– హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ, ప్రజాతంత్ర, ఆక్టోబర్ 3 : వయోవృద్ధులు గతాన్ని తలచుకుని బాధపడకుండా, ఎలాంటి ఉద్రేకాలకు లోనుకాకుండా ఆనందంగా గడపాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. కుటుంబంలో, సమాజంలో సర్దుబాటు చేసుకుంటూ తమ విలువైన అనుభవాలను భావితరాలకు అందించాలని కోరారు. హన్మకొండ కలెక్టరేట్‌లో జిల్లా సంక్షేమ శాఖ , గ్రామీణభివృద్ది శాఖ ఆధ్వర్యంలో జరిగిన వయోవృద్ధుల దినోత్సవ వేడుకలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన, విలువలతో కూడిన సమాజ నిర్మాణంలో వయోవృద్ధుల అనుభవాలు ఎంతో కీలకమన్నారు. వయోవృద్ధుల అనుభవాలను పిల్లలతో పంచుకోవడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి, భయం లేకుండా వేదికలపై మాట్లాడే సామర్థ్యం పెరుగుతున్నాయని తెలిపారు. వయోవృద్ధులను గౌరవిస్తూ, వారి హక్కులను కాపాడుతామని, వారికి ప్రేమ పూర్వక రక్షణ కల్పిస్తామని అందరితో కలెక్టర్ ప్రతిఙ్ఙ చేయించారు, అనంతరం వయోవృద్ధులను ఘనంగా సన్మానించారు. వయోవృద్ధుల చట్టం, ట్రిబ్యునల్ కోర్టుపై సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు మెంబర్ డాక్టర్ అనితా రెడ్డి అవగాహన కల్పించారు, వృద్ధులకు ఏ సమస్యలు వచ్చినా ట్రిబ్యునల్ కోర్టు ను సంప్రదించాలని తన నెంబర్ 9177362072 సైతం సంప్రదించవచ్చని డాక్టర్ అనితా రెడ్డి తెలిపారు కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శేషాద్రి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య, పీడీ డీఆర్డీఏ శ్రీనివాస్, డిడబ్ల్యుఓ విశ్వజ. జిల్లా వయోవృద్ధుల కమిటీ ప్రెసిడెంట్ చంద్రమౌళి, నర్సయ్య, కమిటీల, ప్రవీణ్, వివిధ సంస్థల సభ్యులు రవికిరణ్, సిందు, కళ్యాణి, సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది, వయోవృద్ధులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





