రేవంత్ ‘క్రిమినల్ వేస్ట్’ వ్యాఖ్య వెనుక రాజకీయ సందేశం..!

wp:quote –>

“రాజకీయాల్లో పదాలకు అపారమైన శక్తి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒకే పదం ప్రజల్లో విస్తృత చర్చకు దారితీస్తుంది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపయోగించిన “క్రిమినల్ వేస్ట్” అనే వ్యాఖ్య కూడా అలాంటి రాజకీయ చర్చకే కేంద్రబిందువైంది. ప్రత్యర్థులు ఈ వ్యాఖ్యను వ్యక్తిగత విమర్శగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా, పాలనా దృక్పథంలో చూస్తే అది వ్యక్తులను కాదు, చట్టాన్ని ధిక్కరించే, వ్యవస్థను బలహీనపరిచే ధోరణులను ఉద్దేశించిన రాజకీయ హెచ్చరికగా అర్థం చేసుకోవచ్చు..”

ప్రొఫెసర్,సంగని మల్లేశ్వర్, విభాగాధిపతి, జర్నలిజం శాఖ కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్, సెల్-9866255355

ఏటా లక్ష మందికి పైగా ఇంజనీరింగ్ చదివితే విద్యా ప్రమాణాలు ఆశించిన రీతిలో లేక, విద్యార్థులకు ఉద్యోగాలు రాక తల్లి, తండ్రుల ఆశలు నెరవేరే పరిస్థితి కోల్పోయి బతుకుదెరువు కోసం చిన్న,చితక ఉద్యోగాలు చేస్తున్నారని ఆవేదనతో ఇంజనీరింగ్ విద్య ‘క్రిమినల్ వేస్ట్’ లా తయారైందంటూ విద్యా నాణ్యతపై వ్యాఖ్యానిస్తే .. విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ కళాశాలల నుంచి దాదాపు 1.1 లక్షల మంది పట్టభద్రులు బయటకు వస్తున్నారు. లక్షల రూపాయలు అప్పులు చేసి, భరించి చదివించిన పేరెంట్స్ సంతోషంగా ఉండేవిధంగా తమ ప్రతిభను చాటడంలేదని రేవంత్ ‘క్రిమినల్ వెస్ట్’ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ,బీజేపీ ఒంటికాలుమీద లేస్తున్నాయి. విద్యా ప్రమాణాలు లేకపోతే ఎటువంటి నష్టం వాటిల్లుతుందో చెప్పకనే చెప్పారు. విద్యార్థులకు ఏదో డిగ్రీ వచ్చిందా? విదేశాలకు పోయినామా? పెళ్లి చేసుకున్నామా? అనేది తప్ప, బాధ్యతాయుతంగా  15శాతం మంది విద్యార్థులు పాపులర్ ఐటి కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదిస్తున్నారని, 35శాతం మంది ఇంజనీరింగ్ కు సంబంధం లేని ఉద్యోగాలు చేయడానికి, ప్రాథమిక నైపుణ్యాలు లేని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను మనం చూస్తున్నామని సీఎం రేవంత్ “ఆ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల తల్లిదండ్రులు ఘోష ను దృష్టిలో పెట్టుకొని ఆయన అన్నారు. ఆంగ్లమే ఏకైక ప్రమాణం అయితే చైనా, జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో కేవలం 10 శాతం మందికి మాత్రమే ఆంగ్లం తెలుసు, ఆంగ్ల భాష తప్పనిసరి అయితేే చైనా ప్రపంచాన్ని శాసించి ఉండేది కాదు.

రాజకీయాల్లో పదాలకు అపారమైన శక్తి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒకే పదం ప్రజల్లో విస్తృత చర్చకు దారితీస్తుంది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపయోగించిన “క్రిమినల్ వేస్ట్” అనే వ్యాఖ్య కూడా అలాంటి రాజకీయ చర్చకే కేంద్రబిందువైంది. ప్రత్యర్థులు ఈ వ్యాఖ్యను వ్యక్తిగత విమర్శగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా, పాలనా దృక్పథంలో చూస్తే అది వ్యక్తులను కాదు, చట్టాన్ని ధిక్కరించే, వ్యవస్థను బలహీనపరిచే ధోరణులను ఉద్దేశించిన రాజకీయ హెచ్చరికగా అర్థం చేసుకోవచ్చు.ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి చట్టాన్ని అమలు చేయడం ప్రధాన బాధ్యత. ప్రభుత్వ భూముల ఆక్రమణ, చెరువులు–కుంటల ఆక్రమణ, అక్రమ నిర్మాణాలు, భూ కబ్జాలు, అధికార వ్యవస్థపై ప్రభావం చూపే ముఠాలు వంటి అంశాలు రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన అవరోధాలు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంబిస్తే, దానికి రాజకీయ రంగు పులమడం కంటే, ఆ చర్యల లక్ష్యాన్ని విశ్లేషించడం అవసరం.రేవంత్ వ్యాఖ్యలోని ప్రధాన సందేశం కూడా ఇదే. నేరాలను రాజకీయ రక్షణతో కొనసాగించాలని చూసే సంస్కృతికి ప్రజాస్వామ్యంలో స్థానం లేదని ఆయన స్పష్టం చేయాలనుకున్నారు. చట్టాన్ని అతిక్రమించి సమాజ ప్రయోజనాలను దెబ్బతీసే వ్యవస్థలు చివరికి సమాజానికి “వేస్ట్” గానే మిగులుతాయనే భావనను ఆయన రాజకీయ భాషలో వ్యక్తీకరించినట్లు చూడవచ్చు. మొత్తంగా చూస్తే, “క్రిమినల్ వేస్ట్” అనే వ్యాఖ్య చుట్టూ జరిగిన రాజకీయ దుమారం కంటే, దాని వెనుక ఉన్న పాలనా సందేశమే ముఖ్యమైనది.
తెలంగాణలో గత కొన్నేళ్లుగా భూకబ్జాలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు, చెరువుల పరిరక్షణ వంటి అంశాలు ప్రజల్లో తీవ్ర ఆందోళనకు కారణమయ్యాయి. ఈ సమస్యలను పరిష్కరించాలంటే కేవలం పరిపాలనా ఉత్తర్వులు సరిపోవు. చట్టం ముందు అందరూ సమానులనే సందేశం స్పష్టంగా వెళ్లాలి. అధికారంలో ఉన్నవారైనా, ప్రతిపక్ష నాయకులైనా, ప్రభావశీలులైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో రాజకీయ నాయకులు ఉపయోగించే భాష కొన్నిసార్లు కఠినంగా అనిపించినా, దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.అయితే ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలకు కూడా హద్దులు ఉంటాయి. విమర్శలు వ్యక్తిగత దూషణలుగా మారకుండా, ప్రజా ప్రయోజనాల చుట్టూనే సాగాలి. అదే సమయంలో ప్రతిపక్షం కూడా కేవలం పదాలపై వివాదం సృష్టించడం కంటే, ఆ వ్యాఖ్యకు దారితీసిన పరిస్థితులపై చర్చిస్తే ప్రజలకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అసలు ప్రశ్న ఏమిటంటే రాష్ట్రంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టాలా లేదా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, ఒక పదాన్ని మాత్రమే రాజకీయ వివాదంగా మార్చడం ప్రజాస్వామ్య చర్చను అసలు అంశం నుంచి దూరం చేసే ప్రమాదం ఉంది. బీఆర్ఎస్, బీజేపీల బాదంతా కూడా జెన్ జికి దగ్గరైనా కాంగ్రెస్ ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై దుమ్మెత్తి పోసి యువత మనసులో గట్టి ముద్ర వేసుకోవాలనే తాపత్రయం ఎక్కువగా కన్పిస్తుంది.
రాజకీయ నాయకుల మాటలు ఎప్పుడూ ప్రజల పరిశీలనలో ఉంటాయి. అందువల్ల అధికారంలో ఉన్నవారు భాష విషయంలో సంయమనం పాటించడం ఎంత అవసరమో, అదే స్థాయిలో వారి వ్యాఖ్యల సందర్భాన్ని కూడా సమగ్రంగా అర్థం చేసుకోవడం అంతే ముఖ్యం. ఒక్కోసారి బలమైన పదజాలం ద్వారా ప్రభుత్వం తన విధానాలపై స్పష్టమైన సంకేతాన్ని ఇవ్వాలనుకుంటుంది. నేరాలకు రాజకీయ అండ ఉండదని, చట్టానికి మించినవారు ఎవరూ లేరని ప్రజలకు భరోసా కల్పించడమే అలాంటి వ్యాఖ్యల లక్ష్యంగా ఉండవచ్చు.తెలంగాణ ప్రస్తుతం అభివృద్ధి, పెట్టుబడులు, పారిశ్రామికీకరణ, పట్టణీకరణ వంటి కీలక దశలో ఉంది. ఇలాంటి సమయంలో చట్టబద్ధమైన పాలన, పారదర్శక పరిపాలన, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అత్యంత కీలక అంశాలు. నేరాలకు, అక్రమాలకు, భూకబ్జాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే దాన్ని రాజకీయ కోణంలో మాత్రమే కాకుండా, పరిపాలనా కోణంలో కూడా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. చట్టాన్ని గౌరవించే సమాజమే పెట్టుబడులను ఆకర్షించగలదు, అభివృద్ధిని నిలబెట్టగలదు. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే. కానీ చివరికి గెలవాల్సింది వ్యక్తులు కాదు చట్టం. నిలవాల్సింది రాజకీయ నినాదాలు కాదు న్యాయపాలన. అదే ప్రజాస్వామ్య బలం, అదే తెలంగాణ భవిష్యత్తుకు బలమైన పునాది.రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా సీఎం రేవంత్ వ్యాఖ్యలు ప్రతిభ చాటేందుకు ఇంజనీరింగ్ విద్యార్థులకు, ప్రమాణాలు పెంచేందుకు అధ్యాపకులకు ఒక మేలుకొలుపుగా భావించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *