– విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తేయాలి
– రాహుల్, మల్లికార్జున ఖర్గేలు మరింత గళం ఎత్తుతారు
– చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి
– క్యాండిల్ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 25: నీట్ పేపర్ లీకేజ్, విద్యావ్యవస్థలోని అక్రమాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ (ఛాత్ర/యువజన పోరాట వేదిక) ఆధ్వర్యంలో జరిగిన నిరసనలు, మరియు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వంటి పరిణామాలతో విద్యార్థులు సాధించిన విజయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గట్టిగా సమర్థించారు. శనివారం విద్యార్థుల పోరాటానికి మద్దతుగా నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలు, సభల్లో ఆయన ప్రసంగించారు. యువ మిత్రుల మోహల్లో విజయ దరహాసం నాకు కనిపిస్తోంది.ఈ రోజు జన్ జీ అన్నదమ్ముళ్ల మోహల్లో విజయదరహాసం కనిపిస్తోంది..కాని ఇది సరిపోదు.జన్ జీ యువత 58 ఇంచుల ఛాతిని ఓడించి విద్యా శాఖ మంత్రి రాజీనామా వరకు తెచ్చారు.నీట్ పరీక్ష పత్రాలు లీక్ కావడంతో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదు…పోరాటం లో విద్యార్థులపైన పెట్టిన కేసులను ఎత్తివేయలేదు..కేంద్ర ప్రభుత్వం పరీక్షా నిర్వహణలో విఫలం కావడం వల్ల అనేక మంది విద్యార్థుల నష్టపోయారు..రాహుల్ గాంధీ, మల్లిఖర్జున్ ఖర్గే , ఎంపీలు సభలో మరింత ఎక్కువ గళం ఎత్తుతారు..విద్యార్థులపైన పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి..చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి..అంబేద్కర్, ఇందిరమ్మ సాక్షి గా వేలాది మంది జన్ జీ యువత ఇక్కడికి తరలివచ్చారు..ఇక్కడికి వచ్చిన వారంతా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కాదు..భారతదేశ యువత సాధించిన విజయాన్ని కాంగ్రెస్ ఖాతాలో రాసుకోదల్చుకోలేదు..ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా జన్ జీ పోరాట ఫలితం..పోరాటానికి ప్రధాని మోదీ తలవంచి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించాడు.. ఈ విజయం మీది..ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సరిపెట్టుకోకుండా అక్రమ కేసులను తొలగించడానికి, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు సాయం కోసం ఈ ర్యాలీ చేపట్టాం..కుటుంబాలకు అండగా ఉంటాం.. మోదీ వైఫల్యాల పైన పోరాడుతామని వేలాది మంది అంబేద్కర్ సాక్షిగా వచ్చారు..ఈ దేశం జన్ జీ ది..దేశ భవిష్యత్తే యువతరం భవిష్యత్తు..దేశం భవిష్యత్తు బాగుంటే యువతరం భవిష్యత్తు బాగుంటుంది..ప్రజాస్వామిక వాదులంతా దిక్కులు పిక్కటిల్లేలా యువతకు మద్దతు ఇచ్చారు. జంతర్ మంతర్ నుంచి జన్ జీ పార్లమెంటుకు వెళ్లాలి..రాజీవ్ గాంధీ 61 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు నుంచి 21 యేళ్ల నుంచి 18 యేళ్లకి తగ్గించారు..18 యేళ్ల కే యువతకు ఓటు హక్కు రావడం వెనుక రాజీవ్ గాంధీ ఉన్నారు..స్థానిక సంస్థలు, శాసనసభ, లోక్ సభ లు ప్రధానమైన చట్ట సభలు..మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు 73,74 రాజ్యాంగ సవరణ తీసుకువచ్చి స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి 21 యేళ్లకు తగ్గించారు..21 యేళ్లకు ఒక సోదరిమణి త్రివేండ్రం మేయర్ అయ్యారు..సివిల్ సర్వీస్ కు అర్హత 21 ఏళ్లు మాత్రమే..21 ఏళ్లకు మన తెలుగమ్మాయి శ్రీ లక్ష్మి ఐఏఎస్ సాధించింది..మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన డి అనన్య అనే అమ్మాయి 22 ఏళ్లకు ఐఏఎస్ సాధించింది..32 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఐపిఎస్ సాధించారు..అసెంబ్లీ కి పోటీచేయడానికి మన దేశంలో 25 ఏళ్లు , రాజ్యసభకు 30 ఏళ్ల అర్హత పెట్టారు..జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాల్లో 18 ఏళ్ల కే పోటీ చేసే హక్కు కల్పించారు..సింగపూర్ లో 21 యేళ్ల కే పోటీ చేసి ప్రధాన మంత్రి కావొచ్చు..ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే వయసు 21 ఏళ్లు గా ఉండాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం..పార్లమెంటులో రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే నాయకత్వంలో ఈ బిల్లును ఆమోదించేలా కృషి చేస్తాం..జన్ జీ యువత విద్యాశాఖ , ఐటీ శాఖల మంత్రులుగా ఉంటే దేశం ముందుకు పోతుంది..కేంద్రంలో కూడా విద్యా మంత్రి గా జన్ జీ కి అవకాశం కల్పించడానికి నేను రాహుల్ గాంధీ, ఇండియా కూటమితో మాట్లాడుతా..ప్రపంచానికి జన్ జీ గళం వినిపించాలి.. ఆ దిశగా మేం పనిచేస్తాం..పార్లమెంటులో ఒక్క శాతం లోపే జన్ జీ ప్రాతినిధ్యం ఉంది..ముప్పై శాతం ఉన్న జన్ జీ లకు చట్టసభల్లో అవకాశం కల్పించాల్సి ఉంది..21 యేళ్ల వయసు లో యువతీ యువకులు చట్టసభలకు పోటీ చేసే అవకాశం ఉండాలి..ఈడీ, సీబీఐ లాంటి వాళ్లతో అక్రమ కేసులు పెట్టి రాజకీయ పార్టీలను లొంగదీసుకునే ప్రయత్నం చేశారు..మోదీని, కేంద్రాన్ని గుండె ధైర్యంతో లాఠీలు, తూటాలకు ఎదురొడ్డి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించారు.. మమ్మల్ని అభినందిస్తున్నాను.ఈ సునామీ ఇంతటితో ఆగొద్దన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




