– మంత్రి వివేక్ వెంకటస్వామి
– గుమ్మడిదలలో నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ
పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 18: పేదల జీవితాల్లో ఆర్థిక భరోసా నింపపేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. గుమ్మడిదలలో మంత్రి వివేక్ వెంకటస్వామితోపాటు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్, పటాన్ చెరు ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ పాల్గొని లబ్దిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.అర్హతే ప్రామాణికంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ విధానమన్నారు. పేదల సంక్షేమం, ప్రజల ఆరోగ్యం, నాణ్యమైన విద్య, మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమాంత రంగా ముందుకు తీసుకెళ్తాందని అన్నారు. నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న పేద కుటుంబాలకు పింఛన్లు కొండంత అండగా నిలుస్తాయని అన్నారు. ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సంక్షేమ పాలన అందిస్తోందని, ముఖ్యంగా బలహీనవర్గాలు, మహిళలు, వృద్ధుల అభ్యున్నతికి కృషి చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి గడపకు చేరేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పటాన్ చెరు ప్రాంతాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. గుమ్మడిదల ప్రాంత అభివృద్ధితో పాటు పటాన్ చెరు ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజలు, కార్యకర్తలు, లబ్దిదా రులు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





