– ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 27 : కేపీహెచ్‌బీ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్-3లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారితోపాటు రెండేళ్ల కుమార్తెను సైతం చంపేశారు. తమ చావుకు ఎవరూ కారణం కాదని.. వేరే వారిని వివరాలు అడగొద్దు అంటూ గోడ మీద రాసి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందగానే పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు పాల్పడిన దంపతులది పశ్చిమ బెంగాల్‌కు చెందిన గోపి, సమతగా గుర్తించారు. చిన్నారిని హత్య చేసి వారు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు గోపి రెస్టారెంట్లో చెఫ్‌గా పనిచేస్తున్నాడు. సమత ఇంట్లోనే ఉంటోంది. వీరికి రెండేళ్ల పాప స్నిగ్థ ఉంది. ఆర్థిక ఇబ్బందులతోనే ఆతద్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. పశ్చిమ బెంగాల్‌లోని మృతుల కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించి దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




