తెలంగాణ కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు మృతి
హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి18: రెండ్రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లా పూజారి కాంకేర్- మారేడుబాక అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన వారిలో తెలంగాణకు చెందిన మావోయిస్టు కీలక నేత మృతిచెందారు. మావోయిస్టు తెలంగాణ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న బడే చొక్కారావు అలియాస్ దామోదర్ పోలీసు కాల్పుల్లో మృతి చెందినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. దామోదర్‌పై గతంలో రూ.50లక్షల రివార్డు ఉంది.
బడే చొక్కారావు (దామోదర్) స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి. బీజాపుర్ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది.గురువారం జరిగిన ఎన్‌కౌంటర్ అనంతరం భద్రతా బలగాలు మావోయిస్టుల ఆయుధాలు స్వాధీనం చేసుకోవడంతోపాటు భారీ బంకర్‌ను గుర్తించాయి. ఇందులో సొరంగల్ దేశవాళీ రాకెట్ లాంచర్లు, పెద్దఎత్తున యంత్రాలు, మందుగుండు సామగ్రి, విద్యుత్తు లైన్ నిర్మించే సిల్వర్ వైర్లు లభించాయి.