– తెలుగు రాష్ట్రాలకు వర్ష హెచ్చరిక
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలో రాబోయే మూడు రోజుల Íటు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు దుగా కొమోరిన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ఈ పరిస్థితుల ప్రభావంతో ఒకవైపు వర్షాలు కురుస్తుండగా మరోవైపు వేడి కూడా కొనసాగుతుంది. తెలంగాణలో కూడా అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. సోమవారం పలు జిల్లాల్లో వడగళ్ల వాన కురిసి నష్టం కలిగించింది. రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల Íటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇటీవల ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది. కొన్నిచోట్ల 2 నుంచి 7 సెం.మీ వరకు వర్షం పడినట్లు అధికారులు వెల్లడించారు. అకాల వర్షాల కారణంగా పంటలకు నష్టం కలగొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిస్థితిని గమనిస్తూ రైతులకు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



