ప్రజాశక్తి ఎప్పుడూ గొప్పదే

– ధర్మేంద్ర రాజీనామాపై కేటీఆర్‌ పోస్ట్

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జులై 25:యావత్‌ ‌దేశాన్ని కుదిపేసిన నీట్‌ ‌పేపర్‌ ‌లీకేజీ వ్యవహారంపై సీజీపీ కాక్రోచ్‌ ‌జనతా పార్టీతోపాటు విద్యార్థుల ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో వారి డిమాండ్ల మేరకు ధర్మేంద్ర ప్రధాన్‌ ‌తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయ‌డంపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‘ఎక్స్’ ‌వేదికగా స్పందించారు. అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తి ఎప్పుడూ గొప్పదన్నారు. దిల్లీలో విద్యార్థులు, యువతపై కేంద్ర ప్రభుత్వం చేసిన దాష్టీకానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ‌వద్ద శుక్రవారం నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమానికి మహా నగరంతోపాటు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిమంది యువతీ యువకులు దండుకట్టి తరలివచ్చారు. ఈ కార్య‌క‌మంలో కేటీఆర్‌ ‌భావోద్వేగంతో ప్రసంగించారు. పరీక్ష పే చర్చ పెట్టిన మీరు పేపర్‌ ‌లీకేజీలపై ఎందుకు పెట్టలేదు.. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఏమైంది అని కేంద్రాన్ని నిలదీశారు. దిల్లీలో పిల్లలపై దాడులను చూస్తుంటే ఇద్దరు పిల్లల తండ్రినైన తన మనస్సు చలించిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ, రేవంత్‌ ‌ప్రభుత్వాలపై తనదైన శైలిలో పంచులు విసిరారు. దిల్లీలో యువతపై మోదీ సర్కార్‌ ‌సాగిస్తున్న దమనకాండను కండ్లకుకట్టారు. రేవంత్‌ ‌దాగుడు మూతలను ఎత్తిచూపారు. దిల్లీ వీధుల్లో న్యాయం కోసం పోరాడుతున్న యువకులపై ఉగ్రవాదులు, దేశద్రోహులు, పాకిస్థాన్‌ ‌నుంచి నిధులు వస్తున్నాయని అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కేటీఆర్‌ ‌మండిపడ్డారు. నిజంగానే కేంద్రానికి బాధ్యత ఉంటే ఉద్యమిస్తున్న విద్యార్థుల వద్దకెళ్లి చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాల్సి ఉండేదన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *