దానంపై అన‌ర్హత‌ వేటు ప్రజాస్వామ్య విజయం

– బీజేపీ ఎంపీ అరుణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన నిర్ణయం ప్రజాస్వామ్య విజయమని ఎంపీ, బీజేపీ తమిళనాడు సహ ఇన్‌చార్జి డీకే అరుణ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ కాంగ్రెస్, బీఆరఎస్ పార్టీలు సాగించిన అనైతిక రాజకీయాలకు ఈ తీర్పు చెంపపెట్టు అన్నారు. రాజీనామా చేయకుండా వ్యక్తిగత, స్వార్థ రాజకీయ ప్రయోజ నాల కోసం అధికార కాంగ్రెస్‌లో చేరి ఎంపీగా పోటీ చేయడం తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘన అని, ఇది దిగజారుడు, దివాలాకోరు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం దుర్మార్గమన్నారు. హుందా రాజకీయాలకు పాతరేసి రాజకీయ విలువలను నీరుగార్చడం అత్యంత శోచనీయమన్నారు. ఫిరాయింపును హైకోర్టు తప్పుబట్టినప్పటికీ సిగ్గు లేకుండా సుప్రీం కోర్టును ఆశ్రయించడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఒక చేత రాజ్యాంగం పట్టుకుని, మరో చేతితో పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ జాతీయ నాయకత్వ ద్వంద్వ నీతికి అద్దంపడుతోందని, సుప్రీం తీర్పుతో రాహుల్ గాంధీ సిగ్గుపడాలని అన్నారు. ప్రజల ఓట్లకు విలువ లేకుండా కుటిల రాజకీయ క్రీడకు తెరలేపిన ఆ పార్టీలకు ఖైరతాబాద్ ప్రజలు ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని అన్నారు. ఇప్పటికైనా పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని అరుణ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *