12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా శత్రువులు త‌ప్ప‌లేదే

– బీజేపీపై అన్నామలై విమర్శలు
– దిల్లీలో సీజేపీ నిరసనల అణచివేత, పోలీసుల ప్రయోగంపై ఆగ్రహం
– నిరసన తెలిపే హక్కును దేశ వ్యతిరేక చర్యగా చిత్రీకరిస్తున్నారు

చెన్నై, అక్టోబర్ 22: తమిళనాడులో ఐదేళ్లపాటు బీజేపీకి నాయకత్వం వహించి ఆ పార్టీని వీడిన కే అన్నామలై కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ప‌న్నెండేళ్లుగా అధికారంలో ఉన్నా ఇప్పటికీ శత్రువులను సృష్టించుకోవాల్సి వస్తోందని విమర్శించారు.జూన్లో బీజేపీకి రాజీనా మా చేసిన అన్నామలై, ‘వీ ద లీడర్స్’ అనే కొత్త సంస్థను ప్రారంభిం చారు. దిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆయన తప్పుపట్టారు. నిరసనకారులపై పోలీస్ బలగాలను ప్రయోగించడం, ముందస్తు నిర్బంధాలు, నిరసనల అణచివేతకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను ఆయన విమర్శించారు. కాగా, నిరసన తెలిపే హక్కును, ప్రభుత్వానికి వ్యతిరేక గళాలను ‘దేశ వ్యతిరేక’ చర్యలుగా చిత్రీకరించే ధోరణిని అన్నామలై ప్రశ్నించారు. ‘కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో 12 ఏళ్లకు పైగా అధికారంలో ఉందనే విషయాన్ని మరిచిపోయి తమ ఉనికిని కాపాడుకోవడానికి నిరంతరం ఏదో ఒక శత్రువును సృష్టించుకుంటోందని నాకు అనిపిస్తోంది. ఇది చాలా బాధాకరం’ అని ఎక్స్ లో వరుస పోస్టులతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *