– సమగ్ర శాస్త్రీయ అధ్యయనం తర్వాతే మైనింగ్‌పై ముందుకు
– సింగరేణి యాజమాన్యం స్పష్టీకరణ
సింగరేణి భవన్, ప్రజాతంత్ర, అక్టోబరు 5 : ప్రపంచ వారసత్వ సంపద అయిన రామప్ప గుడికి సింగరేణి మైనింగ్‌తో ముప్పు పొంచి ఉందని వస్తున్న వార్తలు అపోహలు, అవాస్తవాలు మాత్రమే అని సింగరేణి యాజమాన్యం సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. సింగరేణి ఆధ్వర్యంలో ములుగు జిల్లా వెంకటాపూర్‌లో చేపట్ట తలపెట్టిన వెంకటాపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు విషయంలో సమగ్రంగా శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాతే ముందుకు వెళ్లాలని నిర్ణయించామని యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ విషయంలో భారత పురావస్తు శాఖ, ఇతర ప్రతిష్టాత్మక సంస్థలు శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఇచ్చే నివేదికల ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. బాధ్యతాయుతమైన రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న సింగరేణి రాష్ట్రానికి చెందిన ప్రపంచ వారసత్వ సంపద అయిన రామప్ప గుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం చేకూర్చబోదని, వారసత్వ సంపద పరిరక్షణకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేసింది. పర్యావరణహితమైన చట్టబద్ధమైన మైనింగ్ కార్యకలాపాలకే అధిక ప్రాధాన్యాలు అని సింగరేణి పునరుద్ఘాటించింది.
—————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





