శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 28 : చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస వాహన దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు. నిందితులను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్సీ పురం డివిజన్ పరిధిలో ఈ అరెస్ట్ జరిగింది. చందానగర్ పోలీస్ స్టేషన్ లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్ సీ పురం ఏసీపీ సీహెచ్ శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. ఈనెల 25/26 రాత్రి హుడా కాలనీ, చందానగర్ కు చెందిన అదేపు అజయ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు చెందిన రాయల్ ఎన్ఫిల్డ్ క్లాసిక్ 350 బైక్ ఇంటి ముందు నుండి చోరీ అయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. పక్కా సమాచారంతో చందానగర్ ఎంఎంటిఎస్ రోడ్ లో ఒక దొంగిలించిన బైక్ ను తీసుకెళ్తుండగా ఐదుగురిని మంగళవారం పట్టుకున్నారు. నిందితులంతా ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి పట్టణానికి చెందిన వారుగా గుర్తించారు. వారిలో ఏ 1: గడ్డం ప్రవీణ్ (21)బి .టెక్ విద్యార్థి, చెన్నై, ఏ 2: బూరిడి గోపీచంద్ (20), ప్రైవేట్ ఉద్యోగి, ఏ 3: చోడవరపు దినేష్ కుమార్ (22), ప్రైవేట్ ఉద్యోగి, ఏ 4: గీసాల షణ్ముఖ సత్య సాయి (21), విద్యార్థి ఏ 5: సీరపు దినేష్ కుమార్ (22), విద్యార్థిలను వరుస దొంగతనాల కేసులో అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. విచారణలో నిందితులు డిసెంబర్ 2025 నుండి సైబరాబాద్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించునట్లు ఏసీపీ తెలిపారు. దొంగతనానికి కటింగ్ ఫ్లయర్స్, స్పేర్ లాక్స్, ఫేక్ నంబర్ ప్లేట్లు వాడి, దొంగిలించిన వాహనాలను రాజమండ్రికి తరలించేవారు. స్వాధీనం చేసుకున్న సొత్తు: 3 రాయల్ ఎన్ ఫీల్డ్, మరొక వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు, కటింగ్ ఫ్లయర్స్, స్పానర్లు, హ్యాండిల్ లాక్స్, పెట్రోల్ ట్యాంక్ లాక్స్,11 ఫేక్ నంబర్ ప్లేట్లు నిందితుల నుండి జప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు, నిందితులను రాత్రి 11:30 గంటలకు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. మిగిలిన వాహనాల రికవరీ కోసం దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ప్రజలందరూ తమ వాహనాలను సురక్షితంగా పార్క్ చేయాలని, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు తెలియజేయాలని లేదా 112 కు డయల్ చేయాలని పోలీసులు కోరారు, చందానగర్ ఎస్ హెచ్ ఓ శ్రీధర్ పర్యవేక్షణలో క్రైమ్ టీమ్, సీసీఏస్ ఇన్స్పెక్టర్ విజయ్, ఆర్సీ పురం బృందం కలిసి దొంగలను పట్టుకున్నందుకు ఆర్ సీ పురం డివిజన్ ఏసీపీ అభినందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





