హైదరాబాద్, నవంబర్ 12 : రాష్ట్రంలో మరో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. డిఫెన్సర్ సెక్యూరిటీ సర్వీసెస్ లైసెన్స్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లైసెన్స్ రద్దు తక్షణమే అమల్లోకి వచ్చేలా కంట్రోలింగ్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. భద్రతా సిబ్బంది నియామకాల్లో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్న కారణంతో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ సెక్యూరిటీ ఏజెన్సీలపై దాడులు చేస్తోంది. ఇటీవలే ఓ ఏజెన్సీ లైసెన్స్‌ను రద్దు చేసిన ప్రభుత్వం.. తాజాగా మరో ఏజెన్సీ అయిన డిఫెన్సర్ సెక్యూరిటీ సర్వీసెస్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. లైసెన్స్ రద్దు ఉత్తర్వులు తక్షణమే అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఏడు రోజుల్లో ఒరిజినల్ లైసెన్స్‌ను ప్రభుత్వానికి అప్పగించాలని డిఫెన్సర్ సెక్యూరిటీ సర్వీసెస్‌కు ఆదేశాలు జారీ చేసింది. లైసెన్స్ రద్దుకు భద్రతా సిబ్బంది నియామకంలో తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనలే కారణమని కంట్రోలింగ్ అథారిటీ తెలిపింది. పోలీస్ వెరిఫికేషన్ లేకుండానే సెక్యూరిటీ గార్డులను నియమిస్తున్నట్లు.. ఎటువంటి శిక్షణ లేకుండానే సిబ్బందిని విధుల్లోకి పంపినట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




