ఇతర అధికారులు హాజరయ్యారు.

మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల కోసం అమ్మవార్లకు ఇచ్చే నిలువెత్తు బంగారాన్ని సమర్పించే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. మేడారానికి వెళ్లలేని భక్తులు సమ్మక్క సారక్కలకు బంగారంగా భావించే బెల్లం సమర్పించే అవకాశంతో పాటు ప్రసాదం తెప్పించుకునే సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. విూ సేవ, పోస్టాఫీసులతో పాటు ‘టీ`యాప్‌ ఫోలియో’ యాప్‌ ద్వారా సేవలు పొందేలా ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page