మేడ్చల్, ప్రజాతంత్ర, నవంబర్ 5: రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాల శాఖ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎస్.హరిష్‌ను మంగళవారం నాడు సచివా లయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్న లిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే (ఐ జె యు)రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ నేతృత్వంలో ప్రతినిధి బృందంమర్యాద పూర్వ కంగా కలిసి శుభాకాంక్షలు తెలిపింది.
ఈ సందర్బంగా జర్నలిస్టుల ఆయా సమస్యలను వారు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా, మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి సలహాలతో సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేసా్త మని హరిష్ తెలిపారు. ప్రతినిధి బృందంలో టీయూడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి కలకూరి రాములు, కోశాధికారి మోతె వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ. రాజేష్, తెలంగాణ రాష్ట్ర చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్ బాబు, రాష్ట్ర నాయకులు మాతంగి దాస్ లు ఉన్నారు.




