సీనియర్ ఎడిటర్ డాక్టర్ కే శ్రీనివాస్
కాళోజీ జంక్షన్/హన్మకొండ ప్రజాతంత్ర, మార్చి 4 : “భవిష్యత్ తెలంగాణ కు ఒక రాజకీయ విలువల తో కూడిన విధాన చట్రం కావాలని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కే శ్రీనివాస్ అన్నారు. మంగళవారం విశ్వవిద్యాలయ గణిత శాస్త్ర విభాగం సెమినార్ హాల్ లో వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన “ఆచార్య బి. జనార్దన్ రావు 23 వ వార్షిక స్మారక ఉపన్యాస కార్యక్రమం లో ప్రధాన వక్తగా “తెలంగాణ ఆఫ్టర్ ఏ డికేడ్ ఎమర్జింగ్ పొలిటికల్ అండ్ సోషల్ సినారియోసిస్” అనే అంశం పై అధ్యాపకులు, ఉద్యోగులు, పరిశోధకులు, విద్యార్థులు,విశ్రాంత ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. గొప్ప తాత్త్విక సిద్ధాంతకర్త ఆచార్య బి. జనార్ధన్ రావు అని గుర్తు చేశారు. అయన సమగ్ర అభివృద్ధి తో కూడుకొని ఉహించిన తెలంగాణా రూపకల్పన చేసారన్నారు. అయన ఆలోచనకు అనుగుణంగా జరుగలేదు అన్నారు. తెలంగాణా రాష్ట్ర డైనమిక్స్ మారుతున్నయన్నారు. మూడవ వర్గం ఏమర్జ్ అవుతుంది అన్నారు. తెలంగాణా గ్రామాలు డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్, లోన్ యాప్ లు వ్యసనాల బారిన పడిందన్నారు. పని చేయటానికి విముఖత తో ఇతర రాష్ట్ర కార్మికులు వలస వొస్తున్నారన్నారు. దీని నివారణ కు సాంస్కృతిక ఉద్యమం జరగాలి అన్నారు. ఉపాధి – అవకాశాల మధ్య అగాధం పెరిగింది అన్నారు. చిరు వ్యాపారుల లో ఉత్తరాది వారి ప్రాభల్యం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని నివారణ కు జోక్యం భద్రత అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించాలన్నారు. గ్రామీణ దుస్థితి ఉపశమనం పొందే దిశగా సంక్షేమ పధకాలు ఉండాలన్నారు. వ్యవసాయ సంబంధిత భూమి ఇతర రంగాలకు మరులుతుంది అన్నారు. రియల్ ఎస్టేట్ పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార భద్రత అంటే కేవలం వరి లభ్యత ఒక్కటే కాదన్నారు. 10 సంవత్సరాలు లో 7000 మంది రైతులు ఆత్మ హత్య చేసుకున్నారని వెల్లడించారు. విద్య, వైద్యం నిర్లక్ష్యం కాబడ్డాయని పేర్కొన్నారు. పాలకులలో జవాబు దారి తనం పెరగాలనీ ..10 సంవత్సరాలలో నైతికత లేకుండా పోయిందన్నారు. సివిల్ సొసైటీ లో చైతన్యం తగ్గిందన్నారు. దేశ రాజకీయలకు భిన్నంగా తెలంగాణా కొనసాగుతుందన్నారు. హింస పెరిగిందని స్పష్టం చేశారు. అందరి బాగుకోసం, భవిష్యత్ తెలంగాణా కోసం తెలంగాణా ఉద్యమ సమాజం పునర్ ఆలోచించాలన్నారు. ఈ కార్యక్రమం లో బియ్యాల జనార్ధన రావు మెమోరియల్ ఫౌండేషన్ బాధ్యులు ఆచార్య ఈ.రేవతి, ఆచార్య కే. మురళి మనోహర్, ఆచార్య నరేంద్ర బాబు తో పాటు బుచ్చి బాబు తదితరులు పాల్గొన్నారు.





