“అభిషేక్ దీప్కే,సోను వాంగ్ చుక్ పాత్ర కేవలం కేటలిస్టు పాత్ర మాత్రమే…పేపర్ లీకేజీ అనే ఓ గూడుకట్టిన అవినీతి పై సమరం ద్వారా మొదలైన నిరసనలో కేంద్ర ప్రభుత్వం పై విద్యార్థులు,యువత,ప్రజల్లో దశాబ్దకాలం పైగా గూడుకట్టుకున్న అసంతృప్తి బద్దలైంది.అబద్ధాలు,పుకార్లు పునాదులపై నిర్మించుకున్న మీడియా దుష్ప్రచారం,ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు,అంతులేని ఆశలు రేకెత్తించే నిరాశపర్చిన నినాదాలు అన్నీ ఏకమై వీధిలో కొచ్చాయి…”
పెద్దలకు మార్గనిర్దేశం చేసిన పిల్లల ఉద్యమం !

సెల్:9441864514
రాజకీయాల్లో ఇలాంటి సందర్భాలు సహజమే!అదే సమయం లో నీట్ పరీక్ష పేపర్ లీక్ జరిగి లక్షలాది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకం కావడంతో ఏ అవినీతి వ్యతిరేక ఉద్యమం పేరు చెప్పి అధికారంలోకి వచ్చి సర్వ వ్యవస్థలను భ్రష్ఠు పుట్టించిన పాలనా వ్యవస్థలపై తన అసంతృప్తి బావుటా ఎగురవేసింది యువత.అవసరానికి రక్షిస్తుంది అను కున్న గోదీ మీడియా చేతులెత్తేసింది.కోట్లాది రూపా యలు ఖర్చుచేసి అబద్దాల పునాదులపై పేకమేడలా నిర్మించుకున్న సోషల్ మీడియా ఆటలు సాగలేదు.కుప్పకూలి పోయింది.పాకిస్తాన్,చైనా, బంగ్లాదేశ్ ఏజెంట్లు పేరుతో ఎప్పటి మాదిరిగా చేసిన దుష్ప్రచారం మెడలు విరిచింది యువత.జాతీయ పతాకాలు, జాతీయ గీతాలు, జాతీయ నినాదాలే ఆయుధంగా సాగిన యువతరం తిరుగుబాటు ముందు ‘గాడ్సే’ ఇజానికి గాంధీ యిజం సమాధానం చెప్పింది,అరాచక సిద్దాంతాలకు ఇక్కడ తావు లేదు.జాతిపిత గాంధీ బ్రతికే ఉంటాడు,అవసరం అయినప్పుడు మోలకెత్తుతుంటాడని మరో మారు నిరూపించాయి తాజా పరిణామాలు.
రాజకీయాలు ప్రస్థావన లేనప్పటికీ ఇక్కడ జరిగిన రాజకీయ పరిణామం చాలా చరిత్ర పుటల్లో లిఖించదగింది.కేంద్రంలో పుష్కర కాలంగా అధికారంలో ఉన్న బిజెపి తన గెలుపు వ్యూహాలు రచించడంలో మునుపెన్నడూ లేని కొత్త సాంప్రదాయాలకు తెరలేపింది.ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి మాట్లాడుతూనే పాలనా పగ్గాలు నిరంకుశత్వం వైపు లాగ బడ్డాయి.ఎన్నో ఏళ్ళ పారదర్శక ఆచరణతో ఎంతో విశ్వాసనీయత ఉండాల్సిన స్వతంత్ర రాజ్యాంగ సంస్థలను తొలిసారి గా విచ్చల విడి దుర్వినియోగం ద్వారా పాలకులు తమ చేతిలో పనిముట్టు గా మార్చుకున్నారనే ఆరోపణలు వినిపించాయి.వ్యక్తిగత నమ్మకాలు,ఆచారాలు వరకే మతం,కానీ,తామే అధికులం అనే ఏ మతదృక్ఫధం అయినా అంతిమంగా వినాశహేతువే! మానవత్వం పరిధి దాటిన ఏ మతచర్యలైన ఉగ్రవాదమే..!
భిన్న సంస్కృతి కి వేదికైన మన దేశంలో కుల,మత కుంపట్లు రాజేసి రాజకీయ పతాకాలు మనుగడ సాగిస్తున్నాయి.బిజెపి కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత ఒక మతవర్గ సామాజిక సంస్థ తీవ్రవాద ఆలోచనలు రాజ్యంగ సంస్కరణలుగా, అధికారిక విదానాల్లో చొప్పించే పని చాలా గుంభనంగా జరిగింది.బహు జాతుల భారతీయ జీవన సమ్మేళనం ను పరిహాసం చేస్తూ ఇది కొనసాగింది.ఈ దశలో మనుగడ కోసం పోరాటం మనుష్యులే కాదు! ప్రాణం ఉన్నప్రతి జీవి చేసే పని అదే! ఇక్కడ ఒక విషయం గుర్తించాలి.భారతీయ సమాజంలో పేరు కుంటున్న అసంతృప్తి సెగలు ఈనాటిది కాదు.చాలాకాలంగా గూడుకట్టుకున్నవే.కేంద్రంలో అధికారం లో ఉన్న బిజెపి తన ప్రధాన ఎజెండాగా ఉన్న ఆర్ ఎస్ ఎస్ సైద్ధాంతిక తాత్వికతను పరిపాలనా విధానం,మార్పుల్లో సందర్భం, అవకాశాన్నిబట్టి జోడిస్తూ వస్తుంది.ఈ ప్రక్రియ ఈ పన్నెండేళ్ళదికాదు.. భారతీయ జనసంఘ్ బిజెపి పార్టీగా ఆవిర్భావం కు దారితీసిన నాటినుండి ఉన్న హిడెన్ ఎజెండా నే..! ఆ కల 2014లో నరేంద్ర మోదీ అధికారం చేపట్టడం తో సాకారం అయ్యింది.అప్పటినుండి వారు దాచుకున్నదేమీలేదు.ముస్లీంమైనా రిటీ పర్సనల్ లా నుంచి,ఎన్ఆర్సీ, జమ్మూకాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు, బ్రిటీష్ చట్టాల పేరుతో రాజ్యాంగ చట్టాలను మార్చిన్యాయసహిత గా తేవడం ,రైతు బిల్లు, కార్మిక చట్టాల మార్పు ఇవన్నీ ఒక క్రమపద్ధతిలో దొరికిన అవకాశాన్ని బట్టి తనదైన మార్పులకు శ్రీకారం చుట్టింది.
కాంగ్రెస్ ప్రభుత్వం పై అన్నాహజారే జరిపిన అవినీతి ఉద్యమం ద్వారా యువతను,దేశ ప్రజలను ఆకర్షించే పెద్ద పెద్ద వాగ్దానాలు తో అధికారంలోకి వచ్చిన బీజేపీ అందుకు భిన్నంగా అధికారం మోత్తాన్ని తమ అధికార స్థిరీకరణకు వాడుకుంటూ వచ్చింది.ప్రత్యార్థి పార్టీలను,నేతలను రాజ్యాంగ సంస్థల దాడులు ద్వారా నయానో,భయానో చేర్చుకోవడం, అవినీతి పరులను అక్కున చేర్చుకొని నీతిపరులు గా మార్చడం.ఆశ్రిత పెట్టుబడి దారులను తమ ఆర్థిక వనరులు గా స్థిరీకరించు కోవడం, వారిద్వారా నే మీడియాను గోదీ మీడియాగా మార్చి, ఆత్మస్తుతి, పరనింద ప్రచారం హోరెత్తించారు.నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక నోట్ల రద్దు వ్యవహారం , నల్లదనం వెలికితీయడం లాంటి మాటలన్నీ డొల్ల మాటలుగా తేలిపోయారు.”బేటీబచావో,బేఠీపడావో ,””ఆత్మనిర్భర భారత్ “లాంటి నినాదాలు ఒట్టి డొల్ల అని తేలిపోయాయి.
దేశంలో ప్రశ్నించే శక్తుల అణిచివేత కూడా ఒక క్రమపద్ధతిలో జరిగింది.బీమా కోరెగావ్ కేసులో,అర్భన్ నక్సల్స్ పేరుతో అనేక మందిని జైళ్ళ పాలు చేసి ప్రశ్నకు జవాబు తప్పించుకున్నారు.చివరకు భారతీయ ఫెడరల్ రాజకీయ వ్యవస్థను ఖతం చేయడానికి సైతం అనేక రకాల ఎత్తుగడలను అధికారం అడ్డం పెట్టుకొని తమ అధికార స్థిరీకరణ దిశగా ఆలోచనలు చేశారు.అందుకు నిధులు విడుదల, గవర్నర్ వ్యవస్థ, సీబీఐ,ఐటీ,ఇడి,చివరకు ఎలక్షన్ కమిషన్, న్యాయ వ్యవస్థను సైతం నియంత్రణ చేసే దశకు చేరుకున్నాయ నే ఆరోపణలు కేంద్ర ప్రభుత్వం పై వచ్చాయి.
పాకిస్తాన్ తో యుద్దం,దండకారణ్యంలో నక్సల్స్ పై ఆపరేషన్ కగార్ విజయం, బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం చూసిన తర్వాత బీజేపీ నిరంకుశత్వం దిశగా అధికార స్థిరీకరణ కు ప్రయత్నం చేస్తుందా?అనే వాతావరణం కనిపించింది.దాన్ని ధృవీకరణ చేస్తూ ప్రత్యర్థి పార్టీలు నుండి యంపి ల మూకుమ్మడి ఫిరాయింపుల వెల్లువ కనిపించింది.ఇన్నెండ్ల బిజెపి పాలనలో అధికారం స్థిరత్వం తప్ప ఒక్క అంశంలో సానుకూలత లేదు.ఆర్థిక స్థిరత్వం అంతకన్నా లేదు..! ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం పెరుగుదల,పన్నులు భారం సామాన్యుడి జీవన ప్రమాణాలు దిగజారుతూ వచ్చాయి.యువతకు ప్రతిఏటా ఇస్తామన్న కోటి ఉద్యోగాలు మాట ప్రక్కన బెడితే,చేసిన వాగ్దానాలు ఒక్కటీ నెరవేర్చక పోవడం,ప్రభుత్వరంగ సంస్థలు అమ్మకం మూలంగా ప్రతిఏటా ఉన్న ఉద్యోగాలు ఊడే పరిస్థితి యువతకు ఎదురైంది.యువత ఉపాధి దొరకని కాక్రోచ్ లయ్యారు..!.ప్రజలకు అవసరం అయిన విద్యా,వైద్య రంగాల్లో అవినీతి పేరుకుపోవడం,కట్టిన ప్రాజెక్టులు, వంతెనలు కూలుతుండడం, ఎలక్టోరల్ బాండ్లు ద్వారా ఆశ్రిత పెట్టుబడిదారులు నుండి చట్టబద్దమైన అవినీతి సొమ్ము లు పొంది యదేచ్చగా ఎన్నికల్లో వినియోగించడం, దిగువ స్థాయి నుండి పైస్థాయి వరకు అవినీతి పేరుకు పోవడంతో యువత, విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకం అయ్యింది.ఈ దశలో బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి పడిన పాట్లు ప్రజలు ప్రత్యక్షంగా గమనించారు.బెంగాల్ ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలను వ్యతిరేకించే వారిలో సైతం కొంత నైరాస్యం చోటుచేసుకుంది.ఈ దశలో జెన్ జెడ్ యువత తిరుగుబాటు దేశ రాజకీయాల్లో ఓ చారిత్రక ఘట్టమే.ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు,జంతర్ మంతర్ ఆందోళన ఇవన్నీ యాధృచ్చికమే!
అభిషేక్ దీప్కే,సోను వాంగ్ చుక్ పాత్ర కేవలం కేటలిస్టు పాత్ర మాత్రమే…పేపర్ లీకేజీ అనే ఓ గూడుకట్టిన అవినీతి పై సమరం ద్వారా మొదలైన నిరసనలో కేంద్ర ప్రభుత్వం పై విద్యార్థులు,యువత,ప్రజల్లో దశాబ్దకాలం పైగా గూడుకట్టుకున్న అసంతృప్తి బద్దలైంది.అబద్ధాలు,పుకార్లు పునాదులపై నిర్మించుకున్న మీడియా దుష్ప్రచారం,ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు,అంతులేని ఆశలు రేకెత్తించే నిరాశపర్చిన నినాదాలు అన్నీ ఏకమై వీధిలో కొచ్చాయి.40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసి అనేక ఏండ్లుగా పేరుకున్న అవినీతి కి జవాబు కావాలని విద్యార్థులు పట్టుబట్టారు.కేవలం వారు కోరుకున్నది కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని మాత్రమే! జంతర్ మంతర్ తొలి కదలిక ను కూడా అంచనా వేసుకోలేని కేంద్ర ప్రభుత్వం తనకు ఎదురులేదనే అహంభావం తో 40 రోజుల విద్యార్థుల శాంతియుత ఆందోళన, ప్రఖ్యాత శాస్త్రవేత్త సోనమ్ వాంగ్ చుక్ 25 రోజుల నిరవధిక నిరహార దీక్ష ను సైతం పట్టించుకోలేదు.దేశ ప్రజల్లో మానవీయ కదలిక మొదలైనప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదు.పైగా విద్యార్థులు,యువత ఆందోళన పై ఆంక్షలు, లాఠీచార్జి, కాల్పులు వరకు తెగబడి నప్పటికీ పార్లమెంటు ముట్టడికి లక్షమందికి పైగా విద్యార్థులు తరలిరావడంతో కేంద్రం పెద్దల్లో భయం జాడలు మొదలయ్యాయి.మన సరిహద్దు దేశాలైన నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ పరిణామాలు ఇక్కడ జరుగుతాయా అన్న అనుమానం కేంద్ర పెద్దల్లో పొడసూపాయి.
జంతర్ మంతర్ ఆందోళన కు మద్దతుగా దేశవ్యాప్తంగా యువత వీధుల్లోకి రావడంతో ఎటైటకేలకు తెగేదాకా లాగకుండా -విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా తో ఉద్యమాన్ని చల్ల బరిచింది.ఇది ఒకరకంగా నిరంకుశంగా వ్యవహరించే కేంద్రం ఒక తాత్కాలిక ఆలోచనతో వేసిన వెనకడుగు మాత్రమే..! ఇప్పటికే కేంద్రం చేసిన వాగ్దానం విద్యార్థులపై కేసులు ఎత్తివేయడంలో సాచివేత ధోరణితోనే ఉంది.ఏది ఏమైనా జంతర్ మంతర్ ఆందోళన ఎవరో ఒకరు చూ!చూ!!జంతర్ మంతర్ అంటే వచ్చింది కానేకాదు.ఇది పన్నెండేళ్ళు గా కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాల పై విద్యార్థుల అసంత్రృప్తి సెగ! పిల్ల పట్టు మంకుపట్టు మాత్రమే కాదు..! భవిష్యత్తు కోసం రాజీలేని పోరాటం కూడా చేయగలరన్న నిరూపిత సత్యం.అవసరమైతే జెల్ల చేపలా పట్టిన పట్టు వదలకుండా నిరంకుశత్వాన్ని కాలర్ పట్టి నడి బజార్లో నిలదీయ గల శక్తి వారిది.అందుకే మన పెద్దల మాటల్లో చెప్పాలంటే” పిల్లపట్టు!జెల్ల పట్టు!!ఒక్కటే అంటారు గదా!”





