ఇద్దరు భారతీయ జర్నలిస్టులకు ‘పులిట్జర్’

న్యూదిల్లీ, మే 5 : భారతీయ ఇలస్ట్రేటర్ ఆనంద్ ఆర్‌కే, జర్నలిస్టు సుపర్ణ శర్మలు 2026 పులిట్జర్ అవార్డును గెలుచుకున్నారు. ఇలస్ట్రేటెడ్ రిపోర్టింగ్ అండ్ కామెంటరీ విభాగంలో వాళ్లు ఈ అవార్డు చేజిక్కించుకున్నారు. ట్రాప్డ్ అనే కథనం కోసం ఆ ఇద్దరు జర్నలిస్టులతో కలిసి నాటాలీ ఒబికో పియర్సన్ కూడా పనిచేశారు. ఈ ముగ్గురూ అవార్డును షేర్ చేసుకున్నారు. డిజిటల్ అరెస్టుకు చెందిన కథనాన్ని చాలా సునిశితంగా ప్రజెంట్ చేశారు. చాలా బలమైన విజువల్స్‌తో ఆ కథనాన్ని ప్రసారం చేశారు. దక్షిణాసియాలో సైబర్ నేరగాళ్ల ముఠా ఎలా పనిచేస్తుందన్న కోణంలో ట్రాప్డ్ కథనంలో చూపించారు. న్యూయార్క్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో పులిట్జర్ ప్రైజ్ విజేతలను ప్రకటించారు. ఆరితేరిన సైబర్ నేరగాళ్లు ఎలా ఓ భారతీయ న్యూరాలజిస్టును బోల్తా కొట్టిస్తారో ట్రాప్డ్ స్టోరీలో ప్రజెంట్ చేశారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం విధానంలో ఈ కథనం సాగుతుంది. కథనంలో ఎడిటోరియల్ గాఢత ఎక్కువగా ఉన్నట్లు పులిట్జర్ బోర్డు ప్రశంసించింది. ట్రాప్డ్ ప్రాజెక్టు కోసం ముంబై ఆర్టిస్టు ఆనంద్ ఆర్కే బొమ్మలను గీశారు. గ్రాఫిక్ స్టోరీ టెల్లింగ్‌లో అతను మాస్టర్. గతంలో ఆయన 2021లో ఈస్నర్ అవార్డు గెలుచుకున్నారు. బ్లూ ఇన్ గ్రీన్ అనే గ్రాఫిక్ నవలకు ఆ అవార్డు వచ్చింది. ఇక జర్నలిస్టు సుపర్ణశర్మ ఈ కథనానికి రిపోర్టింగ్ చేశారు. బ్లూమ్‌బర్గ్‌కు చెందిన టోక్యో రిపోర్టర్ నటాలీ ఒబికో పియర్సన్ కూడా ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ చేశారు. అంతర్జాతీయ రిపోర్టింగ్ కేటగిరీలో మరో భారతీయ జర్నలిస్టు అనిరుద్ద్ ఘోసల్ పులిట్జర్ ప్రైజ్ గెలిచారు. అమెరికా బోర్డర్ పెట్రోలింగ్ పోలీసులకు చెందిన నిఘా వ్యవస్థల టెక్నాలజీ గురించి ఇన్వెస్టిగేట్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *