మైనారిటీల విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

– మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్
– బోయపల్లిలో టీఎంఆరఈఐఎస్ పాఠశాల భవనం ప్రారంభం

మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, జూన్ 20 : రాష్ట్రంలో మైనారిటీ విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మరియు మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా బోయపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎంఆరఈఐఎస్) పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక విద్యా సంస్థలను అభివృద్ధి చేస్తోందన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, స్కాలర్‌షిప్‌లు, కోచింగ్ సౌకర్యాలు, పాఠ్యపుస్తకాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల భవిష్యత్తును బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ‘విద్యే అభివృద్ధికి మూలాధారం.. ఎంత ఎక్కువగా చదువుకుంటే అంత ఎక్కువ అవకాశాలు లభిస్తాయి.. విద్యార్థులు కష్టపడి చదివి తమ ప్రతిభను నిరూపించుకోవాలి.. ప్రభుత్వం మీకు అవసరమైన ప్రతి సహకారం అందించడానికి సిద్ధంగా ఉంది’ అని మంత్రి పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి తనలోని ప్రతిభను ల్ణ మెరుగుపరుచుకోవాలని, క్రమశిక్షణ, అంకితభావం, కఠోర శ్రమ ద్వారానే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని సూచించారు. హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు మైనారిటీ విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. కార్యక్రమంలో టిమ్రిస్ చైర్మన్ ఫహీమ్ ఖురేషి, స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబైదుల్లా కొత్వాల్, మైనారిటీల సంక్షేమ శాఖ కార్యదర్శి బి.షఫీయుల్లా, మహబూబ్‌నగర్ ఎంపీ డి.కె.అరుణ, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మైనారిటీల సంక్షేమ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, కమ్యూనిటీ నాయకులు, కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *