హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 25: డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ(ఏవోయూ) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) ప్రవేశాల పోస్టర్‌ను యూనివర్సిటీ ప్రాంగణంలో వైస్-ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ) కోర్సులు, పీ.జీ – ఎం.ఏ (తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, అర్థశాస్త్రం, చరిత్ర, ప్రభుత్వ పాలనా శాస్త్రం, రాజనీతి శాస్త్రం, సామాజ శాస్త్రం, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్), ఎం.కాం, ఎం.బి.ఏ, ఎం.బి.ఏ(హెచ్‌హెచ్‌సీఎం), ఎం.ఎస్సీ(వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, పర్యావరణ శాస్త్రం, గణితశాస్త్రం, అనువర్తిత గణితశాస్త్రం కోర్సులు), ఎం.ఎల్ఐఎస్సి, డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో అడ్మిషన్ లు జరుగుతున్నాయన్నారు. ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను www.braouonline.in; లేదా www.braou.ac.in లో తెలుసుకోవచ్చన్నారు. డిగ్రీ కోర్సులో అడ్మిషన్ పొందడానికి ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత, లేదా పదో తరగతి తర్వాత ఏదేనీ రెండు సంవత్సరాల కోర్సు, డిప్లొమా, ఐటిఐ, పాలిటెక్నిక్, ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్ పూర్తి చేసిన వారు కూడా అర్హులేనని పేర్కొన్నారు. పూర్తి సమాచారం, ఆన్ లైన్ లో నమోదు తదితర అంశాలపై సందేహాలుంటే సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని లేదా విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ నంబర్లు: 040-23680333 / 555 లలో లేదా టోల్‌ఫ్రీ నెం. 18005990101 లో సంప్రదించొచ్చని సూచించారు. అడ్మిషన్ ఫీజును నెట్ బ్యాంకింగ్/ క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా టీఎస్ ఆన్ లైన్ ద్వారా చెల్లించొచ్చు అని వివరించారు. ట్యూషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేది ఆగష్టు 7, 2026 అని పేర్కొన్నారు. కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ ప్రొ. జి.పుష్ప చక్రపాణి, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్.విజయ కృష్ణ రెడ్డి, విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు, వీసీ OSD ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్, ఎస్‌డీ అండ్ వీటీసీ డైరెక్టర్ ప్రొ. పల్లవి కాబ్డే తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





