Tag political commentary

రాజకీయాల్లో మెరుస్తున్న ‘కాక్రోచ్’

 “ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు దేశ విద్యార్థులు యువత, మహిళలు, కార్మికులు, రైతులు ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో దేశంలో ఏదో మార్పు జరగబోతోంది అనే భ్రమలు కల్పించడమే లక్ష్యంగా సోషల్ మీడియాలో గాలివాటం పార్టీలు రాత్రికి రాత్రే పుట్టుకొస్తాయి. పాలక, ప్రతిపక్షాలకు వాటి అవసరం తీరిపోయాక రాత్రికి రాత్రే వాటిని మాయం చేస్తాయి. ప్రశ్నించే గొంతులను నొక్కడం…

వోటుబొండిగలో సర్కార్ చేప!

“హైదరాబాద్ చేప ప్రసాదం అనేది విశ్వాసం, విజ్ఞాన శాస్త్రం మధ్య ఉన్న గీతను చెరిపేసే ఒక ప్రయత్నం. 180 ఏండ్ల క్రితం ప్రారంభమైన ఒక చిన్న కుటుంబ సంప్రదాయం, నేడు ప్రభుత్వ అండదండలతో ఒక భారీ సామాజిక వేడుకగా మారింది. అయితే శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం, ఆరోగ్య ముప్పులు పొంచి ఉండడం రాజ్యాంగబద్ధమైన శాస్త్రీయ దృక్పథానికి…

మిస్‌ఫైర్‌ అయిన ‘హిట్లర్‌’ ‌పోలిక

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ‘హైడ్రా’ పైన చేసిన వ్యాఖ్య మిస్‌ ‌ఫైర్‌ అయింది. రాష్ట్రంలో ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసినప్పుడు ఎంత చర్చనీ యాంశమైందో, ఇప్పుడు హైడ్రాను ఏ స్పూర్తితో ఏర్పాటు చేసానంటూ వివరించే ప్రయత్నం చేసిన సీఎం వ్యాఖ్యలు అంతకన్నా వివాదస్పదంగా మారాయి. హైడ్రా ఏర్పాటుపై రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా నేటికీ తీవ్రస్థాయిలో చర్చ…

తెలంగాణ భూమిపుత్రులది, ఎవరి జాగీరూ కాదు!

“తెలంగాణ వారికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎందుకు” అని స్వయంగా పవన్ కళ్యాణ్ అన్న మాటను ఆయన పార్టీ నాయకులు అనేక మంది పునరుక్తం చేశారు. ఎవరి స్థాయిలో వారు, ఎవరి సంస్కారాన్ని బట్టి వారు బూతులు, తిట్లు, దుర్భాషలు జోడించారు. నాగేశ్వర్ ను వ్యక్తిగతంగా తూలనాడారు. సామాజిక మాధ్యమాలలో, యూట్యూబ్ ఛానళ్లలో నాగేశ్వర్ మీద,…

మిలియన్ ఫాలోవర్స్

స్నేహారెడ్డి కొనకటి సాహిత్యంతో మీ అనుబంధం ఎలా మొదలైంది? చిన్నప్పటి నుంచే కథలు, పుస్తకాలు అంటే చాలా ఇష్టం. కొన్ని కథలు చదివితే మనల్ని మనం చూసుకున్నట్టు అనిపించేది. అలా చదువుతూ ఉండగా ఒకరోజు నేనుకూడా ఒకకథ చెప్పాలి” అనిపించింది. ఆ ఆలోచనే నన్ను రచన వైపు తీసుకొచ్చింది. తొలి నవలకి ప్రేరణ ఏమిటి? లండన్…

‘గుర్తులు మారినయి, గని గుణాలు మారలే!’

“న్యాయస్థానాల తలుపులు కూడా తట్టి, అనుకూలమైన ఉత్తర్వులు సంపాదించుకుని కూడా వాటిని ఖాతరు చేయని ప్రభుత్వాధికారుల ముందు నిస్సహాయంగా మిగులుతున్నవాళ్లు. రాజకీయ నాయకత్వాల రెండు నాల్కల, బహు నాల్కల వైఖరులతో విసుగెత్తినవాళ్లు. ఒక చివరి అవకాశంగా తమ గోడు సమాజానికి వినిపించుకుందామని వచ్చారు. రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల అఖిల పక్ష సమావేశంలో హృదయవిదారకమైన వేదన…

ప్రజాస్వామ్యం అంటే కప్పల తక్కెడ కోతి కొమ్మచ్చి!

“భారత ప్రజాస్వామానికి అత్యంత కీలకమైన పరీక్ష ఇక్కడే ఉంది. భారత పార్లమెంటరీ ఎన్నికల రాజకీయాలలో  పార్టీలూ, సిద్ధాంతాలూ, భావజాలాలూ, నిబద్ధతలూ, విధేయతలూ, కనీసం సిగ్గు ఎగ్గులూ ఏమీ లేవని, అధికార కాంక్ష, ప్రతిఫలాపేక్ష, లాభాపేక్ష, స్వార్థం, అవకాశవాదం మాత్రమే ఉన్నాయని దశాబ్దాలుగా రుజువవుతున్న విషయమే మళ్లీ ఒకసారి రుజువయ్యే మహత్తర అవకాశాన్ని తెలంగాణ మునిసిపల్ ఎన్నికలు…

సత్యాన్ని సమాధి చేసే కుట్రలు

Conspiracies That Bury the Truth

“కేంద్ర రాష్ట్రాలు పరోక్ష్యంగా ప్రత్యేక్షంగా నియంత్రించే, ప్రభుత్వాల ఆధ్వర్యంలో పని చేసే విచారణ సంస్థలపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు. కాబట్టి ఈ కాల్చివేత కుట్రల్లో కేంద్ర, రాష్ట్రాల ప్రమేయం ఉందన్న ఆరోపణలుండంతో, రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తే సరిపోదు. అంతర్ రాష్ట్రాల, కేంద్రం ఇన్వాల్వ్మెంట్ ఉందన్న అనుమానాలున్నాయి కాబట్టి, అందులోనూ కేంద్రం, రాష్ట్రం రెండు కూడా …

పిడికెడు మందికి లాభలు కోట్ల మందికి భారలు!

దేశం అభివృద్ధి చెందుతోందని పాలకులు గర్వంగా చెబుతున్నారు.మన దేశం నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఐదవ అతిపెద్ద శక్తిగా ఎదిగిందని గణాంకాలు ఘోషిస్తున్నాయి ర్యాంకులు పెరుగుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి, స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలను తాకుతున్నాయి. కానీ ఈ అభివృద్ధి ఎవరికి? ఈ గణాంకపు తళతళల వెనుక…