“పోలీసు అధికారానికి చట్టం ఇచ్చిన బలం ఉంది; కానీ అదే చట్టం దానికి పరిమితులు కూడా విధించింది. అరెస్టు అంటే శిక్ష కాదు. విచారణ అంటే హింస కాదు. అనుమానం అంటే నేర నిర్ధారణ కాదు. FIR అంటే దోషిగా తీర్పు కాదు. కస్టడీ అంటే పోలీసుకు వ్యక్తిపై సంపూర్ణ అధికారం కాదు. పోలీసు ప్రజలను భయపెట్టే సంస్థ నుంచి ప్రజల హక్కులను రక్షించే సంస్థగా పరిణమించాలి..”
68. యం. యస్. ఆచార్య సంపాదకీయం, మాడభూషి శ్రీధర్
1981 సంపాదకీయంలో ఆచార్య మరొక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు. 45 సంవత్సరాల తరువాత, 2026లో ఈ ప్రశ్నలకు సమాధానం వెతికితే ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది.సంస్థలు పెరిగాయి, చట్టాలు పెరిగాయి, సాంకేతికత పెరిగింది, న్యాయపరమైన పర్యవేక్షణ పెరిగింది; కానీ అధికారాన్ని ప్రశ్నించే ప్రజాస్వామ్య నైతికతకు సంబంధించిన ప్రాథమిక సమస్య మాత్రం పూర్తిగా పరిష్కారం కాలేదు. కొన్ని రంగాల్లో వ్యవస్థ బలపడింది; మరికొన్ని రంగాల్లో సమస్య రూపం మార్చుకుంది.
“మంచి–చెడు”కు శాశ్వత ప్రమాణం ఏమిటి?
ఆచార్య సంపాదకీయానికి తాత్వికమైన ప్రారంభం ఉంది. “ఏది మంచి? ఏది నీతి? ఏది న్యాయం? ఏది సత్యం?” అనే ప్రశ్నలకు తుది సమాధానం దొరకదని ఆయన అంటారు. ఒక కోర్టులో నేరంగా తేలినది పైకోర్టులో కొట్టివేయబడవచ్చు; ఒక కాలంలో తిరుగుబాటుగా కనిపించినది మరో కాలంలో స్వాతంత్ర్య పోరాటంగా గుర్తించబడవచ్చు. కాబట్టి అధికారంలో ఉన్నవారి నిర్వచనమే న్యాయం కాదని ఆయన హెచ్చరిస్తున్నారు. అయితే 1981తో పోలిస్తే 2026లో భారత రాజ్యాంగం ఒక ముఖ్యమైన సమాధానాన్ని మరింత స్పష్టంగా ఇచ్చింది: వ్యక్తి లేదా ప్రభుత్వ నైతిక అభిప్రాయం కాదు, రాజ్యాంగం, చట్టం, న్యా
రాజకీయ సిద్ధాంతం నేరానికి కవచమా?
ఒక వ్యక్తి హత్య చేస్తే అది హత్య. ఒక కులం లేదా మతం పేరుతో సమూహం హింస చేస్తే దానికి మరో పేరు వస్తుంది. రాజకీయ సిద్ధాంతం పేరుతో హింస జరిగితే దానిని “పోరాటం”, “ఉద్యమం”, “విప్లవం” అని పిలిచే ప్రమాదాన్ని ఆయన ఎత్తిచూపారు. ఇది 2026లో కూడా వర్తించే ప్రజాస్వామ్య సూత్రం:సిద్ధాంతం నేరానికి చట్టపరమైన మినహాయింపు ఇవ్వదు. అదే సమయంలో, ప్రభుత్వం కూడా “రాజ్య భద్రత” లేదా “చట్టవ్యవస్థ” అనే పదాలను ఉపయోగించి ప్రతి నిరసనను నేరంగా పరిగణించకూడదు. రాజ్యాంగబద్ధమైన నిరసన, రాజకీయ భిన్నాభిప్రాయం, పత్రికా స్వేచ్ఛ, సంఘ స్వేచ్ఛ, ఇవన్నీ ప్రజాస్వామ్యంలో చట్టబద్ధమైన స్థలాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి రెండు వైపులా ఒకే ప్రమాణం ఉండాలి: హింసకు సిద్ధాంతం రక్షణ కాదు; శాంతియుత భిన్నాభిప్రాయానికి ప్రభుత్వం భయపడటానికి కూడా సిద్ధాంతం కారణం కాదు.
1981లో “సిమెంట్ కుంభకోణం”; ఇప్పుడు రాజకీయ ఆర్థిక పారదర్శకత
ఆచార్య తన కాలంలోని సిమెంట్ కుంభకోణం, కాంట్రాక్టర్లు, ఇం
అయితే రాజకీయ నిధుల పారదర్శకత సమస్య పూర్తిగా ముగిసిపోయిందని కూడా చెప్పలేం. ఎన్నికల సంఘం ప్రస్తుతం రాజకీయ పార్టీల నిధుల వివరాలు, విపరీతమైన ఖర్చులు, ఆడిట్ చేసి ఇస్తున్నారా? contribution reports, expenditure statements, audited accounts వంటి సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నాయా? లేకపోతే ఏంచేస్తారు? అంటే 1981లో కుంభకోణం గురించి పత్రిక ప్రశ్న వేసేది; 2026లో అదే ప్రశ్నకు ఎన్నికల సంఘం డేటా, కోర్టు తీర్పులు, ఆడిట్ రికార్డులు, డిజిటల్ సమాచార వ్యవస్థలు కూడా ఆధారాలుగా ఉన్నాయి.
మీడియా మారింది, బాధ్యత మరింత పెరిగింది
1981లో వరంగల్ వాణి వంటి ప్రాంతీయ పత్రిక ఒక అధికార వ్యవస్థను ప్రశ్నించడం ప్రజాస్వామ్యానికి ముఖ్యమైన రక్షణ. ఇప్పుడు పత్రికతో పాటు డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, స్వతంత్ర పోర్టల్స్, వీడియో జర్నలిజం ఉన్నాయి. దీంతో అధికారాన్ని ప్రశ్నించే సామర్థ్యం పెరిగింది. అదే సమయంలోతప్పుడు సమాచారం, డీప్‌ఫేక్‌లు, ట్రోల్ రాజకీయాలు, ఎంపిక చేసిన వీడియోలు, తప్పుడు ఆరోపణలు కూడా పెరిగాయి.అందువల్ల 1981లో సమస్య “నిజాన్ని ఎవరు బయటకు తీస్తారు?” అయితే 2026లో సమస్య: “నిజాన్ని ఎవరు నిర్ధారిస్తారు?” ఇది ప్రజాస్వామ్యానికి కొత్త “శేషప్రశ్న”.
న్యాయవ్యవస్థ, చివరి రక్షణా గోడ అందామా?
ఆచార్య ఒక కోర్టు తీర్పు మరో కోర్టులో మారవచ్చని గుర్తు చేశారు. అది న్యాయవ్యవస్థ బలహీనతకు మాత్రమే ఉదాహరణ కాదు; అప్పీల్ వ్యవస్థ, న్యాయపరమైన పునఃపరిశీలన కూడా చట్టపాలనలో భాగమే అని చెప్పే అవకాశం కూడా ఇస్తుంది. 2024 ఎన్నికల్ బాండ్లు Electoral Bonds తీర్పు, పోలీసు సంస్కరణలపై ప్రకాశ్ సింగ్ కేసులో Prakash Singh ఆదేశాలు, కస్టడీ మరణాలపై మానవ హక్కుల సంఘం NHRC కోర్టుల జోక్యం, ఇవన్నీ ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి: ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం లేదా పోలీసు చివరి మాట కాదు.
అయితే న్యాయవ్యవస్థపై అధిక ఆధారపడటం కూడా ప్రజాస్వామ్యానికి సంపూర్ణ పరిష్కారం కాదు. ప్రతి పరిపాలనా వైఫల్యాన్ని కోర్టుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడితే, ఎన్నికైన సంస్థలు మరియు పరిపాలనా వ్యవస్థలు తమ స్వంత రాజ్యాంగబద్ధ బాధ్యతను సరిగా నిర్వర్తించడం లేదనే ప్రశ్న వస్తుంది.
మరి 1981 నుంచి 2026 వరకు అసలు మారినదేమిటి?
ఇటీవల వచ్చిన ఒక సినిమాలో, హీరో ‘‘ఏం మారింది అత్తా’’ మారింది చాలా ఉంది. కథ పాతదే కాని కథనం లో ప్రశ్నలు అని మెచ్చుకున్నారు. అంటే సమస్య మూల స్వభావం పూర్తిగా మారలేదు. 1981లో పోలీస్ స్టేషన్ ఒక భౌతిక అధికారం కేంద్రం. ఇప్పుడు అది CCTV, CCTNS, డిజిటల్ FIR, ఫోరెన్సిక్
1981లో మానవహక్కుల పరిరక్షణకు పరిమిత సంస్థాగత వ్యవస్థ ఉండేది. ఇప్పుడు NHRC, రాష్ట్ర మానవహక్కుల కమిషన్లు, న్యాయపరమైన పరిహారాలు, CCTV, ఫోరెన్సిక్ వ్యవస్థలు ఉన్నాయి. కానీ అధికారాన్ని ఉపయోగించే మనిషి మారకపోతే సంస్థలు మాత్రమే ప్రజాస్వామ్యాన్ని రక్షించలేవు. ఇదే ఆచార్య సంపాదకీయానికి 2026లో అత్యంత ప్రస్తుత అంశం, చర్చించవలసిన పాఠం.
పాలకులు ఏం నేర్చుకోవాలి?
పాలకులు మొదటగా గుర్తుంచుకోవలసింది: ప్రభుత్వం అంటే గెలిచిన పార్టీకి వచ్చిన శాశ్వత అధికారం కాదు; ప్రజల తరఫున తాత్కాలికంగా అప్పగించబడిన రాజ్యాంగబద్ధ బాధ్యత.పోలీసును రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించకూడదు. దర్యాప్తు స్వతంత్రతకు రక్షణ ఉండాలి. కస్టడీ హింసపై “శూన్య సహనం” మాటల్లో కాకుండా, ప్రతి కేసులో బాధ్యత నిర్ధారణలో కనిపించాలి. కుంభకోణం జరిగిన తరువాత విచారణ కంటే, కాంట్రాక్టులు, పార్టీ నిధులు, ప్రభుత్వ కొనుగోళ్లు, లైసెన్సులు, నియా
పోలీసులు ఏం నేర్చుకోవాలి?
పోలీసు అధికారానికి చట్టం ఇచ్చిన బలం ఉంది; కానీ అదే చట్టం దానికి పరిమితులు కూడా విధించింది. అరెస్టు అంటే శిక్ష కాదు. విచారణ అంటే హింస కాదు. అనుమానం అంటే నేర నిర్ధారణ కాదు. FIR అంటే దోషిగా తీర్పు కాదు. కస్టడీ అంటే పోలీసుకు వ్యక్తిపై సంపూర్ణ అధికారం కాదు. పోలీసు ప్రజలను భయపెట్టే సంస్థ నుంచి ప్రజల హక్కులను రక్షించే సంస్థగా పరిణమించాలి.
మరి ప్రజలు?
ఆచార్య చివరగా ప్రజలను కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యం కేవలం పాలకుల బాధ్యత కాదు. ప్రజలు తమకు నచ్చిన పార్టీ లేదా నాయకుడు చేసిన తప్పును “మన వాళ్లు” అనే కారణంతో సమర్థిస్తే, ఆచార్య విమర్శించిన “రాజకీయ కవచం” మళ్లీ ఏర్పడుతుంది. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాని పోలీసు దుర్వినియోగాన్ని ప్రశ్నించి, అదే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసు చర్యను సమర్థించడం ప్రజాస్వామ్య నైతికత కాదు.పోలీసు తప్పు అయితే తప్పే. మంత్రి తప్పు అయితే తప్పే. ప్రతిపక్ష నాయకుడు తప్పు చేసినా తప్పే. మనకు నచ్చిన సిద్ధాంతం పేరుతో నేరానికి మినహాయింపు ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని బలపరచదు.
“డిఫెన్సులో పడ్డ ప్రజాస్వామ్యం” — 45 సంవత్సరాల తరువాత 1981లో ఆచార్య “ప్రజాస్వామ్యం జవాబు చెప్పుకోవలసి ఉన్నది” అన్నారు. 2026లో కూడా ఆ ప్రశ్నను కొత్త భాషలో అడగవచ్చు:
అధికారం ఎవరి చేతిలో ఉంది?
ఆ అధికారాన్ని ఎవరు పర్యవేక్షిస్తున్నారు?
తప్పు చేసిన అధికారిపై ఎవరు చర్య తీసుకుంటారు?
బాధితుడికి పరిహారం ఎంత త్వరగా లభిస్తుంది?
ప్రజలకు నిజమైన సమాచారం అందుతున్నదా?
రాజకీయ సిద్ధాంతం చట్టం కంటే పై స్థాయికి వెళ్తుందా?
ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్క ప్రభుత్వం ఇవ్వలేడు. ఒక్క పోలీసు శాఖ ఇవ్వలేడు. ఒక్క కోర్టు కూడా ఇవ్వలేడు. రాజ్యాంగ సంస్థలు, రాజకీయ పార్టీలు, మీడియా, న్యాయవ్యవస్థ





