పరిగి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12: రీజినల్ రింగ్ రోడ్ లో భూమి కోల్పోయిన రైతులకు భూమిని ఇవ్వాలని రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ అన్నారు. గురువారం మంత్రి శ్రీధర్ బాబు కి రీజినల్ రింగ్ రోడ్ లో భూమి కోల్పోయిన రైతులకు భూమిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి పేరిట రైతులు తమ భూములు కోల్పోతున్నారని, వ్యవసాయం చేసుకునే రైతులకు భూమి పోతే తమ జీవనాధారం పోతుందని,కావున డబ్బులకు బదులు వ్యవసాయం చేసుకు నేందుకు వీలుగా భూమిని అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్ర మంలో బీసీ ఐక్య వేదిక ముఖ్య సలహాదారు కృష్ణ రావు, జిల్లా రైతు అధ్యక్షులు మధు యాదవ్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్కే సాయికుమార్,రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.