ఇంటిగ్రేటెడ్, ప్రభుత్వ దవాఖానలకు మాజీ ఎమ్మెల్యేల పేరు పెట్టాలి

వనపర్తి, ప్రజాతంత్ర, మార్చి 2: ప్రభుత్వం ఏర్పడ్డాక వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు 375 కోట్ల అభివృద్ధి పనులు చేసుకున్నామని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి (Wanaparthy MLA Megha Reddy ) తెలిపారు. ఆదివారం మరో వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేశారు. 500 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, పెబ్బేర్ లో 30 పడకల ప్రభుత్వదవాఖానకు శంకుస్థాపనలు చేశారు. 100 గ్రామాలకు గ్రామీణ రోడ్లను మంజూరు చేసిన సీతక్కకు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ కు మాజీ ఎమ్మెల్యే జయరాములు యాదవ్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే కోరారు.
500 పడకల హాస్పిటల్కు మాజీ ఎమ్మెల్యే డా. బాలకిష్టయ్య పేరు పెట్టాలని ముఖ్యమంత్రిని కోరిన ఎమ్మెల్యే. జిల్లాలో సంక్షేమ హాస్టల్ ప్రైవేట్ భవనాలు ఉన్నాయని వాటికి పక్క భవనాలు నిర్మించినందుకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. పాలిటెక్నికళాశాలకు రేన్యువేశన్ చేసేందుకు నిధులు మంజూరు చేసి కళాశాలకు పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. జేఎన్టీయూ కళాశాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, జిల్లాలోని 133 గ్రామపంచాయతీలు రెండు మున్సిపాలిటీలకు ఎస్.డి.ఎఫ్. కింద నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ముఖ్య మంత్రి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి నిధులు మంజూరు చేయాలని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *