– ఇనుప ఊయల తగిలి విద్యార్థి దుర్మరణం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 24: సరదాగా గడపాల్సిన స్కూల్ పిక్నిక్ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం విద్యార్థులను మంగళవారం మొయినాబాద్ లోని లోటస్ పాండ్ కు పిక్నిక్ కు తీసుకెళ్లింది. ఈ క్రమంలో పార్కులో ఉన్న భారీ ఇనుప ఊయలపై సుమారు 10 మంది విద్యార్థులు ఎక్కారు. వెనుక నుంచి మరో నలుగురు విద్యార్థులు ఆ ఊయలను అత్యంత వేగంగా ఊపడంతో అది ఒక్కసారిగా అదుపుతప్పింది. అ త్యంత వేగంగా వెనక్కి దూసుకొచ్చిన ఊయల అక్కడే నిలబడి ఉన్న ఇద్దరు చిన్నారులను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పదేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతిచెందగా మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే తమ కుమారుడి ప్రాణాలు తీసిందని మృతుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




