నాలుగు తరాలుగా కాంగ్రెస్ కు విధేయులం

– ఎమ్మెల్సీ  అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి 

– పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియ ప్రారంభం 
సూర్యాపేట, ప్రజాతంత్ర అక్టోబర్ 3: తమ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి నాలుగు తరాలుగా విధేయతతో ఉందని ఏఐసీసీ సభ్యుడు, నల్గొండ, ఖమ్మం వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల  నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ  అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు. పార్టీ జాతీయ, రాష్ట్ర అధిష్టానం ఏకగ్రీవంగా  ఎమ్మెల్సీ గా  తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశాయ‌ని తుంగతుర్తి నియోజకవర్గంలోని అర్వపల్లి మండలంలోగల శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నల్గొండ-ఖమ్మం -వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, ఓటర్ నమోదు ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత గల పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో తమ కుటుంబానికి సుదీర్ఘ సంబంధాలు ఉన్నాయని తెలిపారు. తనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తన అభ్యర్థిత్వంపై ఎలాంటి గందరగోళం, అసంతృప్తి లేదని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని తమ కుటుంబం ఎప్పుడు ధిక్కరించలేదని స్పష్టం చేశారు. పట్టభద్రులకు ఓటర్ నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు గ్రామ గ్రామాన పట్టభద్రుల ఎమ్మెల్సీ హెల్ప్ లైన్ ప్రారంభిస్తామని వెల్లడించారు. పట్టభద్రుల సమస్యలను ప్రజల తరపున బలంగా వినిపించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, స్వర్గీయ  దామోదర్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 మంత్రులు, శాసనసభ్యులతో భేటీ
నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ పలువురు మంత్రులు, శాసనసభ్యులను  సర్వోత్తం రెడ్డి కలిశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వేముల వీరేశం, మందుల సామేలు లను మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సాధించేందుకు తనకు పూర్తి మద్దతు ఇవ్వాలని  కోరారు.
సరోత్తంరెడ్డి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
—————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *