కొండగట్టు అంజ‌న్న‌ మహా సంప్రోక్షణకు రండి

– డిప్యూటీ సీఎం భట్టికి ఆహ్వానం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలోని ప్రసిద్ధ కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో నిర్వహించనున్న చందనోత్పాదన మహా సంప్రోక్షణ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను దేవస్థానం అధికారులు, అర్చకులు ఆహ్వానించారు.‎ఈ మేరకు ప్రజాభవన్‌లో భట్టి విక్రమార్కను మంగళవారం కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు దేవస్థానంలో నిర్వహించనున్న వివిధ ఆధ్యాత్మిక, వైదిక కార్యక్రమాల వివరాలను అర్చకులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. 20న నిర్వహించనున్న మహా సంప్రోక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. జీయర్ స్వాముల ఆధ్వర్యంలో మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో అంజన రెడ్డి ఉప ముఖ్యమంత్రికి వివరించారు. కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సత్యం పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *