ఫైర్ సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యం

– హాస్పిటలో ఫైర్ సేఫ్టీపై మంత్రి దామోదర్ సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్‌లో ఫైర్ సేఫ్టీ ఆడిట్‌పై అధికారులతో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గురువారం సమీక్షించారు. హాస్పిటళ్లలో ఫైర్ సేఫ్టీ ప్రమాణాల అమలు, లోపాల గుర్తింపు, సరిదిద్దే చర్యలపై చర్చించారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో ఫైర్ సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఫైర్ సేఫ్టీ ఆడిటింగ్ కూడా క్రమం తప్పకుండా చేయిస్తున్నామని మంత్రికి ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వివరించారు. ఇప్పటికే నిర్వహించిన ఫైర్ ఆడిట్లలో గుర్తించిన అంశాలు, తీసుకున్న చర్యలపై మంత్రి సమీక్షించారు. ఫైర్ సేఫ్టీ లోపాలు ఉన్నచోట తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ నవీన్ మిట్టల్, ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఫైర్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ డీజీ విక్రమ్ సింగ్ మాన్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, హెల్త్, ఎనర్జీ, ఆర్ అండ్ బీ, తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *