వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..

  • ప్రియుడితో భర్తను హత్య చేయించిన భార్య
  • వివరాలు వెల్లడించిన డీఎస్పీ సంపత్‌కుమార్‌

జయశంకర్ భూపాలపల్లి ,ప్రజాతంత్ర, అక్టోబర్ 1: “పదేళ్ల కాపురం.. ఇద్దరి మధ్య న మ్మకం.. కానీ, అదే సంసారంలో ఒకరి స్వా ర్థం కాలకూట విషమై ఆ భర్త నిండు ప్రాణా న్ని బలిగొంది. వివాహేతర సంబంధానికి అ డ్డువచ్చాడన్న ఒక్క కక్షతో.. భ‌ర్త‌ను హ‌త్య‌చేసి చివరకు ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూ సిన భార్య బాగోతం పోలీసుల దర్యాప్తులో బట్టబయలైంది.”
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని రూ.ల‌క్ష సుపారీ ఇచ్చి భర్తను కిరాతకంగా హతమార్చిన భార్య, ఆమె ప్రియుడు సహా మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. జయ శంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాలను డీఎస్పీ సంపత్‌‌రావు, సీఐ కరుణాకర్‌రావు, ఎస్సై అశోక్‌ విలేకరుల స మావేశంలో వెల్లడించారు. గొల్లపల్లికి చెంది న పెండెల సంపత్ (32) ప్లంబర్‌గా పనిచే స్తూ, బుద్దారంలోని అత్తగారింట్లో భార్య సుమలత (26)తో కలిసి నివాసముంటు న్నాడు. వీరికి పదేళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలంగా బుద్దారానికి చెందిన ఉమ్మల శ్రీకాంత్‌ (36) తో సుమలత వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.భార్య ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంపత్‌.. శ్రీకాంత్‌ను పలుమార్లు హెచ్చరించాడు.

రూ. లక్ష సుపారీతో హత్యకు ప్లాన్

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్న సంప త్‌ను కడతేర్చాలని సుమలత, శ్రీకాంత్‌ పథ కం వేశారు. హత్యకు సహకరించేందుకు అదే గ్రామానికి చెందిన పోలుదాసరి తరుణ్ (23) అనే యువకుడికి రూ.లక్ష ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. పథకం ప్రకా రం గ‌త‌నెల 17న‌ తేదీ రాత్రి శ్రీకాంత్‌, తరుణ్‌ లు సంపత్‌ను మద్యం తాగుదామని నమ్మిం చి బుద్దారంలోని జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల మైదానానికి తీసుకెళ్లారు. అక్కడ మద్యంలో పురుగుల మందు కలిపి సంపత్‌తో తాగించా రు. తీవ్ర అస్వస్థతకు గురైన సంపత్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.
అయితే సంపత్‌ మరణించిన అనంతరం నిందితులు మృతదేహాన్ని పల్సర్‌ బైక్‌పై ఎ క్కించుకుని అతని ఇంటికి తీసుకొచ్చారు. సంపత్‌ స్వయంగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించేందుకు మృతదేహం నోటిపై, దుస్తులపై, ఇంటి నేలపై పురుగుల మందు పోసి అక్కడి నుంచి పరారయ్యారు.
కేసు ఛేదించిన పోలీసులు

మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమో దు చేసుకున్న పోలీసులు.. సాంకేతిక ఆధా రాలు, సాక్షుల విచారణతో ఇది పక్కా పథ కం ప్రకారం జరిగిన హత్యగా నిర్ధారించారు. పోలీసుల నిఘా పెరగడంతో భయాందోళన కు గురైన నిందితులు గ్రామ పెద్దల సమ క్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన పల్సర్‌ బైక్‌, మూడు సెల్‌ఫోన్లు, రూ.500 నగదుతో పాటు పురుగుల మందు కలిపిన మద్యం బాటిల్‌, పురుగుల మందు సీసాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సుమల త, శ్రీకాంత్, తరుణ్‌లను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించినట్లు డీఎస్పీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *