అవినీతికి మాగాణం అవుతున్న తెలంగాణ!

తెలంగాణ ప్రభుత్వ అవినీతి నిరోధక శాఖ 2025 మొత్తం సంవత్సరానికి పదిహేను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు పట్టుకోగా, 2026 మొదటి ఆరు నెలల్లోనే పద్నాలుగు కేసులు పట్టుకుని రికార్డు సృష్టించింది. వాటిని అధికారికంగా అవినీతి కేసులు అనరు. “ఆదాయానికి మించిన ఆస్తుల” – డిస్ ప్రపోర్షనేట్ అసెట్స్ కేసులు అంటారు. అంటే ఒక ప్రభుత్వాధికారి, ప్రజా సేవకుడు తన గుర్తించిన ఆదాయ వనరులన్నిటి నుంచీ సంపాదించ గలిగిన దానికన్నా ఎక్కువ ఆస్తులు పోగు చేసుకోవడం. అవినీతి నిరోధక చట్టం 1988 లో సెక్షన్ 13(1)(బి), సెక్షన్ 13 (2) ఈ ఆదాయానికి మించిన ఆస్తులను నేరాలుగా పరిగణిస్తుంది. ఒక నిర్ణీత కాలంలో “చట్టబద్ధమైన, ప్రకటిత ఆదాయ వనరులకు దామాషాలో సరిపోని ఆస్తులు” అనేది ఇక్కడ చట్టం చెప్పే నిర్వచనం.

అనుమానితులు ప్రజా సేవకుడు (ప్రభుత్వోద్యోగి) అయి ఉంటే, ఒక నిర్ణీతకాలపు ఆదాయాన్ని, ఆస్తిని నిర్దిష్టంగా లెక్కిస్తారు. ఆ కాలానికి సంబంధించిన, ప్రకటించిన చట్టబద్ధమైన ఆదాయ వనరులన్నిటినీ లెక్కిస్తారు. అదే కాలంలో నిందితులు ప్రకటించిన కుటుంబ ఖర్చులన్నిటినీ లెక్కిస్తారు. ఆ నిర్ణీత కాలం చివరన నిందితుల పేరు మీద, కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఆస్తులన్నిటినీ లెక్కిస్తారు. మొత్తం ఆదాయం నుంచి మొత్తం ఖర్చును తీసివేసి, ఆ మిగులుకూ ఉన్న ఆస్తులకూ మధ్య తేడాను గుర్తిస్తారు. ఆ తేడా ఎంత ఎక్కువగా ఉన్నదో దాన్ని బట్టి విచారణ ప్రక్రియ మొదలవుతుంది.  

అవినీతి నిరోధక శాఖ అధికారులు నిందితుల ఇంటి మీద దాడి చేసి, సోదా చేయడానికి ఏదైనా నిర్దిష్ట  ఫిర్యాదు వచ్చి ఉండవచ్చు. లేదా సమాచారం అంది ఉండవచ్చు. ఆ అధికారి పని చేస్తున్న శాఖనుంచి సమాచారం అంది ఉండవచ్చు. సమాచార రూపం ఏదైనా సరే, అవినీతి నిరోధక శాఖ ముందుగా అనుమానితుల జీత భత్యాలు, ఆదాయపు పన్ను శాఖకు సమర్పించిన లెక్కలు, స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాలు, బేనామీగా ఉండడానికి అవకాశం ఉన్న బంధుమిత్రుల ఆస్తులు రహస్యంగా లెక్కిస్తారు. ఆ ఆధారాలతో ఎఫ్ఐఆర్ నమోదు అయిన తర్వాత, సర్చ్ వారంట్ తో, ఏకకాలంలో అనుమానితుల ఇంటి మీద, కార్యాలయం మీద, బ్యాంకు లాకర్ల మీద, ఫార్మ్ హౌజ్ మీద, అనుమానిత బంధువుల ఇళ్ల మీద, బేనామీలుగా అనుమానం ఉన్నవారి ఇళ్ల మీద దాడి చేసి, సోదాలు చేసి, నేర నిర్ధారణకు ఉపయోగపడగల పత్రాలు, ఎలక్ట్రానిక్ ఆధారాలు సేకరిస్తారు.

నికర ఆదాయానికి మించిన ఆస్తులను లెక్కించినప్పుడు, అనుమానితులు ఆ ఆస్తి తమకు వారసత్వంగా వచ్చిందనో, వ్యవసాయ ఆదాయం ద్వారా వచ్చిందనో, భార్య/భర్త ఆదాయం అనో, కానుకలుగా వచ్చిందనో, అప్పు తీసుకున్నామనో వగైరా కారణాలు చూపవచ్చు. ఆ కారణాలు సరైనవేనని సాక్షాధారాలు ఉంటే, కేసు ముందుకు సాగదు. ఈ ప్రక్రియ అంతా అయిపోయాక, ఆ అధికారి మీద ప్రాసిక్యూషన్ జరపవచ్చునని ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. అలా అనుమతి వస్తేనే అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయమూర్తి ముందు కేసు నమోదవుతుంది. కొన్ని వందల అవినీతి కేసులు అలా ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తూ పెండింగ్ లో ఉన్నాయి.

ఆ అనుమతి వచ్చి కేసు నడిచినా సాధారణంగా ఈ కేసులు సుదీర్ఘ కాలం తీసుకుంటాయి. ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు, క్రాస్ ఎగ్జామినేషన్ వంటి ప్రక్రియ ఉండదు. ఆస్తుల విలువ మదింపు చేసిన నివేదికలు, ఆదాయపు పన్ను చెల్లింపుల లెక్కలు, బ్యాంకు ఖాతాల లెక్కలు వంటి లెక్కలతో కూడిన వందలాది పత్రాలను ఇంజనీర్లు, ఆడిటర్లు, రిజిస్ట్రేషన్ అధికారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు సమీక్షిస్తారు, పరిశీలిస్తారు, విశ్లేషిస్తారు, కోర్టుకు నివేదికలు ఇస్తారు. దాని మీద ఆధారపడి తీర్పులు ఉంటాయి. ఈ క్రమం మొత్తంలో కూడా అవినీతిపరులైన అధికారులు ఉండవచ్చు. అందువల్ల అవినీతి కేసు అవినీతికి బలి అయిపోవచ్చు. అలా కాకుండా సక్రమంగా జరిగితే ఆదాయానికి మించిన ఆస్తులను జప్తు చేయడం, జైలు శిక్ష, జరిమానా, ఉద్యోగం నుంచి తొలగింపు, పెన్షన్ మీద ఆంక్షలు వంటి శిక్షలు విధించే అవకాశం ఉంది. కాని అంతదూరం వచ్చిన కేసులు చాలా చాలా తక్కువ.  

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం తెలంగాణలో 2021లో ఏడు కేసుల విచారణ జరిగి, ఆరు కేసుల్లో శిక్షలు పడ్డాయని, ఒక కేసు కొట్టుడుపోయిందని, అంటే శిక్షలు పడిన కేసులు 85.7 శాతం అని అవినీతి నిరోధక శాఖ గొప్పలు చెప్పుకుంది. వాస్తవమేమంటే, అప్పటికి 900 కేసులు పెండింగ్ లో ఉండగా అందులో ఆ సంవత్సరం ఏడు కేసులు మాత్రమే విచారణ జరిగింది! అలాగే 2024లో 70 శాతం కేసుల్లో విజయం సాధించామని ప్రభుత్వం చెప్పుకుంది గాని మొత్తం పెండింగ్ కేసులు ఎన్ని ఉన్నాయో తెలియదు. ఆ ఒక్క సంవత్సరమే 213 అవినీతి కేసులు నమోదు కాగా, అందులో 11 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు. ఇక 2025లో మొత్తం 15 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదయ్యాయి. ఆ గణాంకాల ప్రకారం ఆ ఏడాదంతా జరిగిన అవినీతి, ఈ ఏడాది ఆరునెలల్లోనే జరిగింది!

మామూలుగా ఎవరో ఒక ప్రభుత్వాధికారి లంచం తీసుకుంటుండగా రెడ్ హాండెడ్ గా పట్టుకున్నామని వార్తలు వస్తుంటాయి. అటువంటి సందర్భాల్లో సాధారణంగా కిందిస్థాయి ఉద్యోగులు ఉంటారు, లంచం సొమ్ము కొన్ని వేలో, లక్షలో ఉంటుంది. ఆ అవినీతి కేసులకు భిన్నంగా, ప్రత్యేకంగా లంచం తీసుకుంటున్నప్పుడు పట్టుకోకపోయినా, ఇళ్ల మీద అవినీతి నిరోధక శాఖ దాడి చేసి సోదా చేసినప్పుడు కోట్లాది రూపాయల నగదు, ఆస్తి పత్రాలు, వెండి బంగారాలు, వాహనాలు దొరుకుతుంటాయి. నిజానికి ఒక లంచం కేసు కన్నా ఇటువంటి ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసులు ప్రమాదకరమైనవి, భారీవి. ఇక్కడ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పని చేసి పెట్టడానికి లంచం తీసుకోవడం కాదు, ఉద్యోగ “విధి నిర్వహణ”లో భాగంగా దాదాపు ప్రతి పనికీ లంచం తీసుకుంటూ, దాన్ని ఒక జీవనంగా మార్చుకుని, ఏళ్ల తరబడి ఉద్యోగం చేసిన తర్వాత అడ్డగోలుగా సంపద పోగైన ఉదాహరణలు ఇవి. అయితే ఇవి వాటికవి మన వ్యవస్థకు పట్టిన రోగం కాదు, వ్యవస్థ అనుభవిస్తున్న దీర్ఘకాల వ్యాధి లక్షణాలూ చిహ్నాలూ ఇవి. మన వ్యవస్థ పుచ్చిపోయేలా చేసిన అసలు వ్యాధి గురించి ఆలోచించడానికి ఈ రోగ లక్షణాలు ఉపయోగపడితే బాగుండును.   

గత రెండు మూడు వారాల్లో కొందరు ప్రభుత్వాధికారుల ఇళ్లలో, బ్యాంకు లాకర్లలో అవినీతి నిరోధక శాఖ చేసిన సోదాల్లో బైటపడిన నోట్ల కట్టలు, వెండి బంగారాలు, స్థిరాస్తి పత్రాలుబ్యాంకు ఖాతాలు, వాహనాలుచరాస్తుల వివరాలు చూస్తుంటే కిందిస్థాయి సగటు అధికారుల దగ్గరే ఇంతింత సంపద పోగుపడి ఉంటేవిధాన నిర్ణేతలైనఅక్రమార్జనకు నిలయాలైన ఉన్నతాధికారులరాజకీయ నాయకుల, మంత్రుల, శాసనసభ్యుల ఇళ్ల మీద దాడి చేసి సోదా చేయగల అవకాశమే ఉంటే ఇంకా ఎన్నెన్ని బైటపడతాయో అనిపిస్తున్నది. తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి ఆలయం గురించి వచ్చిన వదంతులను మించిన దృశ్యాలు కనబడతాయి గదా అనిపిస్తున్నది.  

సర్వే, బందోబస్తు, భూమి రికార్డుల కార్యాలయం డెప్యూటీ డైరెక్టర్ ఇంట్లో రు. 1.54 కోట్ల నగదు, బ్యాంకు ఖాతాల్లో రు. 2.29 కోట్ల నిలువరు. 5.04 కోట్ల ఫిక్సెడ్ డిపాజిట్లు దొరికాయి. మర్నాడు మరొక బ్యాంకులో ఆయన భార్య పేరిట ఉన్న లాకర్లను తెరవగా, వాటిలో రు. 1.5 కోట్ల నగదు, రెండు కిలోల బంగారం బిస్కెట్లు, ఆభరణాలు దొరికాయి. ఆయన 1987లో సర్వేయర్ గా చేరి, సర్వే సెటిల్ మెంట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిసోదా జరిగే నాటికి డెప్యూటీ డైరెక్టర్ గా ఉన్నాడు. ఇంట్లో పడుకునే పరుపు కింద నోట్ల కట్టలు పరుచుకుని ఉన్నారని వార్తలు వచ్చాయి.

మరొక కేసులో ఒక మహిళా తహశీల్దార్ ఇంట్లో సోదా చేస్తే ఐదు కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు, నగదు, బంగారు, వజ్రాల ఆభరణాలు దొరికాయి. వాటి మార్కెట్ విలువ రు. 50 కోట్ల పైనే ఉండవచ్చునని అవినీతి నిరోధక శాఖ అధికారులన్నారు. ఇంకొక కేసులో ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ దగ్గర ఆదాయాన్ని మించిన ఆస్తులు రు. 2.25 కోట్లు దొరికాయి. వెయ్యి రూపాయల మామూలు కూడా వదిలేవాడు కాదని, ప్రతి కల్లు దుకాణం నుంచి నెలవారీ ఎంతెంత మామూలు సేకరిస్తాడో వివరాలు దొరికాయని వార్తలు వచ్చాయి.

మరొక కేసులో పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ డీఎస్పీ ఇంట్లో, ఆయన బంధువులు, బేనామీల ఇళ్లలో పదహారు చోట్ల సోదాలు జరపగా రెండు కిలోల బంగారు ఆభరణాలు, ఇరవై కిలోల వెండి, కర్ణాటకతో సహా వేరు వేరు చోట్ల భూములు, వాహనాలు, ఇళ్లు… మొత్తంగా రెండు వందల కోట్ల రూపాయల ఆస్తులు లెక్క తేలాయి. ఆ డీఎస్పీ తన ఆస్తులలో చాలా భాగం బేనామీల పేర్లమీద పెట్టాడని తేలగా, అసలు ఆయనే మరెవరో రాజకీయ పెద్దలకు బేనామీ కావచ్చునని ఊహాగానాలు వస్తున్నాయి. ఆయన చార్ ధాం యాత్రకు వెళ్తూ, తిరిగి వస్తానో రానో అనే అనుమానంతో తన ఆస్తుల, బేనామీల పేర్ల మీద ఉన్న ఆస్తుల వివరాలన్నీ అక్షరం పొల్లు పోకుండా రాసి, పిల్లలకు, ఇతరులకు పంపకాలు చేసి, ఇద్దరు కొడుకులకు వాట్సప్ చేయగా, అవి బైటపడ్డాయని వార్తలు వస్తున్నాయి.

ఇవన్నీ ఇంగ్లిష్ నుడికారంలో చెప్పాలంటే సముద్రం మీద తేలియాడుతున్న మంచుగడ్డలు. సముద్రంలో మునిగిన భాగం ఎంతో ఇంకా ఇప్పటికి తెలియదు. మన అస్తవ్యస్త, స్వార్థపర పాలనా వ్యవస్థ సముద్రంలో పైకి తేలని మంచుగడ్డలు, మహా మంచు పర్వతాలు మరెన్ని ఉన్నాయో తెలియదు. ఇక్కడ బైటపడిన నాలుగు శాఖలూ – భూముల సర్వే, రెవెన్యూ, ఎక్సైజ్, పోలీసు, మన సమాజానికి వ్యవస్థకు మూల స్తంభాలు కావలసినవి, అక్రమార్జనకు, అవినీతికి, అక్రమాలకు రాజపోషకులుగా ఉన్నాయి. నిజానికి ఇక్కడ దొరికిన వారిలో ఒకరే అధికార నిచ్చెనమెట్లలో కాస్త పైన ఉన్నారు. మిగిలిన ముగ్గురూ అడుగున ఉన్నవారే. మొత్తంగా ఈ నలుగురికీ పైన అధికార నిచ్చెనలో కనీసం ఐదారు స్థానాలు ఉంటాయి. వారిలో ఏ ఒకరిద్దరు నీతి మంతులను మినహాయిస్తే, మిగిలిన తొంబై శాతం మందికి ఈ కింది స్థాయి నుంచి వాటాలు గాని, లేదా పై స్థాయిలోనే దొరికే మరింత పెద్ద ఎత్తున అవినీతి అవకాశాలు గాని ఉంటాయి. మరి ఇంత పెద్ద ఎత్తున అవినీతి, ఆదాయానికి మించిన ఆస్తుల సమీకరణ జరుగుతుంటే, సోదాలు వార్తలు పతాక శీర్షికలకు ఎక్కుతున్నాయి గాని, శిక్షలు పడుతున్నాయా? అవినీతి ఆగిపోతున్నదా? అవినీతిపరులకు కనీసం భయం అన్నా కలుగుతున్నదా?   

తెలంగాణ సంపన్న రాష్ట్రమా, పేద రాష్ట్రమా అని గత పది పన్నెండేళ్లుగా చర్చ జరుగుతున్నది. ఎవరి అంచనాలు, లెక్కలు వారికి ఉన్నాయి. ఎప్పుడైనా ఏదైనా ఒక విషయం మనం నిలబడిన చోటు నుంచి మాత్రమే అర్థం అవుతుంది. ఆ చోటు మారితే అదే దృశ్యం పూర్తిగా భిన్నంగా కూడా కనబడవచ్చు. ఒక చోట నిలబడడం, అర్థం కావడం, కనబడడం అనేవి కూడా కేవలం భౌతికమైనవి కావు, ప్రయోజనాలు, భావజాలంతో ప్రభావితమైన దృక్కోణం కూడా వాటి పాత్ర నిర్వహిస్తాయి. తెలంగాణ సంపన్న రాష్ట్రం అని ఒక సందర్భంలో అనేవాళ్లే మరొక సందర్భంలో తెలంగాణ ఆర్థిక స్థితి బాగులేదని అనవచ్చు. లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూసీని పునరుద్ధరిస్తామని, గాంధీ సరోవర్ నిర్మిస్తామని అంటున్నవాళ్లే లక్ష కోట్లు కాదు గదా, కోటి గూడ కాదు గదా, లక్ష రూపాయలు కూడా ఇవ్వవలసిన వాళ్లకు ఇవ్వకుండా ఎగ్గొడుతుండవచ్చు. కాని ప్రస్తుతానికి ఆ సంపన్న రాష్ట్రమా, పేద రాష్ట్రమా అనే చర్చను, అవినీతి పెద్దన్న రాష్ట్రం అని ముగించవచ్చు.  

తెలంగాణ ప్రభుత్వ అవినీతి నిరోధక శాఖ 2025 మొత్తం సంవత్సరానికి పదిహేను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు పట్టుకోగా, 2026 మొదటి ఆరు నెలల్లోనే పద్నాలుగు కేసులు పట్టుకుని రికార్డు సృష్టించింది. వాటిని అధికారికంగా అవినీతి కేసులు అనరు. “ఆదాయానికి మించిన ఆస్తుల” – డిస్ ప్రపోర్షనేట్ అసెట్స్ కేసులు అంటారు. అంటే ఒక ప్రభుత్వాధికారి, ప్రజా సేవకుడు తన గుర్తించిన ఆదాయ వనరులన్నిటి నుంచీ సంపాదించ గలిగిన దానికన్నా ఎక్కువ ఆస్తులు పోగు చేసుకోవడం. అవినీతి నిరోధక చట్టం 1988 లో సెక్షన్ 13(1)(బి), సెక్షన్ 13 (2) ఈ ఆదాయానికి మించిన ఆస్తులను నేరాలుగా పరిగణిస్తుంది. ఒక నిర్ణీత కాలంలో “చట్టబద్ధమైన, ప్రకటిత ఆదాయ వనరులకు దామాషాలో సరిపోని ఆస్తులు” అనేది ఇక్కడ చట్టం చెప్పే నిర్వచనం.

అనుమానితులు ప్రజా సేవకుడు (ప్రభుత్వోద్యోగి) అయి ఉంటే, ఒక నిర్ణీతకాలపు ఆదాయాన్ని, ఆస్తిని నిర్దిష్టంగా లెక్కిస్తారు. ఆ కాలానికి సంబంధించిన, ప్రకటించిన చట్టబద్ధమైన ఆదాయ వనరులన్నిటినీ లెక్కిస్తారు. అదే కాలంలో నిందితులు ప్రకటించిన కుటుంబ ఖర్చులన్నిటినీ లెక్కిస్తారు. ఆ నిర్ణీత కాలం చివరన నిందితుల పేరు మీద, కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఆస్తులన్నిటినీ లెక్కిస్తారు. మొత్తం ఆదాయం నుంచి మొత్తం ఖర్చును తీసివేసి, ఆ మిగులుకూ ఉన్న ఆస్తులకూ మధ్య తేడాను గుర్తిస్తారు. ఆ తేడా ఎంత ఎక్కువగా ఉన్నదో దాన్ని బట్టి విచారణ ప్రక్రియ మొదలవుతుంది.  

అవినీతి నిరోధక శాఖ అధికారులు నిందితుల ఇంటి మీద దాడి చేసి, సోదా చేయడానికి ఏదైనా నిర్దిష్ట  ఫిర్యాదు వచ్చి ఉండవచ్చు. లేదా సమాచారం అంది ఉండవచ్చు. ఆ అధికారి పని చేస్తున్న శాఖనుంచి సమాచారం అంది ఉండవచ్చు. సమాచార రూపం ఏదైనా సరే, అవినీతి నిరోధక శాఖ ముందుగా అనుమానితుల జీత భత్యాలు, ఆదాయపు పన్ను శాఖకు సమర్పించిన లెక్కలు, స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాలు, బేనామీగా ఉండడానికి అవకాశం ఉన్న బంధుమిత్రుల ఆస్తులు రహస్యంగా లెక్కిస్తారు. ఆ ఆధారాలతో ఎఫ్ఐఆర్ నమోదు అయిన తర్వాత, సర్చ్ వారంట్ తో, ఏకకాలంలో అనుమానితుల ఇంటి మీద, కార్యాలయం మీద, బ్యాంకు లాకర్ల మీద, ఫార్మ్ హౌజ్ మీద, అనుమానిత బంధువుల ఇళ్ల మీద, బేనామీలుగా అనుమానం ఉన్నవారి ఇళ్ల మీద దాడి చేసి, సోదాలు చేసి, నేర నిర్ధారణకు ఉపయోగపడగల పత్రాలు, ఎలక్ట్రానిక్ ఆధారాలు సేకరిస్తారు.

నికర ఆదాయానికి మించిన ఆస్తులను లెక్కించినప్పుడు, అనుమానితులు ఆ ఆస్తి తమకు వారసత్వంగా వచ్చిందనో, వ్యవసాయ ఆదాయం ద్వారా వచ్చిందనో, భార్య/భర్త ఆదాయం అనో, కానుకలుగా వచ్చిందనో, అప్పు తీసుకున్నామనో వగైరా కారణాలు చూపవచ్చు. ఆ కారణాలు సరైనవేనని సాక్షాధారాలు ఉంటే, కేసు ముందుకు సాగదు. ఈ ప్రక్రియ అంతా అయిపోయాక, ఆ అధికారి మీద ప్రాసిక్యూషన్ జరపవచ్చునని ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. అలా అనుమతి వస్తేనే అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయమూర్తి ముందు కేసు నమోదవుతుంది. కొన్ని వందల అవినీతి కేసులు అలా ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తూ పెండింగ్ లో ఉన్నాయి.

ఆ అనుమతి వచ్చి కేసు నడిచినా సాధారణంగా ఈ కేసులు సుదీర్ఘ కాలం తీసుకుంటాయి. ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు, క్రాస్ ఎగ్జామినేషన్ వంటి ప్రక్రియ ఉండదు. ఆస్తుల విలువ మదింపు చేసిన నివేదికలు, ఆదాయపు పన్ను చెల్లింపుల లెక్కలు, బ్యాంకు ఖాతాల లెక్కలు వంటి లెక్కలతో కూడిన వందలాది పత్రాలను ఇంజనీర్లు, ఆడిటర్లు, రిజిస్ట్రేషన్ అధికారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు సమీక్షిస్తారు, పరిశీలిస్తారు, విశ్లేషిస్తారు, కోర్టుకు నివేదికలు ఇస్తారు. దాని మీద ఆధారపడి తీర్పులు ఉంటాయి. ఈ క్రమం మొత్తంలో కూడా అవినీతిపరులైన అధికారులు ఉండవచ్చు. అందువల్ల అవినీతి కేసు అవినీతికి బలి అయిపోవచ్చు. అలా కాకుండా సక్రమంగా జరిగితే ఆదాయానికి మించిన ఆస్తులను జప్తు చేయడం, జైలు శిక్ష, జరిమానా, ఉద్యోగం నుంచి తొలగింపు, పెన్షన్ మీద ఆంక్షలు వంటి శిక్షలు విధించే అవకాశం ఉంది. కాని అంతదూరం వచ్చిన కేసులు చాలా చాలా తక్కువ.  

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం తెలంగాణలో 2021లో ఏడు కేసుల విచారణ జరిగి, ఆరు కేసుల్లో శిక్షలు పడ్డాయని, ఒక కేసు కొట్టుడుపోయిందని, అంటే శిక్షలు పడిన కేసులు 85.7 శాతం అని అవినీతి నిరోధక శాఖ గొప్పలు చెప్పుకుంది. వాస్తవమేమంటే, అప్పటికి 900 కేసులు పెండింగ్ లో ఉండగా అందులో ఆ సంవత్సరం ఏడు కేసులు మాత్రమే విచారణ జరిగింది! అలాగే 2024లో 70 శాతం కేసుల్లో విజయం సాధించామని ప్రభుత్వం చెప్పుకుంది గాని మొత్తం పెండింగ్ కేసులు ఎన్ని ఉన్నాయో తెలియదు. ఆ ఒక్క సంవత్సరమే 213 అవినీతి కేసులు నమోదు కాగా, అందులో 11 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు. ఇక 2025లో మొత్తం 15 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదయ్యాయి. ఆ గణాంకాల ప్రకారం ఆ ఏడాదంతా జరిగిన అవినీతి, ఈ ఏడాది ఆరునెలల్లోనే జరిగింది!

మామూలుగా ఎవరో ఒక ప్రభుత్వాధికారి లంచం తీసుకుంటుండగా రెడ్ హాండెడ్ గా పట్టుకున్నామని వార్తలు వస్తుంటాయి. అటువంటి సందర్భాల్లో సాధారణంగా కిందిస్థాయి ఉద్యోగులు ఉంటారు, లంచం సొమ్ము కొన్ని వేలో, లక్షలో ఉంటుంది. ఆ అవినీతి కేసులకు భిన్నంగా, ప్రత్యేకంగా లంచం తీసుకుంటున్నప్పుడు పట్టుకోకపోయినా, ఇళ్ల మీద అవినీతి నిరోధక శాఖ దాడి చేసి సోదా చేసినప్పుడు కోట్లాది రూపాయల నగదు, ఆస్తి పత్రాలు, వెండి బంగారాలు, వాహనాలు దొరుకుతుంటాయి. నిజానికి ఒక లంచం కేసు కన్నా ఇటువంటి ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసులు ప్రమాదకరమైనవి, భారీవి. ఇక్కడ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పని చేసి పెట్టడానికి లంచం తీసుకోవడం కాదు, ఉద్యోగ “విధి నిర్వహణ”లో భాగంగా దాదాపు ప్రతి పనికీ లంచం తీసుకుంటూ, దాన్ని ఒక జీవనంగా మార్చుకుని, ఏళ్ల తరబడి ఉద్యోగం చేసిన తర్వాత అడ్డగోలుగా సంపద పోగైన ఉదాహరణలు ఇవి. అయితే ఇవి వాటికవి మన వ్యవస్థకు పట్టిన రోగం కాదు, వ్యవస్థ అనుభవిస్తున్న దీర్ఘకాల వ్యాధి లక్షణాలూ చిహ్నాలూ ఇవి. మన వ్యవస్థ పుచ్చిపోయేలా చేసిన అసలు వ్యాధి గురించి ఆలోచించడానికి ఈ రోగ లక్షణాలు ఉపయోగపడితే బాగుండును.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *