– అమెరికా పత్రిక సైన్ టెక్ ప్రత్యేక కథనం
– సమాజంలో మార్పునకు కృషి అద్భుతమని కితాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 4 : ఓ వ్యక్తి విజయం గురించి ఉన్న ఊళ్లో చెప్పుకుంటే అందరికీ తెలుస్తుంది. అంతకంటే గొప్ప విజయం సాధిస్తే మండలం దాటి జిల్లా వరకు, ఆపై రాష్ట్రస్థాయిలో చెప్పుకోదగ్గ విషయం అవుతుంది. అపుడు స్థానిక మీడియాలో వార్తలు, వార్తా కథనాలు రావడం సహజం. ఇక బహు అరుదైన ఘనత ఏదైనా సాధిస్తే జాతీయ మీడియా కూడా న్యూస్ లేదా స్టోరీ చేస్తాయి. సాధించిన విజయం మరికొంత మందికి స్ఫూర్తిదాయకం కావాలని ప్రత్యక్ష/ప్రత్యేక ఇంటర్యూలు ప్రసారం చేస్తారు. కానీ తెలంగాణకు చెందిన ఓ సాధారణ వ్యక్తి అసాధారణ కృషి గురించి అక్కడెక్కడో అమెరికా లో ఓ పత్రికలో కథనం వస్తే నిజంగా దేశానికే గర్వకారణం.
పరివర్తన సైనికుడు
వైద్యులు రోగికి చికిత్స చేస్తారు. కానీ చికిత్స కంటే నివారణ ముఖ్యం అని చాటి చెప్తూ తపస్సు చేస్తున్న ఋషి సమాజ హితం కోసం తపన పడే ఓ అరుదైన వ్యక్తి మాచన రఘునందన్‌ను పరివర్తన సైనికుడు అని అమెరికాకు చెందిన శాస్త్ర, విజ్ఞాన మాస పత్రిక సైన్‌టెక్ అభివర్ణించింది. పొగాకు నియంత్రణకు 22 ఏళ్లుగా అసాధారణ కృషి చేస్తున్న రఘునందన్ అసామాన్యుడని ఆ అంతర్జాతీయ శాస్త్ర, విజ్ఞాన పరిశోధన మాస పత్రిక సైన్‌టెక్నాల్ శ్లాఘించింది. గూగుల్‌లో ఈ విషయాన్ని విదితం చేసింది. ప్రపంచ దేశాల వైద్యుల పరిశోధనలు ప్రచురించే పల్మనరీ మెడిసిన్ పత్రిక పొగాకు నియంత్రణ కేన్సర్ నివారణ, క్యాన్సర్ చికిత్స కోసం చేస్తున్న పరిశోధనలను ప్రచురిస్తోంది. ఈ కోవలోనే ఆ పత్రిక ప్రచురించిన మాచన రఘునందన్ ద టుబాకో కంట్రోల్ మిషన్ అనే అంశం సైన్‌టెక్‌ను ప్రధానంగా ఆకర్షించింది. ఒక వ్యక్తి, పొగాకు నియంత్రణ అనే విషయాన్ని ఓ ఋషిలా మారి యజ్ఞం మాదిరి నిర్విరామ కృషి చేస్తున్నాడని ప్రస్తుతించింది. పొగాకు నియంత్రణకు ఈ విధంగా అలుపెరుగని, నిర్విరామ కృషి చేయడం అద్వితీయం, అమోఘం అని సైన్‌టెక్ కొనియాడింది. ఈ విషయం ప్రపంచమంతా తెలియాలని గూగుల్‌లోనూ పొందుపరచింది. ఇలా ఓ సామాన్యుడి అసామాన్య కృషి గూగుల్ వేదికగా జన బాహుళ్యానికి చేరడం ఓ సామాన్యుడి అసామాన్య విజయం కావడం కారణం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




