బెంగళూరు, ప్రజాతంత్ర, జూన్ 3 : బెంగళూరులోని లోక్‌భవన్‌లో బుధవారం వైభవంగా జరిగిన కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డి.కె.శివకుమార్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు ప్రత్యేకంగా హాజరయ్యారు. తమ ఆహ్వానాన్ని మన్నించి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన రేవంత్, భట్టి విక్రమార్కలకు కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన పుష్పగుచ్ఛం అందించి ఘనస్వాగతం పలికారు. సీఎం రేవంత్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.
ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, మంత్రివర్గ సభ్యులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కేరళ ముఖ్యమంత్రి సతీశన్, హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తదితర ప్రముఖులు కూడా హాజరయ్యారు.





