– ప్రేమ పేరుతో శారీరంగా లోబర్చుకున్న యువకుడు
– గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోమన్నందుకు..
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 17: హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ప్రియురాలిని ప్రియుడు హత్య చేశాడు. ప్రియురాలిపై అనుమానమే ఈ హత్యకు కారణమని బాలాపూర్ పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందగానే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. మృతురాలిని బిహార్ కు చెందిన యువతిగా గుర్తించారు. స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్లో మృతురాలు పనిచేస్తోంది. ఆమెను ప్రేమ పేరుతో బాలాపూర్ కు చెందిన అహ్మద్ దగ్గరయ్యాడు. ఇటీవల యువతి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని అతడికి చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. తనను పెళ్లి చేసుకోవాలని అతడిని బలవంతం చేసింది. దీంతో ప్రియురాలి అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడు ప్లాన్ చేశాడు. తల్లిదండ్రులతో కలిసి యువతిని అహ్మద్ హత్య చేసినట్లు సమాచారం. ఈనెల 16న మృతదేహాన్ని గో సంచిలో తరలిస్తుండగా స్థానికులు అనుమానించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరు కున్న పోలీసులు నిందితుడితోపాటు అతడి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



