– ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణ నిలిపివేత
న్యూదిల్లీ, ఆగస్టు 17 : కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై అలహాబాద్ హైకోర్టులో కొనసాగుతున్న విచారణను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిలిపివేయాలని ఆదేశించింది. అలాగే ఈ కేసులో సీబీఐ, ఈడీ ఎలాంటి నివేదికను ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టుకు సమర్పించకూడదని స్పష్టం చేసింది. Áరాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జాయ్‌మాల్య బాగ్చి, వి.మోహనాలతో కూడిన ధర్మాసనం విచారించింది. అలహాబాద్ హైకోర్టు ఇప్పటికే ఈ కేసులో తదుపరి విచారణను ఈనెల 20న చేపట్టనుంది. అయితే హైకోర్టు విచారణను తదుపరి ఆదేశాల వరకు వాయిదా వేయాలని తాజాగా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తమ దర్యాప్తు లేదా పరిశీలనకు సంబంధించిన ఎలాంటి నివేదికను హైకోర్టుకు సమర్పించకూడదని పేర్కొంది. రాహుల్ గాంధీ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త విఘ్నేశ్ శిశిర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ వ్యవహారం అలహాబాద్ హైకోర్టుకు చేరింది. ఈ ఆరోపణలను పరిశీలించాలని సీబీఐ, ఈడీకి హైకోర్టు గతంలో సూచించింది. ఈ ఆదేశాలను రాహుల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అంతేకాక ఈ కేసు విచారణను అలహాబాద్ హైకోర్టు నుంచి దిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రత్యేక పిటిషన్ కూడా దాఖలు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



