అమ్మ ‘సంకల్ప’మిది!

  • అందరికీ సామాజిక న్యాయం.. ఆమె ఆశయం
  • అందరికీ రాజ్యాంగ హక్కులు.. ఆమె లక్ష్యం
  • ప్రతి వర్గానికీ సముచిత ప్రాతినిధ్యం.. ఆమె నినాదం

ఆమే.. తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత..!

– వంగ మహేందర్ రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్

తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. వేలాది మంది బలిదానాలు, సబ్బండ వర్గాల పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం, స్వపరిపాలనలోనూ ప్రజల బతుకులు ఏమి మారలేదు. 12 ఏళ్లకు ముందున్న సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలను మోసం చేశాయి నట్టేట ముంచాయి మన బతుకులు మారారని నిర్వేదంలో నిరాశని స్కూల్లో బతుకులు వెళ్లారు ఈ సమయంలో నేనున్నానంటూ కల్వకుంట్ల కవిత ముందుకు వచ్చారు. ప్రజల కోసం పేగు బంధాన్ని సైతం తెంచుకున్నారు ఇన్నాళ్లు నడిచిన రాజకీయ బాట, నేర్పిన పాఠాలు ప్రజలకు మేలు చేయని వైనాన్ని గుర్తించి సందర్భం వచ్చిన ప్రతిసారి ప్రజలను క్షమించమని కోరుతున్నారు. తెలంగాణ రక్షణ సేన పార్టీని పెట్టి ప్రజలకు తెలంగాణ అమ్మగా ఆపన్న హస్తం అందిస్తున్నారు. అధికార, ప్రతిపక్షాల కుట్రలను చేదిస్తూ… సమాజానికి రక్షణగా నిలబడుతున్నారు. రాజ్యం దాస్టీకాన్ని సివంగిలా ఎదిరిస్తున్నారు. ఈ క్రమంలో… ఆగస్టు 6న హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సామాజిక న్యాయ సంకల్ప సభను నిర్వహిస్తున్నారు. ఈ సభ తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయబోతున్నది అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

కల్వకుంట్ల కవిత తలపెట్టిన సామాజిక న్యాయం సాధన అంశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల డిమాండ్‌తో మొదలైన ఉద్యమ స్వరం.. ఇప్పుడు అన్ని వర్గాల రాజ్యాంగ హక్కులు, సమాన అవకాశాలు, సముచిత ప్రాతినిధ్యం వంటి అంశాల వైపు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. ‘సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ’ పేరుతో *ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం* లో నిర్వహించనున్న సభ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్న కవిత.. సామాజిక న్యాయం చుట్టూ రాజకీయ చర్చను మళ్లీ ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారా? ఈ సభ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతున్నారు?

– మొదట్నుంచీ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌ను బలంగా వినిపిస్తున్నారు.
– రాజ్యాంగం కల్పించిన అవకాశాలు అన్ని వర్గాలకు సమానంగా అందాలనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.
– బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళలు, ఇతర వెనుకబడిన వర్గాలకు కూడా రాజకీయ, సామాజిక, ఆర్థిక అవకాశాలు సమానంగా ఉండాలనే అభిప్రాయాన్ని కవిత తన ప్రసంగాలు, సమావేశాల్లో వ్యక్తం చేస్తున్నారు.
– సామాజిక న్యాయం అనేది కేవలం ఒక వర్గానికే పరిమితమైన అంశం కాదని, అన్ని వర్గాల సమాన భాగస్వామ్యమే ప్రజాస్వామ్యానికి బలం అనే వాదనను ఆమె ముందుకు తీసుకొస్తున్నారు.
– ఈ క్రమంలోనే హైదరాబాద్ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న ‘సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ’పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
– ఈ సభలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు, సామాజిక న్యాయం, రాజ్యాంగ హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై కవిత మాట్లాడబోతున్నారు.
– సామాజిక న్యాయం అంశంపై గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వాల విధానాలపై కవిత విమర్శలు చేస్తున్నారు.
– ఎన్నికల హామీల అమలు, రిజర్వేషన్ల అంశం, వెనుకబడిన వర్గాల ప్రాతినిధ్యం వంటి విషయాల్లో ప్రభుత్వాల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
– తెలంగాణలో సామాజిక సమీకరణలు, రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్న సమయంలో… బీసీ రిజర్వేషన్లు, రాజ్యాంగ హక్కులు, సమాన అవకాశాలపై జరుగుతున్న చర్చలు రానున్న రోజుల్లో రాజకీయ ఎజెండాను ప్రభావితం చేసే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ’లో వెలువడే సందేశాలు, ప్రతిపాదనలు, రాజకీయ స్పందనలు ఆసక్తికరంగా మారనున్నాయి.
– సామాజిక న్యాయం అంశాన్ని సభలు.. సమావేశాలు.. పర్యటనలు.. ప్రజలతో ముఖాముఖి లాంటి రాజకీయ చర్చల్లో నిలబెట్టే ప్రయత్నమే కవిత సభ అనుకోవచ్చు.
– ఇంత వరకు చాలా పార్టీలు, ప్రభుత్వాలు.. బడుగు బలహీన వర్గాలకు మేలు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ఆయా వర్గాల అభ్యున్నతి ఆశించిన స్థాయిలో జరగలేదన్నది వాస్తవం. రకరకాల ఒత్తిళ్ళు, సవాళ్ళతో బడుగు, బలహీన వర్గాలకు సరైన ప్రాతినిధ్యం, రాజ్యాధికారం దక్కలేదు. దీన్ని అధిగమించేందుకు స్పష్టమైన కార్యాచరణతో కవిత భావ సారూప్య వ్యక్తులు, శక్తులతో కలిసి ముందుకు నడుస్తున్నారు. అందులో భాగమే ఈ ఆగస్టు 6వ తేదీన జరగనున్న సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ.
ఈ సభలో పది వేల మంది సంకల్ప ప్రతిజ్ఞ చేయిస్తారు. గల్లీ నుండీ దిల్లీ వరకు సామాజిక న్యాయం కోసం సభలు, సమావేశాలు నిర్వహిస్తారు. సబ్బండ వర్గాలు ఇందులో పాల్గొనాలన్నది కవిత ఆలోచనగా తెలుస్తున్నది. సంక్రాతి తరవాత దిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని తెలంగాణా రక్షణ సేన నాయకులు చెప్తున్నారు.
– సామాజిక న్యాయం, రిజర్వేషన్లు, రాజ్యాంగ హక్కులు.. ఇవి తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కేంద్రబిందువుగా మారుతున్నాయి. తెలంగాణలో మొదలయిన సామాజిక న్యాయ తెలంగాణ ఉద్యమం గా మారి దేశమంతటికి విస్తరించి దేశ రాజకీయాలను శాసించనుంది. అందుకే దేశ ప్రజల భవిష్యత్ ను పునర్ లిఖించే సామాజిక న్యాయ సంకల్ప సభ విజయవంతం కావాలని మనమూ కోరుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *