– పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధికి ఆర్థిక సాయం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరు 18: మంచిరేవులలోని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (వైఐపీఎస్) మౌలిక వసతుల అభివృద్ధికి అరోబిందో ఫార్మా ఫౌండేషన్ రూ.కోటి విరాళాన్ని డీజీపీ సి.వి.ఆనంద్‌కు చెక్కును బుధవారం అందజేశారు. అరోబిందో ఫార్మా లిమిటెడ్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, అరోబిందో ఫార్మా ఫౌండేషన్ డైరెక్టర్ కె.నిత్యానంద రెడ్డి తరఫున ఫౌండేషన్ సీఎస్‌ఆర్ హెడ్ ఎస్.సదానంద రెడ్డి, అరోబిందో ఫార్మా లిమిటెడ్ కార్పొరేట్ వ్యవహారాల ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఐ.ఎస్.ఆర్.రావు ఈ చెక్కును డీజీపీకి అందించారు. విరాళం అందించడంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రత్యేక చొరవ చూపారు. ఫౌండేషన్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, విరాళం అందేలా కృషి చేశారు. పాఠశాలలో మెరుగైన విద్యా సదుపాయాల కల్పన, మౌలిక వసతుల బలోపేతం, విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు సమగ్ర అభివృద్ధికి అవసరమైన అవకాశాలను కల్పించేందుకు ఈ ఆర్థిక సాయం దోహదపడనుంది. కార్యక్రమంలో మహిళా భద్రతా విభాగం డీజీ సౌమ్య మిశ్రా, కమిషనర్ మహేశ్ భగవత్, ఏడీజీ (శాంతిభద్రతలు) అకున్ సబర్వాల్ తోపాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





