యువత భవిష్యత్ కు భరోసా ప్రజాప్రభుత్వం 

 

   మెయిన్స్ లో ఎంపికైన 20 మంది అభ్యర్థులకు ఒక్కొకరికి రూ.లక్ష రూపాయలు 
    అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ సాధించుకున్నాం..గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో నిరుద్యోగులు ఎంతో నష్టపోయారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వొచ్చింది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు .  మెయిన్స్ లో ఎంపికైన 20 మంది అభ్యర్థులకు ఒక్కొకరికి రూ.లక్ష రూపాయల చెక్కును ముఖ్యమంత్రి అండ జేసారు. ఆదివారం ప్రజా భవన్ లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో  ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   మాట్లాడుతూ  సివిల్స్ లో మన రాష్ట్ర అభ్యర్థులు ఎక్కువ మంది రాణించాలని మా ఉద్దేశం..బీహార్ నుంచి అత్యధికంగా సివిల్స్ లో రాణిస్తున్నారు అని పేర్కొంటూ  అలాంటి ప్రత్యేక శ్రద్ధ మన రాష్ట్రంలో కూడా ఉండాలని, వారికి ఆర్థికంగా సహకారం అందించాలని రాజీవ్ సివిల్స్ అభయహస్తం ద్వారా రూ.లక్ష సాయం అందిస్తున్నామన్నారు .  ఇది ఆర్ధిక సాయం కాదు… ప్రభుత్వం వారికి అందిస్తున్న ప్రోత్సాహంగా భావించాలి అని పేర్కొంటూ “కష్టంతో కమిట్మెంట్ ఉంటేనే విజయం వరిస్తుంది..ఇంటర్వ్యూకు వెళ్లే ప్రతీ ఒక్కరూ సివిల్స్ లో సెలెక్ట్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నాం.. దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటి ఏడాదిలోనే 55143 ఉద్యోగ నియామకాలు చేపట్టాం..ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది ” అన్నారు .   14 ఏళ్లుగా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేదు. కానీ తమ ప్రభుత్వం అడ్డంకులను, కుట్రలను అధిగమించి 563 గ్రూప్ 1 ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించామన్నారు . మార్చి 31 లోగా 563 గ్రూప్ 1 ఉద్యోగాల నియామకాలను పూర్తిచేయబోతున్నట్లు తెలుపుతూ ..ఈ ప్రభుత్వం ఆలోచించేది యువత భవిష్యత్ కోసమే..జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నాం.. సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులను అన్నిరకాలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దేశంలో అత్యధికంగా మన రాష్ట్రం నుంచి సివిల్స్ లో ఎంపికవుతారని గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో   ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సింగరేణి సీఎండీ బలరాం, ఉన్నతాధికారులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *