అమరులైన మాదిగ పోరాట యోధలకు అంకితం
ఈ తీర్పుతో న్యాయం మా వైపు ఉందని రుజువైంది
పోరాటంలో సహకరించిన అందరికీ మా కృతజ్ఞతలు
విూడియా ముందు భావోద్వేగానికి గురైన ఎంఆర్‌పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ
న్యూ దిల్లీ, ఆగస్ట్ 1 : ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పును మాదిగ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్వాగతించారు. కీలక తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయంలో ప్రధానమంత్రి మోదీ, హోమ్ మంత్రి అమిత్‌షా, వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎపి సిఎం చంద్రబాబు ఇలా చాలా మంది సహాయం చేశారని గుర్తు చేశారు. ఈ విజయం కోసమే 30 ఏళ్లుగా పోరాటం చేశామని, ఎందరినో ఉద్యమకారులను కోల్పోయామన్నారు. అయినా పట్టు వదలకుండా ఉప వర్గీకరణ సాధించుకున్నామని అభిప్రాయపడ్డారు. ఈ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చాలా మంది ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. అయితే ఇది ఒకరి గెలుపో ఇంకొకరి ఓటమో కాదన్నారు. దళితుల అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని మందకృష్ణ పిలుపునిచ్చారు.
రానురాను ప్రభుత్వ రంగాల్లో వర్గీకరణ పరిధి తగ్గిపోతుందని అది పెంచేందుకు అందరి నాయకులు కృషి చేయాలని అభిప్రాయపడ్డారు. ఇక సుప్రీమ్ కోర్టు తీర్పుపై మందకృష్ణ మాదిగ స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. విూడియా ఎదుటే ఆయన కంటనీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…తమ 30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగిందని, సుప్రీపన కోర్టు తీర్పు న్యాయాన్ని బతికించిందని, ఈ పక్రియ వేగవంతానికి ప్రధాని నరేంద్ర మోదీ చొరవ తీసుకున్నారని, వర్గీకరణ చేసిన ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ విజయాన్ని అమరులకు అంకితం ఇస్తున్నామని, రిజర్వేషన్ల సిస్టమ్ ఇప్పుడు రెండో అడుగు వేయబోతుందని, తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అనివార్యమని, వర్గీకరణకు సంబంధించిన జీవోలు వొచ్చిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని, ఉద్యోగ నోటిఫికేషన్లు సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రీ`నోటిఫికేషన్లు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మందకృష్ణ మాదిగ కోరారు. వర్గీకరణకు జనాభా లెక్కలతో పనిలేదని మరోసారి గుర్తు చేశారు. త్వరలో విజయోత్సవ సభ నిర్వహిస్తామని, ఇందుకు సహకరించిన వారికి కృతజ్ఞత సభలు ఉంటాయని మందకృష్ణ వెల్లడిరచారు.





