న్యూదిల్లీ, అక్టోబర్ 26: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్దోషిగా తేలారు. 2018లో ఓ ఎన్నికల ర్యాలీలో ఆనాటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై రాహుల్ విమర్శలు చేశారంటూ యూపీలోని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విజయ్ మిశ్రా పరువునష్టం కేసు దాఖలు చేశారు. బెంగుళూరులో జరిగిన ఓ ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. సుల్తాన్పూర్ కోర్టు ఆ కేసులో తన తీర్పును వెలువరిస్తూ రాహుల్ గాంధీ నిర్దోషి అని, ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా లేవని పేర్కొంది. తాజా తీర్పు సందర్భంగా స్పెషల్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ముందు రాహుల్ గాంధీ హాజరయ్యారు. 2018లో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు విజయ్ మిశ్రా క్రిమినల్ పరువు నష్టం కేసు బుక్ చేశారు. ఐపీసీలోని సెక్షన్ 499, 500 కింద కేసు నమోదు చేశారు. 2018 కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో 2023లో రాహుల్ గాంధీ కోర్టు ముందు హాజరయ్యారు. ఆ తర్వాత బెయిల్ పొందారు. తొలుత 13వ తేదీన తీర్పును వెలువరించాల్సి ఉంది. కానీ 26వ తేదీకి మార్చారు. రాహుల్ గాంధీ తరపున సీనియర్ అడ్వకేట్లు ఆర్ఎస్ చీమా,
కాశి శుక్లా, తరస్నుమ్ చీమా, ప్రసన్న ఎస్, ఆకాశ్ సింగ్ వాదించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





