భౌతిక కాయం ఎయిమ్స్‌కు అప్పగించనున్న కుటుంబ సభ్యులు
న్యూదిల్లీ,సెప్టెంబర్12: రాజకీయ నేత, సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరికి అంత్యక్రియలు నిర్వహించరని పార్టీ తెలిపింది. ఆయన భౌతిక కాయం వద్ద నివాళి అర్పించిన తరవాత బాడీని ఎయిమ్స్‌కు అందచేస్తారు. ఆయనకు అంత్యక్రియలు నిర్వహించటం లేదని కుటుంబ సభ్యులు కూడా తెలిపారు. ఆయన బతికి ఉన్నప్పుడే.. తాను చనిపోతే.. తన పార్థీవదేహాన్ని వైద్య పరీక్షల కోసం.. వైద్య విద్యార్థుల రీసెర్చ్ కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించారు.
అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన పార్థీవదేహాన్ని దిల్లీలోని ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి కుటుంబ సభ్యులు దానం చేయనున్నారు .మెడికల్ కాలేజీకి ఆయన పార్థీవదేహాన్ని అప్పగించే ముందు.. దిల్లీలోని తన ఇంట్లో నివాళులు అర్పించనున్నారు. ప్రముఖులు, కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, నేతలు అనుచరులు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ఆయనకు సోషల్ డియా ద్వారా తమ సంతాపం వ్యక్తం చేశారు. దిల్లీలోని ఆయన నివాసంలో నివాళులు అర్పించిన తర్వాత.. ఆయనకు అంత్యక్రియలు నిర్వహించకుండా.. ఆ పార్థీవదేహాన్ని ది•ల్లీ ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి కుటుంబ సభ్యులు అప్పగిస్తారు.