– వెలుగుమట్ల గుట్టలపై వెంచర్ల పేరుతో భారీగా అక్రమ తవ్వకాలు
– కోట్ల విలువైన ఖనిజం ఆంధ్రాకు తరలింపు
– కలెక్టర్ ఆదేశాలతో క్షేత్ర పరిశీలన
– గుంతలను కొలిచి ఎంత ఖనిజం రలించారో గుర్తించిన అధికారులు
– నెల రోజులు గడుస్తున్నా అక్రమార్కులను తేల్చని వైనం
ఖమ్మం, ప్రజాతంత్ర, నవంబర్ 2: జిల్లాలోని భూగర్భ ఖనిజ సంపద అక్రమార్కులకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. కొన్నేళ్లుగా గుట్టలను గుల్ల చేసి ఎర్రమట్టి, మొరం అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇటీవల కొందరు అడుగు ముందుకేసి గుట్టల మట్టిని జల్లెడపడుతున్నారు. రాళ్లలో ఖనిజాలను గుర్తించి అక్రమంగా విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. ఖమ్మం నగర శివారులో బెరై టీస్ ఖనిజాన్ని కొల్లగొట్టిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. కలె క్టర్ దివాకర్ ఆదేశాల మేరకు అధికారులు క్షేత పరిశీలనలో గుంతలను కొంత తీసి ఎంత ఖనిజం తరబిందో గుర్తించారు. నెల రోజుల కిందట కేసులు నమోదు చేసిన ఇంతవరకు అక్రమార్కులెవరో తేల్చక పోవడం అధికారుల మెతక వైఖరికి అద్దం. పడుతోంది.
ఈ ఖనిజానికి భారీ డిమాండ్ 
బెరైటీస్ ఖనిజానికి సాంద్రత ఎక్కువ. దీన్ని అధిక శాతం పెట్రోలియం, సహజ వాయువు వెలికితీతలో వాడుతున్నారు. డ్రిల్లింగ్ జరిపే క్రమంలో భూగర్భంలో బ్యాలెన్స్ ఎన్నో ప్రత్యేకతలు నిమిత్తం బరువు కారకం (వేయింగ్ ఏజెంట్)గా పని చేస్తుంది. బ్లో అవుట్లను నిరోధించ డానికి సాయప డుతుంది. ఎక్స్ రే లోనూ వినియోగి స్తారు. రంగులు, ప్రైమర్లు, పేపర్, రబ్బరు, ప్లాస్టిక్ తయారీలో వాడే బెరైటీస్కు డిమాండ్ ఉంది. జిల్లాలో బెరైటీస్ గనులు కారేపల్లి, చింతకాని మండలాల్లో విరివిగా ఉండటంతో లీజుకు ఇచ్చారు. కొన్ని రోజులుగా ఖమ్మం వెలుగు మట్ల గుట్టలపై ఏర్పాటు చేసిన వెంచర్లలో అక్రమంగా తవ్వకాలు జరిపి బెరైటీస్ ముడి ఖనిజ రాళ్లను ఎత్తుకెళ్తు న్నారు. ప్రైవేటు భూ ముల్లో ఖనిజాల కోసం తవ్వకాలు జరపాలంటే గనుల శాఖకు సీనరేజ్ చెల్లించాల్సిందే. గుంటలపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో అక్రమార్కులు రాత్రి వేళ త్రవ్వకాలు జరిపి రాళ్లను పోగేసి వీలు చుసి విక్రయించి జేబులు నింపుకొంటున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్ర పరిశీలనలో గుంటలను కొలత తీసి ఎంత ఖనిజం తరలిందో గుర్తించారు. నిందితులెవరు? ఖనిజాన్ని ఎక్కడకు తరలించారు? ఆరా తీయకుండానే ఇద్దరు వెంచర్(పట్టా)దారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా నివసించని వారిని విచారించ డానికి పోలీసులు కాలయాపన చేస్తున్నారు. చింతకాని మండలం కొదుమూరు, ఏపీలోని జగ్గయ్యపేట పరిసర ప్రాంతాలకు చెందిన కొంతమంది వెలుగుమట్లలో అక్రమ తవ్వకాలు జరిపినట్లు సమాచారం. సేకరించిన రాళ్లను స్థానికంగా నిల్వ చేసి కోదాడ మీదుగా ఏపీకి తరలించి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు మంత్రులు ఉన్న ఈ జిల్లాలో ఖనిజ చోరులను పట్టుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారే నిందితులను పట్టుకోవాలని భూగర్భ గనుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. సంబంధిత పోలీసులు మాత్రం స్థానికంగా నివసించని వెంచర్ దారుల పేర్లతో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని తెలిపారు. దర్యాప్తు కొనసాగుతుందని, త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





