– ప్రభుత్వంపై మంత్రి హరీశ్ రావు విమర్శ
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18: హైదరాబాద్ లో ఒలింపిక్స్ నిర్వహిస్తామంటూ డబ్బా ప్రచారం చేసుకునే రేవంత్ రెడ్డీ.. క్రీడాకారుల సమస్యలు మీకు కనిపించడం లేదా? అన్ని వర్గాల ప్రజలను మోసి చేసినట్లే.. క్రీడాకారులను కూడా దగా చేసారని బిఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు. క్రీడాకారుల సమస్యలు వింటుంటే ఆవేదన కలుగుతున్నది. మీ ఫుట్ బాల్ సరదాలు తీర్చుకోవడం కోసం వంద కోట్ల ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడమే తప్ప క్రీడాకారుల కోసం చేసిన ఖర్చు సున్నా. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటే సామర్థ్యం ఉన్నప్పటికీ, ప్రభుత్వ ప్రోత్సాహం లేక క్రీడాకారుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఖేలో ఇండియా క్రీడలకు ప్రధానిని ఆహ్వానిస్తున్న రేవంత్ రెడ్డి గారూ.. క్రీడాకారులకు కోచ్ లను నియమించాలన్న కనీస సోయి కూడా మీకు లేదా? విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసే పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలన్న ఆలోచన కూడా మీకు లేదా?పీఈటీలు లేకుండా, పీడీలు లేకుండా మీరు ఏర్పాటు చేస్తానంటున్న స్పోర్ట్స్ యూనివర్సిటీ లక్ష్యం ఎలా నెరవేరుతుంది? కోచ్ లు లేకుండా క్రీడా కారులకు ఎవరు మార్గనిర్దేశం చేస్తారు?ఖేలో ఇండియా క్రీడా పోటీల్లో తెలంగాణ సత్తా చాటాలంటే ముందుగా కోచ్ లను నియమించాలన్నారు. గ్రామీణ క్రీడాకారులను గుర్తించి, ప్రోత్సహించేందుకు గాను పీఈటీ, పీడీల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయిండి.మాటలు కాదు, చేతలు చూపించి తెలంగాణ క్రీడాకారుల భవిష్యత్తుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోండి.జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహకాలు అందించాలి.గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు టీఏ/డీఏ ప్రయాణ, వసతి సౌకర్యాలు కల్పించాలి.క్రీడా బడ్జెట్ను పెంచి, కేటాయించిన నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటించాలి.మెగా డీఎస్సీ అని నిరుద్యోగ యువతను దగా చేశారు, వెంటనే మెగా డీఎస్సీ నిర్వహించాలి. తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటును వేగవంతం చేసి, ఆధునిక శిక్షణ కేంద్రాలు, మైదానాలు, క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి.క్రీడల్లో రాజకీయ జోక్యం లేకుండా సమాన అవకాశాలు, పారదర్శకమైన ఎంపిక విధానం కల్పించాలి.క్రీడారంగ అభివృద్ధి అంటే స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రకటనలు, మైకుల ముందు ప్రగల్భాలు కాదు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం అవకాశాలు కల్పించడం.క్రీడాకారుల భవిష్యత్తుతో చలగాటం ఆడటం మానేసి, హక్కులను కాపాడి, వారి ఆశయ సాధనకు తోడ్పాటు అందించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





